సెప్టెంబర్ 11 రాత్రి 7 గంటల తర్వాత..వృషభం, సింహం, వృశ్చిక రాశులకు లాటరీ తగిలినంత అదృష్టం!

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్రవారం(2026 సెప్టెంబర్ 11) సాయంత్రం 7:08 గంటలకు చంద్రుడు సింహ రాశిని వీడి కన్యా రాశిలోకి ప్రవేశించనున్నాడు. ఈ అద్భుతమైన గోచారం సెప్టెంబర్ 14వ తేదీ తెల్లవారుజామున 1:26 గంటల వరకు కొనసాగుతుంది.

చంద్రుని స్థానచలనం మూడు రాశుల వారికి మాత్రం కనకవర్షం కురిపించబోతోంది. ఆర్థిక లాభాలు, వృత్తిపరమైన ఎదుగుదలతో అదృష్టాన్ని అందుకోబోతున్న ఆ రాశులేమిటో ఇక్కడ చూడండి.

Moon Transit in Virgo on 2026 Spetember 11 Taurus Leo Scorpio to Experience Huge Financial Gains

వృషభ రాశి

ఈ గోచార సమయంలో చంద్రుడు మీ రాశి నుండి ఐదవ ఇంట్లోకి ప్రవేశిస్తాడు. జ్యోతిష్యం ప్రకారం ఇది మీకు అత్యంత శుభదాయకమైన సమయం. ముఖ్యంగా ఆర్థికపరంగా ఈ రాశి వారికి తిరుగుండదు. కొత్త ఆదాయ మార్గాలు పుట్టుకొస్తాయి. మీరు గతంలో పెట్టిన పెట్టుబడుల నుండి ఇప్పుడు ఊహించని భారీ లాభాలు చేతికి అందుతాయి. పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న వారి కష్టానికి తగిన ప్రతిఫలం దక్కుతుంది. ఉద్యోగుల పనితీరుకు పై అధికారుల నుండి ప్రశంసలు దక్కుతాయి. కొత్త వ్యాపారాలు ప్రారంభించాలనే మీ కలలు సాకారమయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి.

గణేష్ పూజ తర్వాత అరుదైన లక్ష్మీ నారాయణ యోగం..వాళ్లకి స్వర్ణ యుగమే!గణేష్ పూజ తర్వాత అరుదైన లక్ష్మీ నారాయణ యోగం..వాళ్లకి స్వర్ణ యుగమే!

సింహ రాశి

సింహ రాశి జాతకులకు చంద్రుడు సంపదకు ప్రాతినిధ్యం వహించే రెండవ ఇంట్లో (ధన స్థానం) సంచరిస్తాడు. దీనివల్ల మీ ఆర్థిక స్థితిగతులు అమాంతం మెరుగుపడతాయి. ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. వ్యాపారస్తులకు మధ్యలో ఆగిపోయిన డీల్స్ మళ్లీ పట్టాలెక్కుతాయి. పారాన్ని మరింతగా విస్తరించి లాభాలు గడిస్తారు. వారసత్వ ఆస్తుల ద్వారా విశేషమైన ఆర్థిక ప్రయోజనాలు చేకూరుతాయి. మీ పిల్లల నుండి శుభవార్తను వింటారు.

వృశ్చిక రాశి

చంద్రుడు మీ రాశి నుండి 11వ ఇంట్లో సంచరిస్తాడు. జ్యోతిష్య శాస్త్రంలో 11వ ఇంటిని లాభ స్థానం అంటారు. ఈ శుభ పరిణామం వల్ల ప్రతి పనిలోనూ మీకు లాభాలే సిద్ధిస్తాయి. ఉద్యోగస్తులకు ఆదాయం పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఎవరికైనా అప్పుగా ఇచ్చి, చాలా కాలంగా తిరిగి రాని డబ్బు ఇప్పుడు మీ చేతికి వస్తుంది. విదేశాలకు వెళ్లాలని కలలు కనేవారికి ఎదురుచూపులు ఫలించి తీపి కబురు అందుతుంది. నిరుద్యోగులకు మంచి ఉద్యోగం లభిస్తుంది. అన్నదమ్ముల నుండి పూర్తి మద్దతు, అండదండలు లభిస్తాయి.

Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.

Story first published: Thursday, September 10, 2026, 21:52 [IST]
Desktop Bottom Promotion