Latest Updates
-
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే! -
స్పైసీ మటన్ లివర్ ఫ్రై..ఈ సీక్రెట్ మసాలాతో చేస్తే ప్లేట్ ఖాళీ చేస్తారు!
మీకున్న సమస్యలన్నీ తొలిగిపోవాలంటే ఈ పరిహారాలు చేయాలి.. ఏ రాశి వారు ఏం చేయాలంటే?
హిందులకు అత్యంత ప్రత్యేకమైన, ముఖ్యమైన పండగల్లో ఒకటైన హనుమాన్ జయంతిని ఈరోజు నిర్వహించుకుంటున్నారు. శనివారం రోజున హనుమంతుడిని ఆరాధించడం ఆధ్యాత్మికంగా ఎంతో శుభప్రదంగా పరిగణించబడుతుంది. ప్రత్యేకంగా ఈ హనుమాన్ జయంతి అనేక విశిష్ట గ్రహ సన్నివేశాలతో వస్తోంది. 57 సంవత్సరాల తర్వాత మళ్లీ ఒక అరుదైన పంచగ్రహ యోగం ఏర్పడుతోంది. ఇది 1968 తర్వాత తొలిసారిగా జరుగుతున్నదిగా పంచాంగాల ప్రకారం తెలుస్తోంది.
ఈ పంచగ్రహ యోగం మీన రాశిలో ఏర్పడుతున్నది. బుధుడు, శుక్రుడు, శని, రాహువు, సూర్యుడు ఈ రోజు మీన రాశిలో ఉన్నారు. అదే సమయంలో చంద్రుడు, కేతువు కన్య రాశిలో సంచరిస్తున్నారు. పంచగ్రహ సమాహారంతో పాటు, బుధాదిత్య యోగం, శక్రాదిత్య యోగం, మాళవ్య రాజయోగం, లక్ష్మీ నారాయణ యోగం వంటి శుభయోగాలు కూడా కనబడుతున్నాయి. ఈ నేపథ్యంలో, రాశుల వారీగా కొన్ని ప్రత్యేక పూజా విధానాలు, పారాయణాలు చేయడం ద్వారా అదృష్టాన్ని ఆకర్షించవచ్చని జ్యోతిష నిపుణులు చెబుతున్నారు. అయితే ఏ రాశుల వారు ఎలాంటి పరిహారాన్ని పాటించాలి? అలా చేస్తే ఏమవుతుంది అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.

రాశుల వారీగా శుభ పరిహారాలు
వృషభం, తులా రాశి:
వృషభ, తులా రాశికి చెందిన వ్యక్తులు హనుమాన్ జయంతి రోజున ఏదైనా హనుమంతుడి ఆలయాన్ని సందర్శించాలి. అక్కడ శ్రీ ఆంజనేయ స్వామిని పూజించి.. ఆ ఆలయంలోనే సుందరకాండ పారాయణం చేయాలి. అలాగే ఈ రోజున కోతులకు ఆహరం తినిపించడం వలన ఈ రెండు రాశుల వారికి అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ముఖ్యంగా చెప్పాలంటే ఈ రెండు రాశుల వారికి శుక్ర బలాన్ని పెంచుతుంది. దీని కారణంగా ఈ రాశి వారు తమ జీవితంలో సుఖం, ఆనందం, శ్రేయస్సు, ఆర్ధిక స్థిరత్వం వంటివి పొందగలుగుతారు.
మేషం, వృశ్చికం:
మేష, వృశ్చిక రాశికి చెందిన వ్యక్తులు కూడా ఈరోజు అత్యంత ప్రత్యేకమైన పరిహారాన్ని చేయాల్సి ఉంటుంది. అందుకోసం ఈ రెండు రాశుల వారు ఈరోజు హనుమాన్ ఆలయాన్ని సందర్శించాలి. అలాగే ఈ రెండు రాశుల వారు ఒక మంచి ప్రశాంతమైన ప్రదేశంలో హనుమాన్ అష్టకాన్ని పఠించాలి. అలాగే హనుమాన్ భక్తులతో పాటు ప్రజలందరికీ బూందీ ప్రసాదం పంపిణి చేయాలి. ఇలా చేయడం వలన ఈ రాశికి చెందిన వారికి అంగారక గ్రహ బలం పెరుగుతుంది. అలాగే తమ జీవితంలో అంగారకుడి ప్రభావం స్పష్టంగా కనపడుతుంది. కష్టాలన్నీ తొలిగిపోయి అవకాశం ఉంటుంది.
మిథునం, కన్యా రాశి:
మిథునం, కన్య రాశికి వారికి ఈ హనుమాన్ జయంతి ప్రత్యేకమైనదిగా చెప్పవచ్చు. ఈ రెండు రాశుల వారికి నేడు ఏర్పడనున్న పంచగ్రహ యోగం ఫలితాలు అందడంతో పాటు.. ఈ రాశిలోనే గ్రహాలూ సంచరిస్తుండటంతో ఈ రాశి వారికి మంచి శుభఫలితాలు వస్తాయి. అయితే వీరు కూడా కొన్ని పరిహారాలు చేయాల్సి ఉంటుంది. అవేంటంటే.. మిథునం, కన్య రాశికి చెందిన వ్యక్తులు.. హనుమాన్ జయంతి రోజున హనుమాన్ ఆలయాన్ని సందర్శించి ప్రత్యేకమైన పూజలు చేయాలి. అలాగే ఆ తరువాత అరణ్యకాండ పారాయణం చేయాలి. దీంతో పాటు ఈరోజు హనుమంతుడికి నెయ్యితో దీపం వెలిగించి, తమలపాకులో లవంగాలు పెట్టి సమర్పించాలి. ఇలా చేయడం వలన ఈ రాశి వారికి బుధుడి బలం పెంచుతుంది. అలాగే ఈ రాశి వారికి ఆనందం, ఆర్ధిక బలం, శ్రేయస్సు, శాంతి, మానసిక శాంతిని అందిస్తుంది.
కర్కాటక రాశి:
మిగిలిన రాశుల మాదిరిగా కాకుండా కర్కాటక రాశి వారికి ఈరోజు ఒక ప్రత్యేకమైన పరిహారం చెల్లించాలి. ప్రస్తుతం జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కర్కాటక రాశి వారికి కొంత చెడు వాతావరణం నడుస్తుంది. దీని కారణంగా ఈ రాశికి చెందిన వారు కొంత ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. అలాగే ఆర్ధిక అస్థిరత కూడా ఉంది. దీని నుంచి బయటపడాలంటే ఈ రాశికి చెందిన వారు ఈరోజు హనుమంతుడి ఆలయాన్ని సందర్శించి పూజలు నిర్వహించాలి. అనంతరం హనుమంతుడికి వెండి గదను సమర్పించాలి. ఆ తరువాత దానిని తీసుకొని మేడలో ధరించుకోవచ్చు. ఇలా చేయడం వలన హనుమంతుడు మీతోనే ఉంటారు. అలాగే ఈరోజున ఈ రాశికి చెందిన వారు హనుమాన్ చాలీసా పారాయణం చేయడం వలన కూడా చంద్రుని బలం పెంచుతుంది.
సింహ రాశి:
సింహ రాశికి చెందిన వ్యక్తులకు కూడా అందరి మాదిరిగా కాకుండా ఒంటరిగానే ఒక ప్రత్యేకమైన పరిహారం చెల్లించాల్సి ఉంటుంది. ఇలా ప్రత్యేకమైన పరిహారం చెల్లించడం వలన ఈ రాశికి చెందిన వ్యక్తులకు గొప్ప గొప్ప ఫలితాలు వస్తాయి. అయితే ఎలాంటి పరిహారం చేయాలంటే.. ఈ రాశికి చెందిన వ్యక్తులు ముందుగా.. హనుమంతుడి ఆలయాన్ని సందర్శించి ఆంజనేయుడిని దర్శించుకోవాలి. ఆ తరువాత ఆ ఆలయానికి తీపి పదార్థాలను పూజించి వాటిని దానం చేయాలి. దానం చేసిన అనంతరం గుడి ప్రాంగణంలోనే కూర్చొని బాలకాండ పారాయణం చేయాలి. ఇలా చేయడం వలన సింహ రాశి వారికి సూర్యుడి అనుగ్రహం లభిస్తుంది. తద్వారా రాజకీయ పరంగా ఉన్న సమస్యలన్నీ తొలిగిపోతాయి.
ధనుస్సు, మీనం రాశి:
ధనుస్సు, మీనం రాశి వారికి ఈ హనుమాన్ జయంతి అత్యంత శుభప్రదమైన రోజు. ఈ రెండు రాశుల వారిపై ఈరోజు ఏర్పడుతున్న అరుదైన గ్రహ యోగాలు, రాశి యోగాలు మంచి ఫలితాలు ఇవ్వబోతున్నాయి. పైగా మీనా రాశిలోనే ఈ పంచగ్రహ యోగం ఏర్పడడం వీరికి అదనపు బలం అని చెప్పుకోవచ్చు. అయితే ఈ రాశి వారు ఈరోజు హనుమంతుడి ఆలయాన్ని సందర్శించి అయోధ్యకాండ పారాయణం చేయాలి. అలాగే పసుపు పువ్వులు, పసుపు స్వీట్లు, పండ్లను హనుమంతుడికి సమర్పించాలి. ఇలా చేయడం వలన ఈ రాశి వారికి గురు గ్రహ బలం పెరుగుతుంది. దీంతో వీరు అనుకున్నది సాధించగలుగుతారు.
ఈ రాశి వారు కూడా ఈరోజు హనుమంతుడి అనుగ్రహాన్ని పొందనున్నారు. అలాగే ఈరోజు ఏర్పడుతున్న అరుదైన గ్రహాల యోగాలను కూడా అనుభవించనున్నారు. అయితే ఈ రాశి వారు కూడా కొన్ని అరుదైన పరిహారాలు చెల్లించాల్సి ఉంటుంది. అప్పుడే ఈ గ్రహాల యోగాలు పూర్తిగా పొందే అవకాశాలు ఉంటాయి. అయితే ఈ రాశి వారు ఈరోజు హనుమంతుడికి నల్ల మినపప్పును సమర్పించాలి. అలాగే హనుమంతుడి పూజలు నిర్వహించాలి. ఇలా చేయడం వలన ఈ రెండు రాశుల వారిపై ఉన్న శని ప్రభావం తొలిగిపోతుంది. అలాగే మంచి విజయాలను సాధించగలుగుతారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications











