Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
ఈ చిన్న పొరపాటే మీ ఇంట్లోని ఆర్థిక ఇబ్బందులకు, ధన నష్టానికి కారణం!
మన దైనందిన జీవితంలో బట్టలు ఉతకడం ఒక సాధారణమైన పని. అయితే కొందరు ఇప్పటికీ చేతులతో బట్టలు ఉతుకుతుంటారు..మరికొందరు తమ బిజీ లైఫ్ స్టైల్ కారణంగా వాసింగ్ మెషీన్ లో పడేస్తుంటారు. సాధారణంగా బట్టలు ఉతకడానికి చాలామంది ఒక టైం అంటూ ఏదీ పెట్టుకోరు. ఎప్పుడు వీలు దొరికితే అప్పుడు బట్టలను ఉతుకుతుంటారు. ఇక బ్యాచిలర్లు అయితే చెప్పే పనేముంది? ఎప్పుడు పడితే అప్పుడు బకెట్ లో బట్టలను సర్ప్ లో నానబెట్టి పిండేస్తుంటారు.
రోజు,టైం చూసుకోకుండా ఎప్పుడు పడితే అప్పుడు బట్టలు ఉతికేవాళ్లకు ఓ బ్యాడ్ న్యూస్. వాస్తు శాస్త్రం ప్రకారం ఈ చిన్న పొరపాటే మీ ఇంట్లోని ఆర్థిక ఇబ్బందులకు, ధన నష్టానికి కారణం కావచ్చు. బట్టలు ఉతకడం అనేది కేవలం ఒక పనిగానే కాకుండా మన ఇంటి శక్తి క్షేత్రంతో ముడిపడి ఉన్న ఈ విషయంలో కొన్ని నియమాలు పాటించడం అత్యవసరం. ఏ రోజుల్లో బట్టలు ఉతకడం శుభప్రదం, ఏ రోజుల్లో అస్సలు ఉతకకూడదో ఇక్కడ చూడండి.

ఈ రోజుల్లో బట్టలు ఉతకడం అశుభం
వాస్తు నిపుణుల ప్రకారం కొన్ని ప్రత్యేకమైన రోజుల్లో బట్టలు ఉతకడం వల్ల గ్రహాల ప్రతికూల ప్రభావం మనపై పడుతుంది.
గురువారం: ఇది దేవగురువైన బృహస్పతికి, శ్రీ మహావిష్ణువుకి ప్రీతిపాత్రమైన రోజు. ఈ రోజున బట్టలు ఉతకడం వల్ల గురు గ్రహ బలం తగ్గి, విష్ణుమూర్తి ఆగ్రహానికి గురవుతారు. ఇది ఇంట్లోని శ్రేయస్సును అడ్డుకుంటుంది.
శనివారం: శని దేవుడికి అంకితమైన ఈ రోజున బట్టలు ఉతకడం వల్ల ఆయన వక్ర దృష్టికి గురై, తీవ్రమైన దారిద్ర్యం, కష్టాలు ఎదురవుతాయి.
బుధవారం: ఈ రోజున కూడా బట్టలు ఉతకడాన్ని నివారించాలని వాస్తు శాస్త్రం సూచిస్తోంది.
ఇవే కాకుండా ఆధ్యాత్మికంగా అత్యంత శక్తివంతమైన తిథులైన అమావాస్య, పౌర్ణమి, ఏకాదశి రోజుల్లో బట్టలు ఉతకరాదు. ఈ రోజుల్లో అలా చేయడం వల్ల జీవితంపై తీవ్రమైన ప్రతికూల ప్రభావాలు పడతాయని నమ్మకం.
బట్టలు ఉతకడానికి శుభప్రదమైన రోజులు, సరైన సమయం
ఆదివారం, సోమవారం, మంగళవారం, శుక్రవారం బట్టలు ఉతకడానికి అత్యంత శ్రేష్ఠమైన రోజులుగా పరిగణిస్తారు. ఈ రోజుల్లో బట్టలు శుభ్రం చేయడం వల్ల ఇంట్లోని ప్రతికూల శక్తి తొలగిపోయి, సుఖసంతోషాలు వెల్లివిరుస్తాయి.
రోజులతో పాటు సమయం కూడా చాలా ముఖ్యం
బట్టలు ఉతకడానికి ఉదయం పూట, ముఖ్యంగా ఉదయం 9 గంటల లోపు సమయం ఉత్తమమైనది. మధ్యాహ్నం లేదా రాత్రి వేళల్లో బట్టలు ఉతకడం వల్ల ఇంట్లో కలహాలు, మానసిక ఒత్తిడి పెరిగి ధన నష్టానికి దారితీస్తుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications