Latest Updates
-
చికెన్, మటన్ కాదు.. ఎప్పుడైనా కమ్మటి మునగకాయ బిర్యానీ ట్రై చేశారా? -
మనిషికి పంది కిడ్నీ.. ఏకంగా 271 రోజులు.. వైద్య చరిత్రలో మహాద్భుతం! -
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి! -
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
నవంబర్ 9 నుంచి 16వరకు ఈ రాశుల వారికి డబ్బే డబ్బు.. కానీ ఇలా చేస్తేనే!
జోతిష్యశాస్త్రం ప్రకారం గ్రహాలు ప్రతిరోజూ సంచరిస్తుంటాయి. అలాగే తమ గమనాన్ని మార్చుకుంటూ ముందుకు కొనసాగుతుంటాయి. దీని కారణంగా రాశి ఫలాల్లో తీవ్రమైన మార్పులు చోటు చేసుకుంటాయి. అయితే ఈ వారం రాశి ఫలాలు ఏ రాశివారికి మెరుగ్గా ఉన్నాయి? ఏ రాశి వారికి డబ్బులు బాగా రానున్నాయి అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
మేషం:
ఈ రాశివారికి ఈ వారం డబ్బు పరంగా ఒడిదుడుకులు ఎదురవుతాయి. ఆదాయం ఉంటుంది, కానీ దానితో పాటు, ఖర్చులు కూడా ఎక్కువగా ఉంటాయి. వ్యాపారులు లాభాల కోసం కష్టపడవలసి ఉంటుంది. ఈ రాశివారు ముఖ్యంగా ఒత్తిడితో జీవిస్తుంటారు.

వృషభం:
ఈ రాశివారికి ఈ వారం ఆర్థికంగా చాలా అనుకూలంగా ఉంటుంది. తమ తమ వృత్తిలో విజయాన్ని పొందుతారు. ఈనెల 16వ తేదీ వరకు వ్యాపారులకు మంచి కాలం ఉండనుంది. భారీగా లాభాలను ఆర్జించగలుగుతారు.
మిథునం
ఈ వారం మిథున రాశి వారికి ఆర్థికంగా చాలా బాగుంటుంది. వ్యాపారులు మంచి లాభాలు పొందుతారు. మీకు కావలసిన డబ్బు మీకు వస్తుంది. ఈ ఏడు రోజులు మీరు డబ్బు గురించి చింతించాల్సిన చింతించాల్సిన అవసరం ఉండదు.
కర్కాటక
ఈనెల 16వ తేదీ వరకు కర్కాటక రాశి వారికి ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఉంటాయి. ఖర్చులు కూడా అధికంగానే ఉంటాయి. పరిమితులకు లోబడే ఖర్చులు చేసినప్పటికీ ఫలితం ఉండదు. ఆదాయాన్ని పెంపొందించే మార్గాలను ఎంచుకోవాలి. రుణాలు, అప్పుల జోలికి ఈ సమయంలో వెళ్ళకపోవడం మంచిది.
సింహ
ఈ రాశి వారికి ఆదాయం విషయంలో ఈ వారం కాస్త సవాలుగా ఉంటుంది. ఖర్చులు అధికంగా ఉంటాయి. ఖర్చులను అదుపులో ఉంచుకోవడానికి ప్రయత్నించడం మంచిది. వ్యాపారులకు ఈ వారం సవాలుగా ఉంటుంది. వ్యాపారంలో ఎక్కువ రిస్క్ తీసుకోవద్దు.
కన్య
ఈ కాలం మీకు ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది, వ్యాపారులు లాభాలను ఆర్జించగలుగుతారు. డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఖర్చులు అధికంగా ఉండే అవకాశం ఉండడంతో పొదుపు సూత్రాన్ని పాటించాలి.
తుల
మీకు ఈ వారం ఆర్థికంగా చాలా బాగుంటుంది. అందువలన ధనానికి సంబంధించిన పనులకు ఆటంకం ఉండదు. వ్యాపారులకు ఈ వారం చాలామంచిగా ఉంటుంది.
వృశ్చిక
ఈ రాశివారు ఈ వారం ఆర్థిక స్థిరత్వాన్ని పొందుతారు. మీ ఆర్థిక ప్రయత్నాలకు మంచి ప్రతిఫలాలను అందిస్తుంది. వ్యాపారులకు ఆర్థిక లాభం ఉంటుంది. మొత్తం మీద ఈ వారం ఈ రాశివారికి ఆర్థికంగా బాగుంటుంది.
ధనుస్సు
ఈ వారం ఈ రాశి వారికి ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు. అదృష్టం తోడ్పడటం వల్ల ఆదాయం పెరుగుతుంది. వ్యాపారంలో లాభాలు పొందుతారు. ఆదాయాన్ని పెంచుకోవడానికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి.
మకర
ఈ వారం మకర రాశి వారికి ఆర్థికంగా చాలా అనుకూలంగా ఉంటుంది. వారం ప్రారంభంలో చాలా బాగుంటుంది, వారం చివరిలో డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. పెట్టుబడిలో ఎలాంటి రిస్క్ తీసుకోవద్దు.
కుంభ
కుంభరాశి వారికి ఈ వారం ఆర్థికంగా చాలా మంచిది. ఈ వారం ఆర్థికపరమైన ఇబ్బందులు ఉండవు, మీరు ఏదైనా కొనాలనుకుంటే, దానిని కొనుగోలు చేయగలరు.
మీన
ఈ రాశి వారికి ఈ వారం రోజుల కాలం ఆర్థికంగా అంత అనుకూలంగా ఉండదు. కానీ వారం మధ్యలో ఆర్థిక పరిస్థితిలో మెరుగుదల ఉంటుంది. వారం చివరిలో ఆర్ధిక పరిస్థితి మెరుగుపడుతుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications
