Latest Updates
-
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే!
మీ రాశి ప్రకారం ఇలా చేశారంటే..బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది, అప్పుల బాధలన్నీ మటాష్
అన్ని రాశుల వ్యక్తులు సందప పొందడానికి, ఆర్థిక సమస్యలకు చెక్ పెట్టడానికి,కెరీర్ లో వృద్ధి పొందడానికి జ్యోతిష్యశాస్త్రంలో అనేక పరిహారాలు ఇవ్వబడ్డాయి. ఈ జ్యోతిష్య పరిహారాలను పాటించడం ద్వారా ప్రతి ఒక్కరూ తమ ఆర్థిక పరిస్థితిని మెరుగుపర్చుకోవచ్చు..పేదరికం నుంచి బయటపడొచ్చు. జ్యోతిష్య నిపుణులు ప్రకారం మొత్తం 12 రాశుల వారికి ప్రత్యేకంగా సూచించిన కొన్ని పవర్ ఫుల్ పరిహారాలు ఏంటీ? ఏయే రాశి వ్యక్తులు ఏమేం చేయాలో ఇప్పుడు చూద్దాం.
మేషం
మేషరాశి వ్యక్తులకు శని, శుక్ర గ్రహాలు ధన కారకులు. కాబట్టి శని దేవుడిని ప్రసన్నం చేసుకోవడం చాలా ముఖ్యం. శని దేవుడిని ప్రసన్నం చేసుకోవడానికి మేష రాశి వ్యక్తులు ప్రతిరోజూ సాయంత్రం భక్తిగా "శం శనైశ్చరాయ నమః" అనే మంత్రాన్ని భక్తితో జపించండి. ఈ మంత్రం శని దేవుడి అనుగ్రహాన్ని పొందేందుకు సహాయపడుతుంది. అలాగే ప్రతి శనివారం సాయంత్రం రావి చెట్టు దగ్గర ఆవాల నూనెతో దీపం వెలిగించండి. ఇది శని ప్రతికూల ప్రభావాలను తగ్గించ, మీకు డబ్బు వచ్చే మార్గాలను తెరుస్తుంది.ఈ ప్రభావవంతమైన చర్యలు మీ జీవితంలో ధన ప్రవాహాన్ని గణనీయంగా పెంచగలవని జ్యోతిష్య పండితులు తెలిపారు.

వృషభం
వృషభ రాశి వారికి అదృష్టాన్నిచ్చే గ్రహాలు గురు, బుధుడు. కాబట్టి ప్రతిరోజూ ఉదయం నిద్రలేవగానే సూర్య భగవానుడికి పసుపు కలిపిన నీటిని సమర్పించడం ద్వారా మీ రోజును శక్తివంతంగా ప్రారంభించండి. అంతేకాకుండా ప్రతి బుధవారం వినాయకుడిని పూజించడం మర్చిపోకండి. ఆయనకు దూర్వా గరికను, తియ్యటి లడ్డూలను సమర్పించి భక్తితో హారతి ఇవ్వండి. ఈ చిన్న చర్య మీ జీవితంలో ధన ప్రవాహాన్ని నిరంతరం ఉండేలా చేస్తుంది.
మిథునం
మిథున రాశి వ్యక్తులకు సంపద కారకులు కుజుడు, చంద్రుడు. కాబట్టి ప్రతి సోమవారం ఉదయం శక్తిమంతుడైన హనుమంతుని స్తుతిస్తూ హనుమాన్ చాలీసా పారాయణం చేయండి. అంతేకాకుండా మీ ఇంటి నుండి స్వచ్ఛమైన నీటిని తీసుకువెళ్లి శివలింగానికి భక్తితో సమర్పించండి. ఈ చిన్న ప్రయత్నం మీ ఆర్థిక ప్రవాహానికి ఒక చక్కని సమతుల్యతను అందిస్తుంది. ఈ చిన్న ప్రయత్నం మీ ఆర్థిక ప్రవాహానికి ఒక చక్కని సమతుల్యతను అందిస్తుంది. మీ ఆర్థిక జీవితంలో అభివృద్ధి ఉంచుతుంది.
కర్కాటకం
మీ జీవితంలో శుభాన్ని కలిగించే గ్రహాలు శుక్రుడు, సూర్యుడు. కాబట్టి ప్రతి రోజూ సాయంత్రం సంపదకు అధిదేవత అయిన లక్ష్మీదేవికి ఒక అందమైన గులాబీ పువ్వును సమర్పించి, స్వచ్ఛమైన నెయ్యితో దీపం వెలిగించండి. ఆ తల్లి మీపై కరుణ చూపుతుంది. అదేవిధంగా ఉదయించే సూర్యుడికి క్రమం తప్పకుండా నీటిని సమర్పించడం మరచిపోకండి. ఈ చిన్నపాటి చర్య మిమ్మల్ని డబ్బు ఆదా చేయడంలో సహాయపడుతుంది, మీ ఆదాయ మార్గాలను మరింత మెరుగుపరుస్తుంది.
సింహం
మీ ఆర్థిక ఎదుగుదలకు సహాయపడే శక్తివంతమైన గ్రహం బుధుడు. కాబట్టి ప్రతి సాయంత్రం విఘ్నాలను తొలగించే వినాయకుడికి పవిత్రమైన దూర్వా గరికను, తియ్యటి లడ్డూలను భక్తితో సమర్పించండి. ఆ తర్వాత మీ హృదయపూర్వక ప్రార్థనతో ఆయనకు హారతి ఇవ్వండి. ఈ సులభమైన పరిహారం మీ ఆర్థిక పరిస్థితిని ఊహించని విధంగా మెరుగుపరుస్తుంది.
కన్య
మీ అదృష్టాన్ని నిర్దేశించే ముఖ్యమైన గ్రహాలు చంద్రుడు,శుక్రుడు. ప్రతి ఉదయం ప్రశాంతంగా కూర్చుని శివుడిని స్మరిస్తూ "ఓం నమః శివాయ" అనే శక్తివంతమైన మంత్రాన్ని 108 సార్లు జపించండి. ఈ దివ్యమైన స్పందన మీ జీవితంలో సానుకూల శక్తిని నింపుతుంది. ప్రతి శుక్రవారం పేదవారికి స్వచ్ఛమైన తెల్లటి స్వీట్లను దానం చేయండి. ఈ చిన్న దాతృత్వం మిమ్మల్ని సులభంగా డబ్బు సంపాదించడానికి సహాయపడుతుంది..మీ జీవితంలో సంతోషాన్ని నింపుతుంది.
తుల
మీ ఆర్థికాభివృద్ధిని నిర్దేశించే ముఖ్యమైన గ్రహాలు కుజుడు, సూర్యుడు. ప్రతి ఉదయం నిద్రలేవగానే ఉదయించే సూర్యుడికి భక్తితో నీటిని సమర్పించండి. ఆ తర్వాత ధైర్యానికి ప్రతీక అయిన హనుమంతుని స్తుతిస్తూ శక్తివంతమైన హనుమాన్ చాలీసా పారాయణం చేయండి. ఈ శక్తివంతమైన పరిహారం మిమ్మల్ని పేదరికం నుండి శాశ్వతంగా విముక్తి చేస్తుందిజజ మీ జీవితంలో ఆర్థికంగా ఉన్నత స్థానాన్ని కలిగిస్తుంది.
వృశ్చికం
మీకు అండగా నిలిచే శక్తివంతమైన గ్రహాలు బుధుడు, బృహస్పతి. ప్రతి బుధవారం ఒక ఆవుకు స్వయంగా పచ్చి గడ్డిని తినిపించండి. ఇది మీకు శుభాన్ని కలిగిస్తుంది. మీ కుడి చేతి చూపుడు వేలుకు ఇత్తడితో చేసిన లేదా బంగారు ఉంగరాన్ని ధరించండి. ఈ చిన్న పరిహారం మీ డబ్బు సంబంధిత సమస్యలన్నింటినీ పరిష్కరిస్తుంది.. మీకు ఆర్థికంగా స్థిరత్వాన్ని అందిస్తుంది.
ధనుస్సు
మీ ఆర్థిక విషయాలను ప్రభావితం చేసే ముఖ్యమైన గ్రహాలు శుక్రుడు, శని. ప్రతి ఉదయం ప్రశాంతంగా కూర్చుని "శుం శుక్రాయ నమః" అనే మంత్రాన్ని జపించండి. ఈ మంత్రం మీ జీవితంలో సౌభాగ్యాన్ని, సంపదను ఆకర్షిస్తుంది. ప్రతి గురువారం ప్రేమ స్వరూపుడైన విష్ణుమూర్తికి ప్రకాశవంతమైన పసుపు రంగు పువ్వులను భక్తితో సమర్పించండి. ఈ చర్య మీరు డబ్బు సంపాదించే మార్గాలను సులభతరం చేస్తుంది. మీ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుస్తుంది.
మకరం
మీ జాతకంలో ముఖ్యమైన గ్రహాలు కుజుడు,శని దేవుడు. ప్రతి శనివారం ఉదయం, సాయంత్రం శక్తిమంతుడైన హనుమంతుని స్తుతిస్తూ హనుమాన్ చాలీసా పారాయణం చేయండి. ఆయన ఆశీస్సులు మీకు ధైర్యాన్నిస్తాయి. ప్రతి శనివారం సాయంత్రం పవిత్రమైన రావి చెట్టు కింద ఆవాల నూనెతో దీపం వెలిగించండి. ఈ చర్య మీ ఆర్థిక ప్రవాహాన్ని గణనీయంగా మెరుగుపరుస్తుంది.. మీ జీవితంలో స్థిరత్వాన్ని కలిగిస్తుంది.
కుంభం
మీ ఆర్థిక ఎదుగుదలకు సహాయం చేసే శక్తివంతమైన గ్రహం బృహస్పతి. ప్రతి గురువారం ఉదయం సూర్య భగవానుడికి పసుపు కలిపిన నీటిని సమర్పించండి. ఈ చర్య మీ జీవితంలో సానుకూల శక్తిని నింపుతుంది. మీ కుడి చేతి చూపుడు వేలుకు ఇత్తడితో చేసిన లేదా బంగారు ఉంగరాన్ని ధరించండి. ఈ చిన్న పరిహారం మీ ఆర్థిక స్థితిని మరింత బలోపేతం చేస్తుంది.. మీకు స్థిరమైన భవిష్యత్తును అందిస్తుంది.
మీనం
మీ ధనానికి కారకులైన శక్తివంతమైన గ్రహాలు శని, కుజుడు. ప్రతి మంగళవారం, శనివారం సాయంత్రం భక్తితో సుందరకాండ పారాయణం చేయండి. ఇది మీ జీవితంలో సానుకూల శక్తిని పెంచుతుంది. అంతే కాకుండా ప్రతి శనివారం సాయంత్రం పవిత్రమైన రావి చెట్టు కింద ఆవాల నూనెతో దీపం వెలిగించి ఆంజనేయ స్వామిని స్మరిస్తూ హనుమాన్ చాలీసా పారాయణం చేయండి. ఈ శక్తివంతమైన పరిహారం మీ డబ్బు సమస్యలకు తక్షణమే పరిష్కారం చూపుతుంది, మీకు ఆర్థికంగా స్థిరత్వాన్ని కలిగిస్తుంది.
అన్ని రాశుల వాళ్లు ఇలా చేయండి
మొత్తం 12 రాశుల వ్యక్తులు ప్రతిరోజూ సూర్యోదయానికి ముందు స్నానం చేసి "గజేంద్ర మోక్షం" పారాయణం చేయండి. ఈ అద్భుతమైన పరిహారం మీ అప్పులు, పేదరికం, ఇతర ఆర్థిక సమస్యలను సమూలంగా తొలగించడంలో అద్భుతంగా పనిచేస్తుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications











