Latest Updates
-
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే!
October Monthly Horoscope 2024: అక్టోబర్ రాశి ఫలాలు, ఏ రాశులకు శుభం, ఎవరికి అశుభం, ఏరాశులు జాగ్రత్తగా ఉండాలి
October 2024 Monthly Horoscope: అక్టోబర్ నెలలో ఏ రాశుల వారిపై గ్రహాల స్థాన మార్పు ప్రభావం చూపుతుంది..? ఇక్కడ, ఈ నెల మీకు ఎలా ఉంటుందో తెలుసుకోండి, మీ రాశిచక్రం ప్రకారం ఫలితం ఎలా ఉంటుంది, కెరీర్, కుటుంబ జీవితం, ఆర్థిక స్థితి.
అక్టోబర్ 2024 నెలలో, చాలా గ్రహాలు తమ రాశులను మార్చుకుంటాయి, ఈ గ్రహాల శుభ ప్రభావం కారణంగా, ఈ మాసంలోని పన్నెండు రాశుల పరిస్థితి ఎలా ఉంటుంది? ఆర్థిక, వృత్తి, ఉద్యోగ, వ్యాపరపరమైన జీవితం, కుటుంబం మరియు ప్రేమ జీవితంలో ఏ రాశి వారికి అదృష్ట యోగం ఉంది, ఎవరు లాభిస్తారు మరియు ఎవరు నష్టపోతారు అనే నెలవారీ రాశి ఫలాల సమాచారం ఇక్కడ ఉంది. మరి ఆలస్యం ఎందుకు మీ రాశికి ఈ నెల ఎలా ఉండబోతుందో ఇక్కడ తెలుసుకోండి.

మేషం :
అక్టోబర్ నెలలో మేషరాశి వారికి చాలా శుభాలు కలుగుతుంది. ముక్యంగా ఆర్థికపరంగా అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగంలో కొత్త అవకాశలు పొందుతారు. ఈ అవకాశాలు ఉపయోగించుకోండి. కొన్ని విషయాల్లో ఆలస్యంగా ఉంటుంది. తెలివిగా పనిచేస్తే మీ పనులు త్వరగా పూర్తి అవుతాయి. ఆదాయం పెరుగుతుంది. ఈ సమయంలో పొదుపై దృష్టి సారిస్తే అంత మంచిది. మీరు ఆనందంగా ఉండాలంటే బయట సమస్యలను ఇంటివరకు తీసుకురావద్దు. మీ కుంటుంబ బాధ్యతలు మీరే తీసుకుంటారు. ఈ నెలలో ఆరోగ్యపరంగా కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. అలాగే మీ తండ్రి ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. జాగ్రత్తగా చూసుకోండి.

రాశిచక్ర మూలకం: అగ్ని
రాశి అధిపతి: కుజుడు
అదృష్ట సంఖ్యలు: 11, 25, 39, 45, 50
శుభ దినాలు: గురువారం, ఆదివారం, మంగళవారం, బుధవారం
శుభ రంగులు: నీలం, ముదురు ఎరుపు, గోధుమ రంగు, తెలుపు

వృషభం :
కుటుంబంలో ఆహ్లాదకరంగా ఉంటుంది. శుభకార్యాలు జరుగుతాయి. అలాగే ఇంట్లో అవివాహితులు ఉంటే పెళ్ళి ప్రతిపాదాలను రావచ్చు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. వ్యాపారస్తులు మంచి లాభాలు పొందుతారు. వ్యాపారస్తులు మీ శక్తి విశ్వాసంతో పనిచేస్తే మీ లక్ష్యాన్ని చేరుకుంటారు. నెలలో కొత్త అవకాశాలు పొందుతారు. జీవిత భాగస్వామితో సత్సంబందాలు ఉంటాయి. భాగస్వామ్యంతో వ్యాపారం చేసే వారు జాగ్రత్తగా వ్యవహరించండి. ఆర్థిక పరిస్థితో బలంగా ఉంటుంది. కొత్త పెట్టుబడులతో ముందుకు సాగుతారు. దాంతో నెల చివరిలో విజయం పొందుతారు. అలాగే వారసత్వపు ఆస్తి పొందుతారు. ఆరోగ్య పరంగా ఈ నెల మీకు బాగుటుంది
రాశిచక్ర మూలకం: భూమి
రాశి అధిపతి: శుక్రుడు
అదృష్ట సంఖ్యలు: 4, 18, 29, 32, 49, 57
శుభ దినాలు: ఆదివారం, గురువారం, బుధవారం, శుక్రవారం
శుభ రంగులు: ఆకుపచ్చ, మెరూన్, నీలం, గులాబీ రంగు, తెలుపు

మిథునం:
అక్టోబర్ నెలలో మిథునరాశి వారికి ఆర్థికపరంగా బలపడతుంది. నిలిచిపోయిన పాత బకాయిలు తిరిగి పొందుతారు. వృత్తి జీవితంలో మీరు ఆశించిన ఫలితాలు పొందుతారు. వ్యక్తిగత జీవితంలో సానుకూల మార్పులు ఉంటాయి. వైవాహిక జీవితంలో కొన్ని సమస్యలు ఉండవచ్చు. కానీ కొద్ది రోజులకు సర్ధబాటు అవుతాయి. ప్రేమికులకు ఈ నెల శుభప్రదంగా ఉంది, ప్రేమ ఫలిస్తుంది. సొంత ఇల్లు, వాహనాలు కొంటారు. మీ చిరకాల కోరిక నెరవేరుతుంది. ఈ నెలలో మీరు ప్లాన్ ప్రకారం మీ పనులు పూర్తి చేస్తారు. ఈ నెలలో మీరు తీసుకునే ఏ నిర్ణయ అయినా అది మీకు మంచి ఫలితాలను అందిస్తుంది. ఆరోగ్య పరంగా ఈనెల అనుకూలంగా ఉంటుంది
రాశిచక్ర మూలకం: గాలి
రాశి అధిపతి: బుధుడు
అదృష్ట సంఖ్యలు: 2, 18, 26, 31, 44, 57
శుభ దినాలు: బుధవారం, మంగళవారం, ఆదివారం, సోమవారం
శుభ రంగులు: ముదురు నీలం, ఎరుపు, గోధుమరంగు, తెలుపు

కర్కాటకం
మీరు ఒత్తిడి లేని జీవితం గడుపుతారు. పనిపై పూర్తి దృష్టి పెడుతారు. దాంతో మీ లక్ష్యాన్ని చేరుకోగలుగుతారు. ఉద్యోగస్తులు కొత్త ఉద్యోగాన్ని పొందుతారు. వ్యాపారులకు అక్టోబర్ నెల చాలా బాగుంది. ఆశించిన ఫలితాలను పొందుతారు.ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఖర్చులను తగ్గించుకుంటే ఆర్థిక సమస్యలు ఉండవు. మీ ప్రియమైన వారు మిమ్మల్ని ఇష్టపడవచ్చు. వారి నుండి పూర్తి మద్దతు పొందుతారు. వ్యాపారస్తులు ఊహించిన దానికంటే ఎక్కువ లాభాలను పొందుతారు. అలాగే నెలాఖరున ఖరీదైన వస్తువులను కొంటారు. ఆరోగ్యపరంగా మీరు చాలా జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది.
రాశిచక్ర మూలకం: నీరు
రాశి అధిపతి: చంద్రుడు
అదృష్ట సంఖ్యలు: 5, 17, 24, 30, 45, 54
శుభ దినాలు: బుధవారం, గురువారం, ఆదివారం, శుక్రవారం
శుభ రంగులు: ఆకాశ నీలం, ఎరుపు, పసుపు, క్రీమ్

సింహ రాశి:
ఈ నెలలో ఉద్యోగస్తులకు బాగుంటుంది. ఒత్తిడి తగ్గించుకుని పనిచేస్తారు. పనితీరు మెరుగుపడుతుంది. ఇక వ్యాపారస్తులకు ఈ నెల ప్రారంభంలో అద్భుతంగా ఉంది. నిలిచిపోయిన పనులు తిరిగి ఊపందుకుంటాయి. దాంతో పాతబకాయిలు తిరిగి పొందుతారు. డబ్బు చేతికి అందడం వల్ల పెట్టుబడి పెట్టే అవకాశం ఉంది. అలాగే వ్యాపారంలో పెద్ద ఆర్డర్లు వస్తాయి. పనితో పాటు, మీరు మీ కుటుంబ జీవితంపై కూడా శ్రద్ధ చూపుతారు. ఈ సమయంలో, మీరు కుటుంబంతో ఎక్కువ సమయం గడపడుపుతారు. దాంతో మీ బంధాలు బలపడుతాయి. ఆర్థికపరంగా మీ సమస్యలు పరిష్కారం అవుతాయి. ప్రేమికులకు ఆహ్లాదకరంగా ఉంటుంది. ఆరోగ్యపరంగా మిశ్రమంగా ఉంటుంది.
రాశిచక్ర మూలకం: అగ్ని
రాశి చక్రవర్తి: సూర్యుడు
అదృష్ట సంఖ్యలు: 7, 10, 19, 21, 33, 40, 55
శుభ దినాలు: గురు, శుక్ర, సోమ, బుధ
శుభ రంగులు: ఎరుపు, ముదురు ఆకుపచ్చ, నీలం

కన్య:
అక్టోబర్ నెలలో కన్యా రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. ఉద్యోగస్తులపై పనిభారం పెరుగుతుంది.కృషి మరియు ఆత్మవిశ్వాసంతో పనిలో విజయం సాధిస్తారు. దాంతో మీ బాస్ సంతోషపడుతారు. వ్యాపారులకు ఈ నెల చాలా బాగుంది. డబ్బు సమస్యలు తీరుతాయి. ఆర్థిక నిర్ణయాలు ఆలోచించి తీసుకోవడం వల్ల మీకు మంచి ఫలితాలు వస్తాయి. అలాగే ఏదైనా కొత్తగా పని ప్రారంభిస్తే మంచి అవకాశాలు ఉంటాయి. జీవిత భాగస్వామి నుండి పూర్తి మద్దతు ఉంటుంది. బ్యాచులర్లకు మంచి ప్రపోజల్ రావచ్చు. మీరు కోరుకున్న అమ్మాయి మీ జీవిత భాగస్వామిగా వస్తుంది. ఆరోగ్య పరంగా ఈ నెల మీకు బాగుంది.
రాశిచక్ర మూలకం: భూమి
రాశి అధిపతి: బుధుడు
అదృష్ట సంఖ్యలు: 1, 15, 22, 35, 40, 57
శుభ దినాలు: మంగళవారం, గురువారం, సోమవారం, బుధవారం
శుభ రంగులు: పసుపు, ఎరుపు, మెరూన్, తెలుపు

తుల :
అక్టోబర్ నెలలో తులా రాశి వారికి కుటుంబ సభ్యుల మద్దతు వల్ల మీ సమస్యలు తీరుతాయి. ఆర్థిక పరిస్థితి స్థిరంగా ఉంటుంది. మీ కష్టానికి తగిన ఫలితం పొందుతారు. వ్యాపారులకు డబ్బు అంతంత మాత్రంగా అందుతుంది. ముఖ్యంగా కొత్తగా ఏదైనా వ్యాపార నిర్ణయాలు తీసుకోవాలంటే జాగ్రత్తగా ఆలోచించి తీసుకోండి. ఇతరుమీద ఎక్కువ ఆధారపడకండి. ప్రేమకులకు శుభంగా ఉంది. మీ వివాహ ప్రతిపాదన మీ కుటుంబలో వారు ఒప్పుకుంటారు. పాత అప్పులను తీర్చుతారు. ఆరోగ్య పరంగా చాలా జాగ్రత్తగా ఉండాలి.
రాశిచక్ర మూలకం: గాలి
రాశి అధిపతి: శుక్రుడు
అదృష్ట సంఖ్యలు: 6, 14, 29, 33, 40, 56
శుభ దినాలు: ఆదివారం, మంగళవారం, గురువారం, సోమవారం
శుభ రంగులు: తెలుపు, గోధుమరంగు, పసుపు, క్రీమ్ కలర్

వృశ్చికం
అక్టోబర్ నెలలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఏదైనా కొత్త పనిని ప్రారంభించాలంటే ముందుగా దాని గురించి పూర్తి సమాచారం తెలుసుకుని తర్వాత పనిలో దిగాలి. ఉద్యోగం కోసం చూస్తుంటే కొత్త ఉద్యోగం కోసం కొంత కాలం వేచి ఉండాలి. తొందరపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోకండి. అయితే ప్రమోషన్ కోసం చూసే వారికి మరికొంత కాలం పడుతుంది. మీరు చేసే పనిలో నిబద్దత పెట్టండి, విశ్వాసంతో పనిచేస్తే మీరు ఆశించిన ఫలితాలు పొందుతారు. మీరు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి, ఎదుటి వారు మీ మాటల వల్ల బాధపడవచ్చు. ఈ నెలలో మీ ఆరోగ్యం కొంత ఆందోళన కలిగిస్తుంది.
రాశిచక్ర మూలకం: నీరు
రాశిచక్ర అధిపతి: బుధుడు
అదృష్ట సంఖ్యలు: 5, 19, 20, 31, 40, 56
శుభ దినాలు: గురు, సోమ, శని, బుధ
శుభ రంగులు: మెరూన్, ఎరుపు, గులాబీ, ఆకాశ నీలం

ధనుస్సు
ఈ నెల మీకు ఒత్తిడితో కూడి ఉంటుంది. ఎంత కష్టపడి పనిచేసినా మీరు ఆశించిన ఫలితాలు రావు. అయితే ఓపికగా ఉండటం వల్ల మంచి జరుగుతుంది. తొందపడి తప్పుడు నిర్ణయాలు తీసుకోకండి, ఎందుకంటే మీ శ్రమ వృధా అవ్వదు. డబ్బు గురించి ఆందోళ వద్దు , త్వరలో మీ సమస్య పరిష్కరించబడుతుంది. అయితే కొత్త పెట్టుబడులకు దూరంగా ఉండాలి. అలాగే పిల్లల విషయంలో సమస్యలను పరిస్కరిస్తారు. ఆరోగ్య పరంగా సరైన జాగ్రత్తలు తీసుకోండి. ముఖ్యంగా గుండె జబ్బులున్నావారు మరింత జాగ్రత్త అవసరం.
రాశిచక్ర మూలకం: అగ్ని
రాశి అధిపతి: బృహస్పతి
అదృష్ట సంఖ్యలు: 1, 7, 14, 21, 38, 49
శుభ దినాలు: ఆది, శని, సోమ, బుధ
శుభ రంగులు: ముదురు ఎరుపు, ఆకుపచ్చ, గులాబీ, గ్రే కలర్

మకరం:
అక్టోబర్ నెల మకరరాశి వారు మిశ్రమ ఫలితాలు పొందుతారు. మీరు మీ పనిలో మంచి విజయాన్ని పొందుతారు, వ్యాపార ప్రణాళికలు ఫలించవచ్చువివిధ మార్గాల్లో డబ్బు పొందుతారు, అయితే దాన్ని అనవసరంగా ఖర్చు చేయకండి, పెట్టుబడి పెట్టడానికి ఇది సరైన సమయం కాదు. జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. మీరు చేసే ఏ పనిలో అయినా ప్లానింగ్ ఫర్ఫెక్ట్ గా ఉంటుందిజ దాంతో మంచి ఫలితాలను అందుకుంటారు. ప్రేమికులకు ఈ నెల చాలా బాగుంది. మీ ప్రేమ మరింత బలపడుతుంది. బ్యాచులర్స్ పెళ్ళి ఫిక్స్ అవుతుంది. వైవాహిక జీవితం శృంగారభరితంగా ఉంటుంది. ఆరోగ్య పరంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు, ప్రశాంతమైన జీవితం గడుపుతారు.
రాశిచక్ర మూలకం: భూమి
రాశి అధిపతి: శని
అదృష్ట సంఖ్యలు: 6, 18, 24, 36, 44, 54
శుభ దినాలు: సోమ, గురు, మంగళ, శని
శుభ రంగులు: క్రీమ్, ఊదారంగు, ఎరుపు

కుంభం
కుంభరాశి వారికి అక్టోబర్ నెల మిశ్రమంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు ఒత్తిడితో కూడిన పనులు ఉంటాయి. పని బారం పెరుగుతుంది. పనిని ప్రణాళికతో చేయాలి. కార్యాలయంలో మీ ప్రత్యర్థుల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు. స్నేహితులు శత్రువులుగా మారే అవకాశం ఉంది.జాగ్రత్తగా ఉండండి. డబ్బుకు సంబంధించిన ఆందోళనలు పెరుగుతాయి. మనస్సు గందరగోళంగా మారుతుంది. డబ్బు సంపాదించడానికి మీరు చేసే వక్రమార్గాలను మానుకోవాలి. లేకపోత ఇబ్బందులు పడుతారు. ఈ సమయంలో మీరు చేసే కృషి భవిష్యత్తులో పురోగతికి దారితీస్తుంది. కుటుంబంలో ఆనందంగా ఉంటారు. ఆరోగ్య పరంగా కొంత క్షీణించవచ్చు. వెంటనే డాక్టర్ ను కలిస్తే మంచిది.
రాశిచక్ర మూలకం: గాలి
రాశి అధిపతి: శని
అదృష్ట సంఖ్యలు: 4, 11, 26, 35, 44, 54
శుభ దినాలు: బుధవారం, ఆదివారం, గురువారం, మంగళవారం
శుభ రంగులు: పసుపు, గులాబీ, ఊదా, తెలుపు, నారింజ రంగు

మీనం
అక్టోబర్ నెలలో మీనరాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. మీరు పెద్దల నుండి పూర్తి మద్దతు పొందుతారు. మీ ఆర్థక సమస్యలు పరిష్కారం అవుతాయి. ప్రేమికులకు మరియు వైవాహితులకు ఈ సమయం ఆనందంగా గడిచిపోతుంది. మీ భాగస్వామితో సమయం గడుపుతారు. అది మీ బంధాన్ని మరింత బలపరుస్తుంది. మీ పనిలో విజయం సాధిస్తారు. విదేశాల్లో చదువుకోవాలనే విద్యార్థులకు కోరిక నెరవేరుస్తుంది. కొత్తవ్యక్తులతో పరిచయాలు ప్రయోజనకరంగా ఉంటాయి. వ్యాపారాన్ని విస్తరించుకునే అవకాశం ఉంటుంది. ఆరోగ్య పరంగా బాగుంది. మీ రోజువారి కార్యక్రామాల్లో కొన్ని మార్పులు చేసుకోవడం వల్ల సత్ఫలితాలను పొందుతారు.
రాశిచక్ర మూలకం: నీరు
రాశి అధిపతి: బృహస్పతి
అదృష్ట సంఖ్యలు: 2,10, 20, 36, 45, 51
శుభ దినాలు: మంగళవారం, సోమవారం, బుధవారం, ఆదివారం
శుభ రంగులు: ఎరుపు, పసుపు, నీలం, గులాబీ, ఆకుపచ్చ
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications











