Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
ఆ టైంలో కాకిని చూస్తే కాపురం నాశనమే!..అరిచిందంటే మరణమే!
ఇప్పుడంటే స్మార్ట్ ఫోన్స్,ల్యాప్ ట్యాప్ లు అన్నీ వచ్చేశాయి గానీ ఒకప్పుడు మన పూర్వీకులు దూరంలో ఉండే వ్యక్తులతో కమ్యూనికేషన్ కోసం పక్షులను(birds) వాడుకునేవాళ్లు. పక్షుల ద్వారా తమ సందేశాలను దూరాన ఉన్న వ్యక్తికి తెలియజేసేవాళ్లు..అక్కడ వాళ్లు ఇచ్చిన రిప్లైని ఆ పక్షి తిరిగొచ్చి మళ్లీ ఇవతలి వ్యక్తికి అందించేంది. అనేక పాత సినిమాల్లో కూడా మనం ఈ సీన్స్ ఎక్కువగా చూసే ఉంటాం. అయితే పోస్టాఫీసులు,తర్వాత అనేక ఇతర కొరియర్ సర్వీసులు అందులోకి వచ్చేశాయి. దీంతో క్రమంగా పక్షులను సందేశాల కోసం ఉపయోగించడం తగ్గిపోయింది. ఫోన్లు వచ్చాక అసలు పూర్తిగా పక్షులతో సందేశం చేరవేసే పద్దతి కనుమరుగైంది.
అయితే పక్షులకు సంబంధించి కొన్ని మూఢనమ్మకాలు,భావనలు మనలో చాలామందికి ఉంటాయి. పనిమీద ఇంటి నుంచి బయటకువెళ్లేటప్పుడు,ఎక్కడికైనా వచ్చినప్పుడు ఇలా కొన్ని పక్షులు ఎదురొస్తే శుభాలు,అశుభాలు ఉంటాయనే మూఢనమ్మకాలు మనలో చలామందికి ఉండే ఉంటాయి. ఈ కంప్యూటర్ యుగంలో మూఢనమ్మకాలపై నమ్మకం తగ్గినప్పటికీ పక్షులపై ఇంకా అనేక నమ్మకాలు చాలామందిలో ఉన్నాయి. అందులో ఒక మూఢ నమ్మకం ఏంటంటే కాకిని చూస్తే దురదృష్టం కలుగుతుందని..నెమలిని చూడటం శుభసూచకమని నమ్ముతారు. పక్షి అకస్మాత్తుగా తలపై తగిలితే అది శుభ లేదా అశుభకరమైన సంఘటనకు సంకేతంగా పరిగణించబడుతుంది. పురాతన కాలంలో దీనిని అశుభకరమైనదిగా పరిగణించేవాళ్లు. కానీ జ్యోతిష్యం దానిని పూర్తిగా తిరస్కరించింది.

పక్షుల కదలికలకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఏదైనా శుభ కార్యం సమయంలో పక్షి తల వంచి ఉంటే అది అదృష్టానికి చిహ్నంగా పరిగణించబడుతుంది. అదే సమయంలో ఒక పక్షి వచ్చి భుజంపై కూర్చుంటే, అది ఆర్థిక లాభం, శుభవార్తకు చిహ్నంగా పరిగణించబడుతుంది. సమీప భవిష్యత్తులో మీ జీవితంలో ఆహ్లాదకరమైన మార్పులు రావచ్చని కూడా అది సంకేతం అని చెప్పబడింది.
అయితే మన మిత్రదేశం రష్యాలోనే పక్షుల శకునాలు, చెడు శకునాలు పుట్టాయని నమ్ముతారు. అక్కడి ప్రజలకు ఈ విశ్వాసాలపై అపారమైన నమ్మకం ఉంటుందట. పక్షి ఆటోమేటిక్ గా తలపై కూర్చుంటే, అది అదృష్టానికి, ఆనందానికి సంకేతం అని రష్యన్లు నమ్ముతారు.
కాకులకు సంబంధించిన అపోహలు,నమ్మకాలు
కాకులు ముఖ్యంగా చెడు శకునానికి చిహ్నంగా పరిగణించబడతాయి. కళ్యాణమండపంలో కాకి వచ్చి కూర్చుంటే దంపతుల బంధం ఎక్కువ కాలం ఉండదనే అపోహ ఉంది. కొన్ని సందర్భాల్లో ఇది మరణానికి సంకేతంగా కూడా పరిగణించబడుతుంది. ఇంటి ఆవరణలో లేదా ఇంటి పై కప్పుపై కాకి అరిస్తే మీ ఇంటికి చుట్టాలు రాబోతున్నారన్న సంకేతంగా చెబుతారు. ఇంటి ప్రధాన ద్వారం దగ్గర లేదా సమీపంలో కాకి పదేపదే అరిస్తే అది సమీప బంధువు మరణానికి సంకేతంగా పరిగణిస్తారు. శకున శాస్త్రంలో దీన్ని ప్రమాదకరంగా భావిస్తారు.
కొన్ని సమయాల్లో కాకుల అరుపు ధనలాభాన్ని సూచిస్తుందని నమ్ముతారు. సూర్యోదయ సమయంలో కాకుల అరుపులను శుభప్రదంగా భావిస్తారు. ఇది మీ జీవితంలో ఆర్థిక పురోభివృద్ధి రాబోతోందనడాన్ని సూచిస్తుందని చెబుతుంటారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications