Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
హోలీ తరువాత ఈ నాలుగు రాశులకు వారికి అన్నీ కష్టాలు, కన్నీళ్లే.. చాలా జాగ్రత్తగా ఉండాలి!
హిందువులు జరుపుకునే అతి పవిత్రమైన పండగల్లో హోలీ పండగ కూడా ఒకటి. మన దేశంలోని చాలా ప్రాంతాల్లో ఈ పండగను ఘనంగా జరుపుకుంటారు. ఈ పండగ ప్రతి ఏడాది ఫాల్గుణ మాసంలో పౌర్ణమి రోజున వస్తుంది. ఆ రోజునే హోలీని జరుపుకుంటారు. పెద్దవారి నుంచి చిన్న పిల్లల వరకు ప్రతి ఒక్కరూ ఈ పండగలో పాల్గొని పండగను ఘనంగా జరుపుకుంటారు. ముందుగా హోలీ దహనం నిర్వహించి, తరువాత రంగులతో ఈ హోలీ ఆడడం ద్వారా ఈ పండగ నిర్వహించబడుతుంది.
అయితే ఈ సంవత్సరం హోలీ నాడు చంద్రగ్రహణం ఏర్పడుతుంది. అలాగే హోలీ దహనం భద్రుడికి సమీపాన ఉంది. దీని కారణంగా జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని రాశులకు చెందిన వారికి చెడు ప్రయోజనాలు కలగనున్నాయి. ఆ రాశుల వారి జీవితం తీవ్రంగా ప్రభావితం కానుంది. వారికాన్నీ దుఃఖాలే మిగలనున్నాయి. కష్టాలు వారికి కన్నీళ్లు తెప్పిస్తాయి. అయితే ఆ రాశులు ఏవో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

ఈ ఏడాది హోలీ తేదీలు
ఈ సంవత్సరం హోలికా దహనం మార్చి 13న జరగనుంది. జ్యోతిష్య ప్రకారం, భద్రుని నీడ ఉదయం 10:35 నుంచి రాత్రి 11:26 వరకు ఉంటుంది. తర్వాత, మార్చి 14న రంగులతో హోలీ ఆడతారు. అదే రోజున చంద్రగ్రహణం కూడా ఏర్పడుతుంది.
మిథున రాశి
హోలీ రోజున చంద్రగ్రహణం వల్ల మిథున రాశి వారు జాగ్రత్తగా ఉండాలి. ఈ సమయం వారి ఆర్థిక పరిస్థితికి, ఆరోగ్యానికి తీవ్రమైన భంగం కలిగించే అవకాశం ఉంటుంది. ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. కుటుంబంలో వివాదాలు తలెత్తే అవకాశం ఉంది. ఉద్యోగుల పని సంబంధిత సమస్యలు కూడా రావచ్చు. అలాగే డబ్బు పరమైన ఇబ్బందుల్లో చిక్కుకునే అవకాశాలు ఉండడంతో ఈ రాశికి చెందిన వ్యక్తులు చాలా జాగ్రత్తగా ఉండాలి.
వృశ్చిక రాశి
వృశ్చిక రాశి వారికి కూడా హోలీ రోజున ఏర్పడుతున్న చంద్రగ్రహణం కొన్ని ప్రతికూల ఫలితాలను తీసుకొస్తుంది. కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటే, ఈ సమయంలో ఈ రాశికి చెందిన వారు వ్యాపారం ప్రారంభించాలనుకుంటే ఆ నిర్ణయాన్ని వాయిదా వేసుకోవడం ఉత్తమం. ఒకవేళ గుడ్డిగా ముందుకు వెళ్తే వ్యాపారంలో నష్టం కలగవచ్చు. ఇంకా.. కుటుంబ సభ్యుల ఆరోగ్యం పట్ల కూడా జాగ్రత్త వహించాలి.
మకర రాశి
మకర రాశి వారు కూడా హోలీ రోజున చంద్రగ్రహణం వల్ల కెరీర్‌లో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు. కార్యాలయంలో ఉన్నత అధికారులతో సమన్వయం చేయడంలో కష్టాలు ఎదుర్కునే అవకాశం ఉంటుంది. ఆదాయం తగ్గిపోవడం, మానసిక ఒత్తిడి కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి.
మీన రాశి
మీన రాశి వారికి హోలీ రోజున చంద్రగ్రహణం కారణంగా ఆర్థిక సమస్యలు కలగవచ్చు. డబ్బు ఆదా చేయడంలో ఇబ్బందులు రావచ్చు, ఖర్చులు పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగస్తులకు పనిభారం పెరగడం సాధ్యం. అలాగే కుటుంబ పరమైన సమస్యలు కూడా ఎక్కువయ్యే అవకాశాలు ఉన్నాయి. అందుకే ఈ నాలుగు రాశులకు చెందిన వారు హోలీ రోజు చాలా జాగ్రత్తగా ఉంటే మంచిది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications