Latest Updates
-
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే! -
ఆ సమయంలోనే దంపతుల మధ్య ఎక్కువగా గొడవలు.. కారణాలేంటంటే.? -
ఈ పొడిని డైలీ అన్నం లేదా టిఫిన్లోకి తిన్నారంటే.. ఇక మందుల జోలికి వెళ్లాల్సిన పనిలేదు.! -
Teachers day recipe :ఉపాధ్యాయ దినోత్సవం స్పెషల్.. గురువుల కోసం కమ్మని పనీర్ పాయసం చేయండిలా.. -
ఉడకబెట్టాల్సిన పని లేదు.. చిక్కుడుకాయను కేటరింగ్ స్టైల్లో ఇలా చేస్తే ఫుల్గా లాగించేస్తారు.! -
తండ్రి తన ఆస్తి మొత్తం కొడుకుకి రాసిస్తే కూతురు పరిస్థితి ఏంటి? చట్టం ఏం చెబుతోంది? -
జెన్ జెడ్ తరానికి శ్రీకృష్ణుడి సందేశం.. గీత నుంచి నేటి యువత నేర్చుకోవాల్సిన కీలక పాఠాలివే.! -
కేవలం 15 నిమిషాల్లో.. పైకి కరకరలాడుతూ, లోపల సాఫ్ట్ గా ఉండే ఎగ్ పకోడి ఎలా చేసుకోవాలంటే.. -
కొత్తగా తల్లయిన వారికి అలర్ట్.. పిల్లలకు రెండేళ్ల వరకు ఇదొక్కటి అస్సలు ఇవ్వకూడదు.! -
ఉట్టికి, చిన్ని కృష్ణుడికి సంబంధమేంటి.. కృష్ణాష్టమికి ఉట్లు ఎందుకు కొడతారో తెలుసా.?
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.!
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, సెప్టెంబర్ 18న కుజుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించనున్నాడు. ఈ రాశిలో కుజుడు నీచ స్థితిలో ఉంటుండగా.. ఇప్పటికే అక్కడ గురు గ్రహం ఉండటం వల్ల నీచత్వం తొలగిపోతుంది. ఫలితంగా నీచభంగ రాజయోగం ఏర్పడి.. పలు రాశుల వారికి ముఖ్యంగా వృత్తి, వ్యాపారపరంగా కీలకం కానుంది. కుజుడు ధైర్యం, శక్తి, భూమి, ఆస్తి, శౌర్యానికి అధిపతిగా భావిస్తుండగా.. ఈ నీచ భంగ రాజయోగంతో ఏయే రాశుల వారికి కలిసి రానుందో చూద్దాం..

మేష రాశి
మేష రాశి వారి వారికి అధిపతి కుజుడు కాగా.. నీచ భంగ రాజయోగం వారికి ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగిస్తుంది. పని చేస్తున్న ప్రదేశం అంటే ఆఫీసులో మీ ప్రభావం పెరిగి కొత్త బాధ్యతలు అందుకోవచ్చు. వృత్తి, వ్యాపార రంగాల్లో ఉన్నవారు కొత్త ప్రాజెక్టుల నుంచి ప్రయోజనం అందుకుంటారు. ఆర్థికపరమైన విషయాల్లో గణనీయమైన లాభాలు అందుకుంటారు. భూమి, ఇల్లు, వాహన కొనుగోలుకి సంబంధించిన విషయాల్లో పురోగతి అందుకునే అవకాశాలు ఉంటాయి. అయితే వివిధ రంగాల్లో పెట్టుబడి పెట్టేటప్పుడు జాగ్రత్త వహించాల్సిందే.

వృషభ రాశి
కర్కాటకంలోకి కుజ గ్రహ సంచారంతో వృషభ రాశి వారికి ఆర్థికంగా వ్యవహారాలు బలపడనున్నాయి. చాలాకాలంగా పెండింగ్‌లో ఉన్న నిధులు తిరిగి వచ్చే అవకాశం ఉంది. ఆకస్మికంగా ఆదాయం, లాభాలు గడించే అవకాశాలు పెరుగుతాయి. ఆర్థిక లావాదేవీలు ఒక కొలిక్కి వస్తాయి. నిరుద్యోగులు కొత్త అవకాశాలు అందుకుంటారు. అదనపు ఆదాయ మార్గాలు కనపడతాయి. పూర్వీకుల ఆస్తికి సంబంధించిన విషయాల్లో గణనీయమైన లాభాలు చూసే అవకాశం ఉంది.

తులా రాశి
కుజ గ్రహ సంచారం, నీచ భంగ రాజయోగంతో తులారాశి వారికి ఇదొక సువర్ణావకాశం. వృత్తి, వ్యాపారాల్లో అపారమైన అవకాశాలు పొందుతారు. చేస్తున్న పనిలో గణనీయమైన విజయాన్ని అందుకుంటారు. పెద్ద ప్రాజెక్టులో మీరు చేరి మీ ప్రతిభను నిరూపించుకునే అవకాశం దొరుకుతుంది. వ్యాపార రంగంలో ఉన్నవారికి కొత్త భాగస్వామ్యాలు, విస్తరణ ప్రణాళికలు రూపొందుతాయి. ఆదాయపరమైన మార్గాలు పెరుగుతాయి. కుటుంబీకులతో సంతోషకరమైన జీవితం గడుపుతారు. పిల్లల నుంచి శుభవార్త వింటారు.

వృశ్చిక రాశి
కర్కాటక రాశిలోకి కుజ గ్రహ సంచారం, నీచ భంగ రాజయోగం వృశ్చికరాశి వారికి చాలా ప్రత్యేకం కానుంది. ఉద్యోగం చేస్తున్న వారికి పదోన్నతి, కొత్త బాధ్యతలు ఇంకా మెరుగైన అవకాశాలు అందుకోవచ్చు. దీర్ఘకాలికంగా నిలిచిపోయిన పనులు ఊపందుకుంటాయి. విదేశీ ఉద్యోగాలు, వ్యవహారాలపై ఆసక్తి ఉన్నవారు ఈ జ్యోతిష్య పరిణామంతో అనేక అవకాశాలు అందుకోవచ్చు. చేస్తున్న పనిపై ఏకాగ్రత, దృష్టి చాలా అవసరం.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications