Latest Updates
-
తులసి తీర్థం మహిమ? చనిపోయిన మహిళ బతికింది! -
రెస్టారెంట్ రుచిని మించేలా ఇంట్లోనే బిసిబేలే బాత్.. సులభంగా ఎలా చేయాలంటే? -
కరివేపాకు vs వేప ఆకు..పోషకాలు, ఆరోగ్య ప్రయోజనాల్లో ఏది బెస్ట్ అంటే..! -
నవరాత్రి స్పెషల్: రుచితో పాటు ఆరోగ్యం.. జీర్ణశక్తిని పెంచే అద్భుతమైన తమలపాకు కేసరి ప్రసాదం -
నోరూరించే ఆమ్లెట్ పులుసు.. పుల్లపుల్లగా, కారంకారంగా రుచి అదరహో! -
దీపావళికి ముందే ధ్వజ యోగం.. ఈ 4 రాశుల జాతకులు కోటీశ్వరులు కావడం ఖాయమా? -
నల్ల పాలు తాగుతున్న తెలుగు హీరోయిన్..ప్రయోజనాలేంటో,ఎలా చేసుకోవాలో తెలుసా? -
మటన్ సాంబార్ వండేటప్పుడు ఈ మసాలా పడితే ఆ రుచే వేరు..రాగి సంగటి, చపాతీ,అన్నంలోకి కేక -
రోగనిరోధక శక్తిని పెంచే జామకాయ పచ్చడి.. ఊరనివ్వాల్సిన పనే లేకుండా అప్పటికప్పుడే రెడీ! -
Viral Video Truth: రష్యా యువతి, బీహార్ యువకుడి ప్రేమ కథలో పెద్ద ట్విస్ట్..
సైలెంట్ కిల్లర్స్: పైకి ముక్కుసూటి.. వెనుక మహా కిలాడీలు!..ఈ 3 రాశులు ఎవరో తెలుసా?
మనం ఎదురుగా ఉన్నప్పుడు పొగుడుతూ..వెనుక గోతులు తీసే వాళ్లని తరచుగా మనం మన చుట్టూ చూస్తుంటాం. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మూడు రాశుల వారి శైలి దీనికి పూర్తి భిన్నంగా ఉంటుంది. ఈ 3 రాశుల వ్యక్తులు మీ ముఖం ముందు తీయగా అస్సలు మాట్లాడరు. ఎలాంటి మొహమాటం లేకుండా కుండబద్దలు కొట్టినట్లు చేదు నిజాలు చెప్పేస్తారు. ఆ క్షణంలో వారి మాటలు సూటిపోటిగా తగిలి, అందరి దృష్టిలో వాళ్లు విలన్లుగా మారిపోతారు.
అయితే వీరు పైకి కనిపించినంత సాధారణమైన వారు కారు. తెర వెనుక వీళ్లు ఆడే మైండ్ గేమ్ ఎవరికీ అంతుపట్టదు. పైకి ముక్కుసూటిగా ఉంటూనే, వెనుక ఉండి చక్రం తిప్పే మూడు ఏవో ఇక్కడ చూడండి.

మిథున రాశి
మిథున రాశి వారు కాస్త ఎక్కువగానే మాట్లాడతారు. ఎదుటివారు బాధపడతారేమో అని ఏమాత్రం ఆలోచించకుండా కఠినమైన నిజాలను నిర్మొహమాటంగా ముఖం మీదే చెప్పేస్తారు. దీంతో వీరంటే చాలామందికి కోపం వస్తుంది. అయితే ఈ రాశికి అధిపతి బుధుడు. బుధుడు అంటేనే తెలివితేటలు, చాకచక్యానికి మారుపేరు.
ఎవరినైనా తమ దారిలోకి తెచ్చుకోవాలంటే వీరు తమ అద్భుతమైన వాక్చాతుర్యాన్ని బ్రహ్మాస్త్రంగా వాడుకుంటారు. వీరు తెరవెనుక పక్కాగా వ్యూహాలు రచిస్తారు. చివరికి అందరూ వీరు చెప్పినట్లే వినేలా చేస్తారు. పైకి నోటి దురుసు ఉన్నవాళ్లుగా కనిపించినా, తెర వెనుక నుండి మొత్తం ఆటను తమ గుప్పిట్లోకి తెచ్చుకోవడంలో వీరు దిట్ట.
వృశ్చిక రాశి
వృశ్చిక రాశి వారిది అత్యంత రహస్య స్వభావం. వీరికి ఎప్పుడూ అందరి దృష్టిలో పడటం ఇష్టం ఉండదు. ఏదైనా తప్పు జరిగితే, ఎదుటి వ్యక్తి ఎంతటివారైనా సరే భయపడకుండా కడిగేస్తారు. ఈ ముక్కుసూటితనం వల్ల చాలామంది వీరిని కఠినాత్ములుగా చూస్తారు. అయితే వృశ్చిక రాశి వారు తమ తదుపరి ఎత్తుగడను ఎవరికీ పసిగట్టనివ్వరు.
మౌనంగా ఉంటూనే చుట్టూ ఉన్న పరిస్థితులను లోతుగా విశ్లేషిస్తారు. సరైన సమయం కోసం వేచి చూసి, ఎవరూ ఊహించని విధంగా తమ రహస్య ప్రణాళికలతో పరిస్థితులను పూర్తిగా తమకు అనుకూలంగా మార్చుకుంటారు. వీరు పైకి విలన్లుగా కనిపించినా, అసలు ఆటను శాసించేది వీరే.
కుంభ రాశి
కుంభ రాశి వారు ఎమోషన్స్ కంటే లాజిక్ కు ప్రాధాన్యత ఇస్తారు. వారు హృదయంతో కాకుండా మెదడుతో ఆలోచిస్తారు. ఎదుటివారిని ఓదార్చడం కోసం అబద్ధాలు చెప్పడం వీరికి అస్సలు నచ్చదు. ఎంత కష్టమైనా పచ్చి నిజాలు చెబుతారు. అందుకే వీరిని కొందరు కఠినాత్ములు లేదా విలన్లు అని అనుకుంటారు.
కానీ కుంభ రాశి వారి ఆలోచనా విధానం చాలా ముందుచూపుతో ఉంటుంది. ఎవరైనా వీరితో పెట్టుకోవాలని చూస్తే, వీరు ముఖాముఖిగా గొడవలకు దిగరు. దానికి బదులుగా, తెర వెనుక ఉండి తమ మేధస్సుతో ఒక అదృశ్య వల పన్నుతారు. శత్రువు తనకు తానే ఆ వలలో చిక్కుకునేలా చేయడంలో వీరికి వీరే సాటి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications
