Latest Updates
-
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్‌ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.! -
రోజూ కొద్దిగా అల్లం తింటే ఏమవుతుందో తెలుసా! -
వర్షాకాలం అలర్ట్.. గర్భిణీలు ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి.! -
క్యాప్సికం టమాటో మసాలా కర్రీ..ఆలోచించొద్దు అద్దిరిపోతుంది అంతే..ఎలా చేసుకోవాలంటే.. -
ఆ ఆలయంలో మట్టితో పూజించి పొలంలో చల్లుకుంటే.. బంగారు పంటలు పండాల్సిందే.! -
శృంగార సమయంలో మహిళలు ఈ తప్పు ఎట్టిపరిస్థితుల్లో చేయకూడదు! -
మీ పిల్లలు బొటనవేలుని అదే పనిగా చీకుతుంటే.. ఈ వ్యాధులకి తలుపు తెరిచినట్లే.! -
జీరో ఆయిల్,సూపర్ టేస్ట్..చపాతీ, పుల్కాల్లోకి పనీర్ మటర్ మలై ఇలా చేసేయండి! -
సూర్యుడి నక్షత్రంలోకి శుక్ర గ్రహ గోచారం.. ఈ రాశుల వారికి చరిష్మా మామూలుగా ఉండదు.!
నీచభంగ రాజయోగం.. ఈ రాశులకు చెందిన వారి ఇంట్లో డబ్బుల వర్షం కురుస్తుంది!
జోతిష్య శాస్త్రం ప్రకారం ప్రతి గ్రహం తమ గమనాన్ని మార్చుకుంటాయి. ప్రతి గ్రహం నిర్దిష్టమైన సమయంలో తమ గమనాన్ని మార్చుకోవడం వల్ల పలు యోగాలు కూడా ఏర్పడనున్నాయి. అయితే నవగ్రహాల్లో చంద్ర గ్రహం అత్యంత తొందరగా, అతి తక్కువ సమయంలో అంటే కేవలం 2 లేదా రెండున్నర రోజుల్లో తన గమనంతో పాటు రాశిని కూడా మార్చుకోగలడు.
ప్రస్తుతం చంద్రుడు కర్కాటక రాశికి అధిపతిగా ఉన్నాడు. అయితే ప్రస్తుతం కర్కాటక రాశికి అధిపతిగా గురువు వచ్చేస్తున్నాడు. దీంతో చంద్రుడు మకర రాశిలోకి ప్రవేశించాడు. దీని కారణంగా నీచభంగ రాజయోగం ఏర్పడుతుంది. ఈ రాజయోగం కారణంగా పలు రాశుల వారి జీవితం మారిపోనుంది. ఆయా రాశుల వారి ఇంట్లో ధనవర్షం కురవనుంది. ఇంతకీ ఆ రాశులు ఏంటి? ఏ రాశుల వారికి ధనం అదృష్టం పట్టనుందో ఇప్పుడు తెలుసుకుందాం.

మేష రాశి
మకర రాశిలోకి చంద్రుడి ప్రవేశం కారణంగా మేష రాశి వారికి ఈ నీచభంగ రాజయోగం ఏర్పడనుంది. ఈ రాజయోగం కారణంగా మేష రాశి వారికి అన్ని విధాలుగా కలిసి వస్థుంది. మేష రాశి వారి జీవితంలో ఎన్నో మార్పులు చోటు చేసుకోనున్నాయి. మేష రాశి వారి ఆదాయ మార్గాలు పెరగనున్నాయి. నాలుగు వైపుల నుంచి డబ్బులు ప్రభావంలా తమ జీవితంలోకి వచ్చి పడుతుంది.
వ్యాపారులకు భారీగా లాభాలు వచ్చి పడతాయి. అనుకోని విధంగా వ్యాపారం విజయవంతమవుతుంది. వృత్తిని నమ్ముకున్న వారికి అన్ని విధాలుగా కలిసి రావడంతో పాటు అనుకున్న విధంగా తమ జీవితాన్ని కొనసాగించే అవకాశం ఉంది. ఉద్యోగులకు పదోన్నతి, జీతాలు పెరిగే అవకాశం ఉంది. రాజకీయాల్లో ఉన్న వ్యక్తులు విజయం వైపు దూసుకెళ్తారు. సమాజంలో గుర్తింపు లభిస్తుంది.
వృషభ రాశి
గురువు, చంద్రుడు తమ గమనాన్ని మార్చుకోవడం, ఒక రాశి నుంచి మరొక రాశిలోకి ప్రవేశించడం వల్ల వృషభ రాశి వారికి కూడా ఈ నీచభంగ రాజయోగం ఏర్పడనుంది. ఈ రాజయోగం ధైర్యానికి ప్రతీకగా చెప్పుకుంటారు. వృషభ రాశి వారికి ఈ యోగం ఏర్పడనున్న కారణంగా.. వృషభ రాశి వారి జాతకుల్లో ధైర్యం పెరుగుతుంది. అలాగే తాము ఏ పనినైనా చేయగలమని ఆత్మవిశ్వాసం వారిలో కలుగుతుంది. ఎప్పటినుంచి పట్టి పీడిస్తున్న సమస్యలు తొలిగిపోవడంతో పాటు, ఒత్తిడి దూరమై ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతారు.
వ్యాపార రంగాల్లో ఉన్న వ్యక్తులకు భారీగా లాభాలు వస్తాయి. స్నేహితులు, సహచరుల మద్దతుతో వ్యాపారాన్ని మరో స్థాయికి విస్తరించే అవకాశం ఉంది. దీంతోపాటు ఎంతో కాలంగా పెండింగ్‌లో ఉన్న ముఖ్యమైన పనులు కూడా స్నేహితులు, సహచరుల సహకారంతో పూర్తి చేసుకోగలుగుతారు. ఉద్యోగులకు పదోన్నతులు లభిస్తుంది. ప్రతి విషయంలో కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ రాశి వారికి ఈ రాజయోగం అరుదైన ధన యోగాన్ని తీసుకురానుంది.
కర్కాటక రాశి:
చంద్రుడు, గురువు తమ గమనంలో మార్పులు చేసుకుంటున్నాయి. దీని కారణంగా కర్కాటక రాశి వారికి కూడా ఈ నీచభంగ రాజయోగం పట్టుకోనుంది. ఇది కర్కాటక రాశి వారికి గౌరవం, ప్రతిష్టలు తీసుకురానుంది. వైవాహిక జీవితం మధురంగా మారనుంది. ఆదాయం అన్ని విధాలుగా కలిసివస్తుంది. ఆదాయ మార్గాలు కూడా భారీగా పెరగనున్నాయి. ప్రేమ జీవితం బాగుటుంది. చేపట్టే పనుల్లో విజయం సాధిస్తారు. పెళ్లిళ్లు కానీ వ్యక్తులకు మంచి కుటుంబంలోని వ్యక్తితో పెళ్లి కుదురుతుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications