Latest Updates
-
జూన్ 8 గ్రహాల గోచారం: మీన రాశిలో శని-చంద్రుల కలయిక.. ఈ రాశుల వారికి ఊహించని మార్పులు! -
మేషం, సింహం, ధనుస్సు రాశుల వారికి అద్భుతమైన యోగం..! - సోమవారం, 08 జూన్ 2026 -
కండరాలకు బలాన్నిచ్చే నేచురల్ ప్రోటీన్ పౌడర్..ఇంట్లోనే చేసుకోండిలా.. -
పితృ దోషం వల్లే జీవితంలో సమస్యలొస్తున్నాయా? పూర్వీకుల ఆత్మల గురించి శాస్త్రాలు చెప్పే రహస్యాలు ఇవే! -
2026 అంతర్జాతీయ యోగా దినోత్సవ ప్రత్యేకత ఇదే! -
ప్రేమలో అనుబంధం ఎప్పుడు మానసిక భారంగా మారుతుంది -
మైదా లేదు, భయం లేదు.. ఇంట్లోనే సులభంగా హెల్దీ బ్రెడ్-రవ్వ పిజ్జా.. -
మీ మొబైల్ ఫోన్లో ఈ వాల్ పేపర్ ఉంటే.. రోజూ అదృష్టం మీ వెంటే.! -
కలలో బొద్దింకలు కనిపిస్తే.. మీ జీవితంలో ఏం జరుగుతుందో తెలుసా.? -
జేబులో రూ.200 ఉంటే చాలు.. హైదరాబాద్ లో మీ ఫ్రెండ్స్ తో గడిపే సూపర్ ప్లాన్స్ ఇవే!
Unluckuy zodiac signs in 2025: 2025లో నష్ట జాతకులు వీళ్లే.. ఇందులో మీ రాశి ఉందేమో చూసుకోండి
కొత్త ఏడాదిలోకి ప్రవేశించడానికి మరికొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. కొత్త ఏడాది నుంచి అది చేయాలి,ఇది చేయాలి అని ఇప్పటినుంచే చాలా మంది ఫ్లాన్స్ వేసుకుంటున్నారు. అయితే మనం ఎన్ని ఫ్లాన్స్ వేసుకున్నా మన ప్రయత్నాలకు మద్దతు ఇవ్వడంలో గ్రహాల స్థానాలు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి.
జోతిష్యశాస్త్రం ప్రకారం 2025లో కొన్ని రాశుల వారికి అద్భతంగా ఉండగా..మరికొన్ని రాశుల వారికి కఠిన సమయంగా ఉంటుంది. జీవితంలొ చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. గ్రహ స్థానాల కారణంగా ఎక్కువ సమస్యలు, అపకీర్తిని ఎదుర్కొనే అవకాశం ఉంది. వృత్తి జీవితంలోనే కాకుండా వ్యక్తిగత జీవితంలోనూ ఎదురుదెబ్బలు తగులుతున్నాయి.

2025లో సవాళ్లు,సమస్యలను ఎదుర్కోబోతున్న రాశులు ఇవే
మిధున రాశి
మిధునరాశి వాళ్లకి 2025 చాలా కష్టతరమైన సంవత్సరంగా ఉంటుంది. కార్యాలయంలో ఉన్నతాధికారులు, సహోద్యోగుల నుండి అనేక ఇబ్బందులను ఎదుర్కోవచ్చు. మీ లక్ష్యంలో అనేక అడ్డంకులు ఎదురవుతాయి. ఆర్థిక విషయాలలో చాలా ఇబ్బందులు ఉండవచ్చు, కాబట్టి ఈ సమయంలో పెద్ద పెట్టుబడులకు దూరంగా ఉండండి. వ్యక్తిగత సంబంధాలలో ఒడిదుడుకులు ఎదుర్కోవలసి వస్తుంది. కుటుంబం, కొంతమంది స్నేహితులతో జాగ్రత్తగా ఉండండి. కుటుంబ సంబంధాలకు సంబంధించిన నిర్ణయాలు బాగా ఆచితూచి తీసుకోండి.
కర్కాటక రాశి
కర్కాటక రాశి వారికి కొత్త సంవత్సరం కుటుంబ జీవితంలో టెన్షన్ పెరుగుతుంది. దీనివల్ల ఆరోగ్య సమస్యలు కూడా తలెత్తుతాయి. వ్యక్తిగత, సామాజిక సంబంధాలలో గందరగోళం ఉండవచ్చు. కొంతమంది బంధువుల చేతుల్లో మోసపోతారు లేదా పనిలో సహోద్యోగులచే మోసగించబడవచ్చు. 2025లో మీరు మీ శక్తిని సరైన విధంగా ఉపయోగించవలసి ఉంటుంది లేకుంటే మీరు అనేక సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది.
ధనుస్సు రాశి
ధనుస్సు రాశి వారికి శని 4వ ఇంటిలో ఉండటం వల్ల 2025 మార్చి వరకు ఎలాంటి లాభమూ ఉండదు. ఎక్కువ లాభాలను ఆశించి మోసపోకూడదు. శని ప్రతికూల ప్రభావం కారణంగా ధనుస్సు రాశి వారు ఈ సంవత్సరం వృత్తి, ప్రేమ జీవితం, ఆర్థిక పరిస్థితిలో అనేక సమస్యలను ఎదుర్కొంటారు. కుటుంబ సంబంధాలు, ఆర్థిక జీవితంలో సమస్యలు ఉంటాయి. ఓపిక, ఓర్పు లేకపోతే ఈ ఏడాది చాలా నష్టాలను చవిచూడాల్సి వస్తుంది.
కుంభ రాశి
కుంభరాశి వారు 2025లో అనేక వివాదాలను ఎదుర్కొంటారు. ముఖ్యంగా ఉద్యోగం, వృత్తిలో అనేక గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటారు. గురుడు ప్రతికూల స్థితిలో ఉండడం వల్ల ఆర్థిక పరిస్థితిలో హెచ్చు తగ్గులు ఉంటాయి,ఖర్చులు పెరుగుతాయి. ఏదైనా ముఖ్యమైన పెట్టుబడి పెట్టే ముందు జాగ్రత్తగా ఆలోచించండి. శుక్రుడు ఐదవ ఇంట్లోకి ప్రవేశించడంతో ప్రేమ జీవితంలో కూడా అనేక సమస్యలను ఎదుర్కొంటారు. కుటుంబ సభ్యుల మధ్య వాదోపవాదాలు ఉండవచ్చు.
మీనరాశి
ప్రతికూల గ్రహ స్థానాల కారణంగా మీన రాశి వాళ్లు 2025లో ఆరోగ్యం, కుటుంబ జీవితంలో సమస్యలను ఎదుర్కోవచ్చు. కుటుంబ సభ్యుల ఆరోగ్య సమస్యతో భారీ ఖర్చులు వస్తాయి. వారి ఆరోగ్యంతో ఆందోళనలు పెరగవచ్చు. ఆర్థిక పరిస్థితి విషయానికొస్తే ఈ సంవత్సరం చాలా నీరసంగా ఉంటుంది. ఆకస్మిక ఖర్చులు పెరుగుతాయి. రిలేషన్స్ నెగిటివ్ భావోద్వేగాలతో నిండి ఉన్నాయి. మీ సంబంధాలను కాపాడుకోవడానికి సహనం చాలా ముఖ్యం.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications