Latest Updates
-
మనిషికి పంది కిడ్నీ.. ఏకంగా 271 రోజులు.. వైద్య చరిత్రలో మహాద్భుతం! -
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి! -
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.?
Palmistry: అరచేతిలో ఈ రేఖ ఉంటే..లవర్ చేతిలో మోసపోతారు జాగ్రత్త!
హస్తసాముద్రికం అనేది ప్రపంచవ్యాప్తంగా అనేక సంస్కృతుల్లో ప్రాచుర్యం పొందిన పురాతన శాస్త్రం. జ్యోతిష్యశాస్త్రం మాదిరిగానే హస్త సాముద్రికం కూడా చాలా పాపులర్. జ్యోతిష్యశాస్త్రంలో నక్షత్రాల కదలికలు, జన్మించిన సమయం వంటి వాటి ఆధారంగా వ్యక్తుల జీవితాన్ని అంచనా వేస్తుంటారు..హస్తసాముద్రికంలో అరచేతిలోని రేఖలు,గుర్తులు,చేతి ఆకారాన్ని పరిశీలించడం ద్వారా వ్యక్తి జీవితాన్ని అంచనా వేస్తారు.
చాలామందికి తమ ప్రేమ జీవితం లేదా వివాహ జీవితం ఎలా ఉంటుందో తెలుసుకోవాలన్న ఉత్సుకత ఉంటుంది. తమ చేతులు చూపించి హస్తసాముద్రిక శాస్త్రం తెలిసినవారిని కూడా తమ భవిష్యత్తు ఎలా ఉంటుందో అడుగుంటం నిత్య జీవితంలో మనం చూస్తూనే ఉంటాం. అయితే మీ చేతిలో ఉన్న కొన్ని రేఖల ద్వారా మీ లవ్ లైఫ్, వివాహ జీవతం ఎలా ఉంటుంది, మీ రిలేషన్ సక్సెస్ అవుతుందా లేదా మధ్యలోనే ముగుస్తుందా అని తెలుసుకోవచ్చు. అరచేతిలోని ఏ రేఖలు మీ ప్రేమ జీవితాన్ని అసంపూర్ణంగా మారుస్తాయో ఇప్పుడు చూద్దాం.

హస్తసాముద్రిక శాస్త్రం ప్రకారం వివాహరేఖ అరచేతిలో చిటికెన వేలు కింద ఉంటుంది. ఈ రేఖలు అరచేతి అంచు నుంచి లోపలివైపుకి సాగుతాయి. ఈ రేఖలో పెద్దగా ఉండకపోవచ్చు. కొందరికి అయితే ఒకే రేఖ ఉండొచ్చు..మరికొందరికి రెండు,మూడు లేదా నాలుగు రేఖలు కూడా ఉండొచ్చు. ఈ రేఖలను విశ్లేషించడం ద్వారా ప్రేమ జీవితం,వైవాహిక జీవితం ఎలా ఉంటదో తెలుపుకోవచ్చు.
అరచేతిలో ఈ రేఖ ఉంటే భాగస్వామి చేతిలో మోసపోతారు
అరచేతిలో బుధుడు(చిటికెన వేలు కింద ఉండే భాగం),కుజుడు(బొటన వేలు కింద ఉండే భాగం)పర్వతాలపై చాలా చిన్న చిన్న రేఖలు ఉంటు మీ ప్రేమ జీవితంలో లేదా వైవాహిక బంధంలో అనేక సమస్యలు ఎదురవుతాయని పండితులు తెలిపారు. అంతేకాకుండా మీ లవర్ లేదా భాగస్వామి మిమ్మల్ని మోపం చేసే అవకాశం కూడా ఉంటుందని,మీ ప్రేమ జీవితం విషపూరితంగా మారే ఛాన్స్ ఉంటదని తెలిపారు. ముఖ్యంగా కుజ గ్రహంపై అలాంటి రేఖలు ఉండి మీ అరచేతిలో బుధుడు బలహీనంగా ఉంటే మీ భాగస్వామిని నమ్మకపోవడం మంచిదని చెబుతున్నారు.
ఒక గీత కట్ అయితే రిలేషన్ ఎక్కువ కాలం ఉండదు
మీ అరచేతిలోని వివాహ రేఖ మధ్యలో తెగిపోయినా లేదా కట్ అయినా మీ ప్రేమ జీవితంలో, వైవాహిక జీవితంలో అనేక ఒడిదుడుకులు ఎదుర్కొంటారని అర్థం. ఇలాంటి విరిగిన రేఖలు ఉంటే ప్రేమ జీవితంలో విడిపోయే ప్రమాదం, వైవాహిక జీవితంలో విడాకులు తీసుకునే అవకాశం ఉంటుందని హస్తసాముద్రిక శాస్త్రం తెలియజేస్తుంది. మరోవైపు మీ అరచేతిలో వివాహ రేఖ స్పష్టంగా, లోతుగా ఉంటే మీ మ్యారేజ్ లైఫ్, లవ్ లైఫ్ చాలా హ్యాపీగా సాగిపోతుందట.
మ్యారేజ్ లైఫ్ కి ఈ రేఖ మంచిది కాదు
మీ అరచేతిలోని వివాహ రేఖ సూర్య రేఖను (ఉంగరం వేలు కింద ఉండే నిలువు రేఖ) తాకుతుంటే మీ పెళ్లి సంపన్నమైన కుటుంబంలో జరిగే అవకాశం ఉంది. అయితే వివాహ రేఖ రెండుగా చీలి ఉంటే ప్రేమలో ఉన్నోళ్లని లవర్ మోసం చేయవచ్చు లేదా ద్రోహం చేయవచ్చు..వైవాహిక జీవితంలో ఇది విడాకులకు దారితీయవచ్చు అని పండితులు తెలిపారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications
