Latest Updates
-
జూన్ 5 గ్రహాల గమనం: ఈ రాశుల వారికి కెరీర్, ఆర్థికంగా ఊహించని అదృష్టం.. మీ రాశి ఉందా? -
వృషభం, సింహం, కుంభ రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఈరోజు మీ అదృష్టం ఎలా ఉంది? - శుక్రవారం, 05 జూన్ 2026 -
బ్రేకప్ అయినా జ్ఞాపకాలతో తీరని వేదన.. మాజీ లవర్‌ను మరిచిపోవడం ఎలా.? -
ప్రొటీన్స్, ఫైబర్ గని..మీ పొట్టను కరిగించే గ్రీన్ దోశ..ఎలా చేసుకోవాలంటే -
ఎదిగే పిల్లల కోసం చింతాకు పప్పు.. రాయలసీమ స్టైల్లో ఇలా చేస్తే వావ్ అవ్వాల్సిందే.! -
ఈ ఆయిల్‌తో మసాజ్ చేస్తే నెల రోజుల్లోనే చిక్కటి కనుబొమ్మలు మీ సొంతం.! -
ఫ్యాట్ తక్కువ, ఎనర్జీ ఎక్కువ.. గుంటూరు స్పెషల్ వంకాయ ఇగురు పప్పు.! -
ఎండలో ఫేస్ ట్యాన్ అవుతుందా?.. ఈ నాలుగు పప్పులతో మెరిసే చర్మం మీ సొంతం.! -
శని గ్రహంశాపమా, వరమా? -
ఎలాంటి సాస్‌లు లేకుండా గోబీ 65.. ఇలా చేస్తే ఇక స్ట్రీట్ ఫుడ్ జోలికే వెళ్లరు.!
ఉగాది వరకు ఈ 5 రాశుల వారికి డబ్బే డబ్బు.. మిగిలిన రాశుల వారి పరిస్థితి ఏంటంటే?
ఉగాది పండగ వచ్చేస్తుంది. తెలుగు వాళ్ళు సంప్రదాయబద్ధంగా ఎంతో ఇష్టంగా జరుపుకునే పండగ ఏదైనా ఉందంటే అది ఉగాది. ఊరువాడా పిల్లాజెల్లా అందరూ కలిసి చాలా పవిత్రంగా ఈ పండగను జరుపుకుంటారు. తెలుగు నూతన సంవత్సరం ఈరోజునే ప్రారంభమవుతుంది. కొత్త పంచాగం, కొత్త రాశి ఫలాలు అన్నీ ఈరోజు నుంచే మొదలవుతాయి. తెలుగు ప్రజలకు ఇంతటి పవిత్రమైన ఈ పండగకు ఇంకో ఎనిమిది రోజులు మాత్రమే మిగిలి ఉంది. ఈ నేపథ్యంలో ఈ పండగ వారంలో ఏ రాశి వారికి ఆర్ధిక పరిస్థితి బాగుంటుంది? ఏ రాశి వారికి అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.
మేష రాశి:
మేష రాశి వారికి మార్చి చివరి వారం ఆర్థికంగా అద్భుతంగా ఉంటుంది. ఆర్థికపరమైన విజయాలను ఈ రాశికి చెందిన వారు ఉగాది వారంలో పొందగలుగుతారు. వ్యాపార రంగంలోని వారు మంచి లాభాలను ఆర్జించగలుగుతారు. ఈ పండుగ వారం మీకు ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉంటుంది. వ్యాపారాన్ని విస్తరించాలనుకునే వారికి ఈ కాలం అనుకూలంగా ఉంటుంది. ఈ సమయంలో నూతన వ్యాపారం మొదలుపెట్టాలనుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది. వ్యాపారం కూడా విజయం సాధిస్తుంది.

వృషభ రాశి:
వృషభ రాశి వారికి ఉగాది వారం లేదా మార్చి నెలలో చివరి వారం ఆర్థికంగా బాగుంటుంది. డబ్బుకు సంబంధించిన ప్రయత్నాలు మంచి ప్రతిఫలాలను ఇస్తాయి. వ్యాపారులు చాలా డబ్బు సంపాదిస్తారు. కానీ పెట్టుబడి పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. పెట్టుబడి విషయంలో చిన్న తప్పు చేసినా పెద్ద మూల్యం చెల్లించుకోవాల్సి పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంటుంది. అలాగే ఈ కాలంల మీ కష్టానికి తగిన ఆర్థిక ప్రయోజనాలను పొందడంలో కూడా మీరు విజయం సాధిస్తారు.
మిథున రాశి
ఈ రాశి వారికి మార్చి చివరి వారంలో వారి కెరీర్ చాలా బాగుంటుంది. మీరు ఆర్థికంగా కూడా చాలా బాగుంటారని, ఆర్థికంగా ఎదగడానికి మీకు మంచి అవకాశం లభిస్తుందని గుర్తుంచుకోండి. వ్యాపారులు మంచి లాభాలను ఆర్జించగలుగుతారు. ఈ పండుగ వారం మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. పండగ సందర్భంగా ఈ రాశి వారు చేపట్టే పనులన్నీ విజయవంతమవుతాయి. అలాగే అనుకున్న కార్యక్రమాలన్నీ నెరవేరుతాయి.
కర్కాటక రాశి వారు
ఈ రాశికి చెందిన వారు ఈ వారం డబ్బు విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే అనవసరమైన ఖర్చులు తలెత్తవచ్చు. ఆ ఖర్చుల వలన భవిష్యత్తులో చాలా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. అందుకే ఆ ఖర్చులను తగ్గించుకోవడం మంచిది. షాపింగ్ చేయడం, స్నేహితులతో సమయం గడపడం వల్ల ఎక్కువ డబ్బు ఖర్చయ్యే అవకాశం ఉంది. కానీ ఈ వారంలో మీకు కలిగే, కష్ట సమయాల్లో మీకు ప్రియమైనవారి నుండి మద్దతు లభిస్తుంది.
సింహ రాశి,
ఈ కాలం సింహ రాశి వారికి కూడా మంచి ప్రయోజనాలను అందజేస్తుంది. ఈ రాశి వారికి ఆర్థిక పరంగా లాభదాయకంగా ఉంటుంది. వ్యాపారులు ఆశించిన లాభాలను పొందగలుగుతారు. ఈ వారం ఖర్చు తక్కువగా ఉంటుంది. అనుకున్న పనులు పూర్తవడంతో అనుకున్న విధంగా డబ్బు అందుతుంది. ఇతరుల నుంచి రావాల్సిన డబ్బులు కూడా చేతికి అందుతుంది. దీని కారణంగా ఆర్థిక పరమైన సమస్యలు తొలిగిపోయి, ఆర్ధిక స్వాతంత్య్రాన్ని పొందుతారు.
కన్య రాశి
ఈ వారం కన్య రాశి వారికి ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. అనవసరమైన ఖర్చులను తగ్గించుకుంటే మంచిది. వ్యాపారవేత్తలు తమ వ్యాపారంపై దృష్టి పెట్టాలి మరియు పెద్ద పెట్టుబడులు పెట్టకూడదు. మీ కెరీర్‌పై ఎక్కువ శ్రద్ధ వహించండి. లేకుంటే మీరు ఆర్థిక సమస్యలను ఎదుర్కొనవచ్చు.
తుల రాశి
ఈ వారం తులారాశి వారికి కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ సమయంలో ఈ రాశికి చెందిన వారు తమ పనిని అంకిత భావంతో పూర్తి చేస్తారు. దీని కారణంగా ఈ రాశికి చెందిన వారి పని ఎటువంటి అడ్డంకులు లేకుండా పూర్తవుతుంది. ఈ రాశికి చెందిన వారు ఈ వారం ఆర్థికంగా చాలా ప్రయోజనం పొందగలుగుతారు. మీరు మీ కెరీర్‌లో విజయం సాధించగలుగుతారు. అనుకున్న విధంగా ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు.
వృశ్చిక రాశి
వృశ్చిక రాశికి చెందిన జాతకులకు ఈ వారం మీరు ఆదాయం కంటే ఖర్చులే ఎక్కువగా ఎదుర్కోవలసి ఉంటుంది. ముందుగానే బడ్జెట్‌ను రూపొందించుకుని, తదనుగుణంగా ఖర్చు చేయడం ఉత్తమం. అలాగే, ముఖ్యమైన పనులను సకాలంలో పూర్తి చేయడానికి ప్రయత్నించండి, లేకుంటే మీరు ఎక్కువ డబ్బు ఖర్చు చేయాల్సి వస్తుంది.
ధనుస్సు రాశి:
ఈ వారం ధనుస్సు రాశి వారికి చాలా ఇబ్బంది కరంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ రాశికి చెందిన వ్యక్తులు ఈ వారం కొన్ని సవాళ్లను ఎదుర్కోవచ్చు. మీ ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి డబ్బుతో వ్యవహరించేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. వ్యాపారస్తులు వ్యాపారంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. పని విషయాలలో నిర్లక్ష్యంగా ఉండకండి. ఎందుకంటే ఇది ఆర్థిక నష్టాలకు దారి తీస్తుంది. దీని కారణంగా భవిష్యత్తులో ఈ రాశికి చెందిన వారు ఆర్థికపరమైన ఇబ్బందులను ఎదుర్కొని, సతమతమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.
మకర రాశి
ఉగాది పండగ వారంలో ఈ మకర రాశి వారి ఆర్థిక జీవితం చాలా బాగుంటుంది. వ్యాపారవేత్తలు మంచి ఆర్థిక లాభాలను ఆర్జించగలుగుతారు. డబ్బు సంపాదించడానికి కూడా మంచి అవకాశం ఉంటుంది. ఆరోగ్య విషయాలను నిర్లక్ష్యం చేయవద్దు. ఆరోగ్య విషయంలో నిర్లక్ష్యం చేయడం వలన సంపాదించిన డబ్బంతా ఆసుపత్రి పాలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. అందుకే ఆరోగ్యం విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ నెగ్లెట్ చేయకూడదు.
కుంభ రాశి:
ఈ సమయంలో కుంభ రాశి వ్యక్తులు ఆర్థికంగా ఎంతో ప్రయోజనం పొందుతారు. వ్యాపారవేత్తలు మంచి ఆర్థిక లాభాలను ఆర్జించగలుగుతారు. పదోన్నతి కోసం ఎదురు చూస్తున్న ఉద్యోగులకు ఈ వారం అనుకూలంగా ఉంటుంది.
మీన రాశి
ఈ సమయం మీకు ఆర్థికంగా సవాలుగా ఉంటుంది మరియు ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. మీరు పనిని సకాలంలో పూర్తి చేయడానికి ప్రయత్నించాలి. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి, దానికోసం ఖర్చులు కూడా ఉంటాయి. ఆరోగ్య సంబంధిత విషయాలను నిర్లక్ష్యం చేయవద్దు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications