Latest Updates
-
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.!
పిడుగుపాటుకు గురవనున్న ప్రపంచ నేత..స్విట్జర్లాండ్ కు ముప్పు..నోస్ట్రాడమస్ హెచ్చరిక!
2026 సంవత్సరం ఇప్పటికే ప్రారంభమైంది. కాలం గడుస్తున్న కొద్దీ భవిష్యత్తుపై ఆందోళన పెరుగుతోంది. సరిగ్గా ఈ తరుణంలో ప్రముఖ ఫ్రెంచ్ ప్రవక్త నోస్ట్రాడమస్ అంచనాలపై చర్చ ప్రపంచవ్యాప్తంగా మరోసారి తీవ్రమైంది.
16వ శతాబ్దానికి చెందిన కాలజ్ఞాని నోస్ట్రాడమస్ రాసిన రాతలు 2026 మానవ చరిత్రలోనే అత్యంత ప్రమాదకరమైన సంవత్సరంగా మారబోతోందని హెచ్చరిస్తున్నాయి. ఆయన రాసిన లెస్ ప్రోఫెసీస్ పుస్తకంలోని మర్మమైన పద్యాలు ఇప్పుడు విశ్లేషకులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి.

ప్రపంచ నాయకుడికి ముప్పు
నోస్ట్రాడమస్ తన పుస్తకంలో 2026 గురించి ప్రస్తావిస్తూ ఒక గొప్ప వ్యక్తి పిడుగుపాటుకు గురవుతాడని తెలిపారు. అయితే దీనిని అక్షరాలా ఆకాశం నుంచి పడే పిడుగుగా కాకుండా, ఒక సంకేతంగా చూడాలని నిపుణులు భావిస్తున్నారు.
ఇది ప్రపంచవ్యాప్తంగా ప్రజాదరణ పొందిన ఒక అగ్ర నాయకుడి హత్యను గానీ లేదా ఊహించని రాజకీయ విప్లవం ద్వారా జరగబోయే ఆకస్మిక అధికార మార్పిడిని గానీ సూచిస్తూ ఉండవచ్చని వారి వాదన. ఈ సంఘటన ప్రపంచ రాజకీయ ముఖచిత్రాన్ని పూర్తిగా మార్చేయగలదని అంచనా.
స్విట్జర్లాండ్ లో రక్తపాతం
ఎప్పుడూ శాంతితో, ప్రకృతి అందాలతో అలరారే స్విట్జర్లాండ్ గురించి నోస్ట్రాడమస్ చేసిన అంచనా అందరినీ దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. స్విట్జర్లాండ్ లోని టిసినో ప్రాంతంలో భయంకరమైన రక్తపాతం జరుగుతుందని, రాజకీయ లేదా సైనిక నిర్ణయాల వల్ల ఈ నగరం ప్రపంచ పటం నుంచే తుడిచిపెట్టుకుపోయే ప్రమాదం ఉందని ఆయన రాశారు.
ఇటీవల అక్కడి ఒక లగ్జరీ స్కీ రిసార్ట్ లో జరిగిన భారీ అగ్నిప్రమాదాన్ని, ఈ విపత్తుకు ఆరంభంగా కొందరు భావిస్తుండటం గమనార్హం.
మూడవ ప్రపంచ యుద్ధం తప్పదా
అన్నింటికంటే భయానకమైనది యుద్ధం గురించిన జోస్యం. 2026లో ఏడు నెలల పాటు కొనసాగే ఒక మహా యుద్ధం జరుగుతుందని నోస్ట్రాడమస్ ఊహించారు.
రెండు అగ్రరాజ్యాల మధ్య మొదలయ్యే ఈ ఘర్షణలో ఏ దేశం కూడా వెనక్కి తగ్గకపోవడం వల్ల అపారమైన ప్రాణనష్టం జరుగుతుందని, ఇది మూడవ ప్రపంచ యుద్ధానికి దారితీయవచ్చని నమ్ముతున్నారు.
విషాదం నుంచి పుట్టిన జోస్యాలు
1503లో జన్మించిన మైఖేల్ డి నోస్ట్రాడమస్ ఒక డాక్టర్, జ్యోతిష్కుడు.ప్లేగు వంటి భయంకరమైన వ్యాధుల వల్ల తన భార్యాపిల్లలను కోల్పోయిన వ్యక్తిగత విషాదం ఆయన జీవితాన్ని కుదిపేసింది.
ఆ వేదన, బైబిల్ లోతైన అధ్యయనం వెరసి ఆయన 1555లో రాసిన 942 పద్యాలను అత్యంత గంభీరంగా, చీకటిమయంగా మార్చాయి. నిజానికి నోస్ట్రాడమస్ అంచనాలకు ఎటువంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. ఆయన రాసిన పద్యాలు అస్పష్టంగా ఉండి, ఏ కాలానికైనా అన్వయించుకునేలా ఉంటాయని విమర్శకులు కొట్టిపారేస్తుంటారు.
కానీ ప్రపంచం ఏదైనా సంక్షోభంలో ఉన్నప్పుడు, లేదా యుద్ధ మేఘాలు కమ్ముకున్నప్పుడు ఆయన పేరు వినిపించడం పరిపాటిగా మారింది. 2026 గురించి ఆయన చెప్పిన విషయాలు ఎంతవరకు నిజమవుతాయో కాలమే నిర్ణయించాలి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications
