Latest Updates
-
రోజుకు ఎన్నిసార్లు గ్యాస్ వదలడం నార్మల్? మహిళలు, పురుషుల్లో ఎవరికి ఎక్కువంటే..! -
అద్భుతమా, మూఢ నమ్మకమా.? దశాబ్దాల సంప్రదాయం, లక్షలాది ప్రజల నమ్మకం.. చేప ప్రసాదం వెనకున్న కథేంటి.? -
కుక్కర్ విజిల్ వేసినప్పుడు పప్పు పొంగుతోందా? ఈ పాతకాలపు చిట్కాతో చెక్..! -
ఈ 5 రాశుల వారికి కెరీర్లో బంపర్ ఆఫర్.. అకస్మాత్తుగా ధనలాభం ఖాయం! -
విష్కుంభ యోగం ముగింపు.. ప్రీతి యోగంతో ఈ రాశుల వారికి అదృష్టం, పనుల్లో విజయం ఖాయం! -
తిరుపతి లడ్డూ ఎందుకు అంత ప్రత్యేకం? దాని వెనుక ఉన్న పవిత్ర రహస్యం చాలామందికి తెలియదు! -
జూన్ 8 గ్రహాల గోచారం: మీన రాశిలో శని-చంద్రుల కలయిక.. ఈ రాశుల వారికి ఊహించని మార్పులు! -
మేషం, సింహం, ధనుస్సు రాశుల వారికి అద్భుతమైన యోగం..! - సోమవారం, 08 జూన్ 2026 -
కండరాలకు బలాన్నిచ్చే నేచురల్ ప్రోటీన్ పౌడర్..ఇంట్లోనే చేసుకోండిలా.. -
పితృ దోషం వల్లే జీవితంలో సమస్యలొస్తున్నాయా? పూర్వీకుల ఆత్మల గురించి శాస్త్రాలు చెప్పే రహస్యాలు ఇవే!
మీ ఇంట్లో మనీ ప్లాంట్ ఉందా? ఈ వాస్తు నియమాలు పాటిస్తేనే సిరిసంపదలు!
పచ్చని మొక్కల మధ్య గడపడం ఎవరికి ఇష్టం ఉండదు? మనసును ఆహ్లాదపరిచే ఆ పచ్చదనం, ఇంటికి కొత్త అందాన్ని, జీవకళను తెస్తుంది. తోటపనిని ప్రేమించే వారు తమ ఇంటి ఆవరణలో, బాల్కనీలలో, గదులలో రకరకాల మొక్కలను పెంచుతూ వాటిని కంటికి రెప్పలా కాపాడుకుంటారు. సమయానికి నీరు పోయడం, ఎరువులు వేయడం, కత్తిరించడం వంటి పనులతో వాటిని ఆరోగ్యంగా పెంచుతారు.
అయితే మీరు గమనించాల్సిన ముఖ్యమైన విషయం ఒకటి ఉంది. మొక్కలకు కేవలం భౌతిక సంరక్షణ మాత్రమే సరిపోదు. వాటిని సరైన దిశలో ఉంచడం కూడా అంతే ముఖ్యం. వాస్తు శాస్త్రం ప్రకారం,మనం నివసించే ఇంటికి దిశ ఎంత ప్రధానమో ఆ ఇంట్లో ఉంచే వస్తువులకు, మొక్కలకు కూడా దిశ అంతే ప్రధానం. తప్పు దిశలో పెట్టిన ఒక మొక్క.. మీ ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీని ఆహ్వానించి, ఆర్థిక నష్టాలకు, అనారోగ్యాలకు, కుటుంబ కలహాలకు కారణం అవుతుంది. అందుకే పచ్చని మొక్కలతో పాటు వాస్తు నియమాలను పాటిస్తే మీ ఇల్లు ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యంతో విలసిల్లుతుంది.

మనీ ప్లాంట్
నేటి ఆధునిక గృహాలలో మనం తప్పకుండా చూసే మొక్క మనీ ప్లాంట్. దీనిని కేవలం అలంకార వస్తువుగా భావించి బాల్కనీలో, హాలులో, పడకగదిలో పెట్టేస్తుంటారు. కానీ ఈ మొక్కకు జ్యోతిష్య, వాస్తు శాస్త్రాలలో ఎంతో ప్రాముఖ్యత ఉంది. మనీ ప్లాంట్ శుక్ర గ్రహానికి ప్రతీక. శుక్రుడు సౌందర్యానికి, ప్రేమకు, భౌతిక సుఖాలకు, ఐశ్వర్యానికి అధిపతి. అందుకే మనీ ప్లాంట్‌ను సరైన పద్ధతిలో ఇంట్లో పెంచుకుంటే, అది డబ్బును ఆకర్షించే అయస్కాంతంలా పనిచేస్తుందని నమ్ముతారు. ఇది ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీని తరిమికొట్టి, సానుకూల వాతావరణాన్ని సృష్టిస్తుంది. ఆర్థిక ఇబ్బందులను తొలగించి, సంపద వృద్ధి చెందడానికి సహాయపడుతుంది.
అదృష్టాన్ని ఆహ్వానించే ఆగ్నేయం
వాస్తు శాస్త్రం ప్రకారం మనీ ప్లాంట్ ను నాటడానికి అత్యంత శ్రేష్ఠమైన, శక్తివంతమైన దిశ ఆగ్నేయం (South-East). దీనినే అగ్ని మూల అని కూడా అంటారు. ఈ దిశలో మనీ ప్లాంట్ ను ఉంచడం వల్ల అద్భుతమైన శుభ ఫలితాలు కలుగుతాయి. ఆగ్నేయ దిశకు అధిపతి విఘ్నేశ్వరుడు కాగా.. ప్రతినిధి శుక్ర గ్రహం. ఈ దిశ లక్ష్మీదేవికి కూడా ప్రీతిపాత్రమైనదిగా భావిస్తారు. విఘ్నాలను తొలగించే వినాయకుడు, ఐశ్వర్యాన్నిచ్చే శుక్రుడు, సంపదలిచ్చే లక్ష్మీదేవి అనుగ్రహం ఒకేసారి లభిస్తుంది.
ప్రయోజనాలు
-ఆర్థిక పరిస్థితి మెరుగుపడి, ధన ప్రవాహం పెరుగుతుంది.
-ఇంట్లో అనవసర ఖర్చులు తగ్గి, పొదుపు పెరుగుతుంది.
-వ్యాపారంలో, ఉద్యోగంలో పురోగతి ఉంటుంది.
-కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానురాగాలు, సామరస్యం వెల్లివిరుస్తాయి.
-ఇంట్లోని వాస్తు దోషాలు తొలగిపోయి, సానుకూల శక్తి నిండి ఉంటుంది.
-ఈ దిశలలో అస్సలు పెట్టవద్దు. నష్టాలను కొనితెచ్చుకోకండి.

ఈ దిశలలో మనీ ప్లాంట్ ను అస్సలు ఉంచకూడదు
ఈశాన్యం
మనీ ప్లాంట్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ ఈశాన్య దిశలో ఉంచకూడదు. ఈ దిశకు అధిపతి బృహస్పతి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్రుడికి, బృహస్పతికి మధ్య శత్రుత్వం ఉంటుంది. శత్రు గ్రహాల కలయిక వల్ల తీవ్రమైన ప్రతికూల ఫలితాలు ఎదురవుతాయి. ఈశాన్యంలో మనీ ప్లాంట్ ఉంటే ఆర్థిక నష్టాలు, అప్పుల బాధ, ఆరోగ్య సమస్యలు, కుటుంబంలో విభేదాలు పెరుగుతాయి. ఇంటి యజమాని సరైన నిర్ణయాలు తీసుకోలేక ఇబ్బంది పడతారు.
నైరుతి,పశ్చిమ
ఈ దిశలలో కూడా మనీ ప్లాంట్ ను ఉంచడం మంచిది కాదు. ఇది కెరీర్ లో స్థిరత్వాన్ని దెబ్బతీస్తుంది. ఉద్యోగంలో ఎదుగుదల ఆగిపోవడం, ప్రమోషన్లు రాకపోవడం, కొత్త అవకాశాలు చేజారిపోవడం వంటి సమస్యలు తలెత్తుతాయి. జీవితంలో స్తబ్దత ఏర్పడుతుంది.
మరికొన్ని ముఖ్య సూచనలు
-మనీ ప్లాంట్ ను వీలైనంత వరకు ఇంటి లోపల పెంచడమే శ్రేయస్కరం. అప్పుడే దాని సానుకూల శక్తి ఇంట్లో పూర్తిగా వ్యాపిస్తుంది.
-మనీ ప్లాంట్ తీగలు నేలపై పాకకుండా, కిందికి వేలాడకుండా చూసుకోవాలి. తీగలు ఎప్పుడూ పైకి ఎగబాకేలా ఏర్పాట్లు చేయాలి. పైకి ఎదుగుతున్న తీగలు మీ అభివృద్ధికి, ఐశ్వర్యానికి సంకేతం.
-ఎండిపోయిన లేదా పసుపు రంగులోకి మారిన ఆకులను వెంటనే తొలగించాలి. వాడిపోయిన మొక్క ఇంట్లో ప్రతికూలతను సూచిస్తుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications