Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
2025లో ఆరు నెలలు ఈ రాశుల వారికి అంతా ఊహించని కష్టాలే!
2025ఓ రాహు సంచారం కీలకంగా మారబోతుంది. రాహు సంచారం కారణంగా పలు రాశుల వారికి అన్ని విధాలుగా కలిసి వచ్చే అవకాశం ఉంటే, మరికొన్ని రాశుల వారికి అదే శాపంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. వచ్చే ఏడాది రాహువు మే నెలలో మీన రాశిని వదిలి కుంభ రాశిలోకి ప్రవేశించనున్నాడు. దీని కారణంగా పలు రాశుల వారికి ఏడాదిన్నర పాటు సమస్యలు వెంటనే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాహువు వల్ల ఏ ఏ రాశుల వారు ఇబ్బందులు పడబోతున్నారు? వారికి ఎలాంటి సమస్యలు వస్తాయనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.
కర్కాటకం
ఈ రాశి వారికి ఎనిమిదో స్థానంలో రాహువు సంచరిస్తున్నాడు. దీని కారణంగా ఈ రాశికి చెందిన వారి కష్టార్జితం ఎక్కువగా వృథా అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ధన నష్టం జరగడంతో పాటు పలుమార్లు మోసపోయే సూచనలు కనిపిస్తున్నాయి. అనారోగ్య సమస్యలు మనిషిని తీవ్రంగా పీడిస్తాయి. వైవాహిక సమస్యలు తలెత్తుతాయి. ముఖ్యమైన ప్రయత్నాలు, పనులు పెండింగ్‌లో పడిపోతాయి. మానసికంగా ఒత్తిడికి గురవుతారు.

సింహం
ఈ రాశి వారికి ఏడో స్థానంలో 2025లో రాహువు సంచరించబోతున్నాడు. దీని కారణంగా ఈ రాశి వారికి కూడా కస్టాలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. రాహువు కారణంగా ఈ రాశి వారికి పెళ్లి ప్రయత్నాలు ఆలస్యం అవుతాయి. ప్రేమ వ్యవహారాల్లో కూడా ఇబ్బందులు ఎదుర్కొంటారు. వైవాహిక జీవితంలో అశాంతి నెలకొంటుంది. నిరుద్యోగులకు చిన్నపాటి ఉద్యోగం లభించడం చిన్నపాటి జీతం మాత్రమే లభించడం వంటివి జరుగుతాయి. వృత్తి జీవితం ఒత్తిడితో కూడుకొని ఉంటుంది.
తుల
ఈ రాశి వారికి ఐదో స్థానంలో రాహువు సంచరించనున్నాడు. దీని కారణంగా ఈ రాశి వారికి కూడా వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో పొరపాట్లు చేసే అవకాశం ఉంది. దాని కారణంగా భారీగా నష్టపోయే సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఉద్యోగస్తులు తమ తమ ఉద్యోగంలో ఎంత నమ్మకంగా, ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. పిల్లల ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. విద్యార్థుల్లో ఏకాగ్రత, శ్రద్ధ తగ్గిపోతుంది. మిత్రుల వల్ల ధన నష్టం కలుగుతుంది. ఖర్చులు పెరుగుతాయి.
వృశ్చికం
ఈ రాశి వారికి రాహువు నాలుగో స్థానంలో సంచరించబోతున్నాడు. దీని కారణంగా ఈ రాశికి చెందిన వారికి కుటుంబ జీవితంలో ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. కుటుంబంలో అనుకోని సమస్యలు తీవ్రంగా ఇబ్బందులకు గురి చేస్తాయి. పని భారం పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో భారీగా లాభాలు తగ్గిపోతాయి. తరచుగా అనారోగ్య సమస్యల బారిన పడే అవకాశం ఉంటుంది. బంధుమిత్రుల వల్ల ధననష్టం జరిగే సూచనలు కనిపిస్తున్నాయి.
కుంభం
ఈ రాశిలోనే రాహువు ప్రవేశించడం వల్ల ఈ రాశి వారికి సమస్యలు కొంత తక్కువగా ఉన్నప్పటికీ వీరు కూడా కొంత మిశ్రమ ఫలితాలను పొందే అవకాశం ఉంటుంది. వీరు చేపట్టే ప్రతిపనిలోనూ ఆటంకాలు ఎదురవుతాయి. నష్టదాయక వ్యవహారాల్లోనే వీరు తలదూర్చే సూచనలు కనిపిస్తున్నాయి. పరువు, ప్రతిష్ఠతకు భంగం కలిగే సూచనలు చాలా వరకు కనిపిస్తున్నాయి. ఆర్ధిక వ్యవహారాల్లో ఎవరినీ గుడ్డిగా నమ్మకూడదు. ధన పరంగా ఎవరికీ వాగ్దానాలు చేయకపోవడం మంచిది. తరచూ అనారోగ్యాలకు గురవుతూ ఉంటారు. కష్టానికి తగిన ఫలితం ఉండకపోవచ్చు.
మీనం
ఈ రాశి వారికి రాహువు వ్యయ స్థానంలో సంచరించబోతున్నాడు. దీని కారణంగా ఈ రాశి వారికి అనుకోని కస్టాలు ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. చిన్న ఉద్యోగం లభించినప్పటికీ అది దూర ప్రాంతంలో ఉండే సూచనలు కనిపిస్తున్నాయి. వివాదాలు, ఊహించని సమస్యలు తీవ్రంగా ఇబ్బంది పెడతాయి. మన అనుకున్న వాళ్ళు మోసం చేస్తారు. మీ ద్వారా సహాయం పొందిన వ్యక్తులు మీ మొహం చాటేస్తారు. వైవాహిక జీవితంలో సమస్యలు తలెత్తుతాయి. ప్రేమ వ్యవహారాల్లో ఇబ్బందులు ఎదురవుతాయి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications