Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
ఈ 3 రాశుల వారు కచ్చితంగా ప్రేమలో నమ్మకద్రోహం చేస్తారు,మీ ప్రేయసి రాశి ఉందేమో చెక్ చేసుకోండి
ఎలాంటి బంధంలోనైనా నమ్మక ద్రోహం అనేది సహించరానిది. నమ్మకద్రోహం వలన ఆ బంధం విడిపోయే అవకాశం ఉంటుంది. అయితే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, కొన్ని రాశుల వారు ఇతరులకన్నా ఎక్కువగా మోసం చేసే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ రాశుల వారు తమ భాగస్వామితో నమ్మకంగా ఉండలేరట. ఈ రాశుల వారు కచ్చితంగా తమ భాగస్వాములను మోసం చేస్తారట. ఇంతకీ ఆ రాశులు ఏవి? అనేది ఈ స్టోరీలో క్లియర్‌గా తెలుసుకుందాం.
మిథున రాశి
ఈ రాశికి చెందిన స్త్రీలు తమ ప్రత్యేకమైన ఉత్సాహం, అభిరుచికి ప్రసిద్ధి చెందిన వారు. వీరు ఎల్లప్పుడూ కొత్త అనుభవాలను పొందడానికి ఇష్టపడుతుంటారు. ఈ క్రమంలో వీరు తమ ప్రేమ జీవితంలో కొంత ఇబ్బందులు ఎదుర్కునే అవకాశం ఉంటుంది. తమకు కొత్తగా థ్రిల్లింగ్‌గా అనిపించే వ్యక్తుల వైపు మొగ్గు చూపుతారు. అలాగే వీరికుండే వినూత్నమైన ఆకర్షణ శక్తితో ఇతరులను ఇట్టే ఆకట్టుకోగలరు.

వీరు ఎక్కువగా అడ్వెంచర్స్ ఇష్టపడతారు. ప్రతిరోజూ కొత్తగా ఉండాలనుకుంటారు. ఒకవేళ తన భాగస్వామితో కొత్తదనం లేకపోయినా తాము అనుకున్నది జరగకపోయినా వీరు వేరే బంధాలను వెతుక్కునే అవకాశం ఉంటుంది. మిమ్మల్ని మోసం చేయడానికి చాలా అవకాశాలు ఉంటాయి.
మేష రాశి
మేష రాశి స్త్రీలు సులభంగా భావోద్వేగానికి లోనవుతారు. అలాగే వీరికి ఎల్లప్పుడూ ఉత్సాహంగా ఉండాలని ఉంటుంది. దీని కారణంగా వారు ప్రేమలో పడినప్పుడు, సంతోషంగా ఉండటానికి దానికోసం ఏం కావాలంటే అది చేయడానికి సిద్ధంగా ఉంటారు. అందుకోసం తమ బంధాన్ని కూడా ఇబ్బందుల్లో పెట్టె అవకాశం ఉంటుంది.
మేష రాశి వారు సాహసయాత్రలలో పాల్గొనాలని తహతహలాడుతుంటారు. అలాగే కొన్నిసార్లు, థ్రిల్‌లను కోరుకునే వారి కోరిక వారిని ప్రమాదకరమైన పనులు చేయడానికి ప్రేరేపిస్తుంది. అలాగే ప్రస్తుతమున్న సంబంధంలో తమ ఆనందం కోల్పోయామని వారు భావిస్తే వారు కచ్చితంగా వేరే సంబంధం పెట్టుకోవడానికి సిద్ధపడతారు.
దీని అర్థం మేష రాశి స్త్రీలు నిజాయితీగా ఉండలేరని కాదు. కానీ వారు నిజాయితీగా ఉండడానికి వారికి కావాల్సిందల్లా ఇవ్వాలి. తమ కోరికలు నెరవేరాలి. ప్రతిరోజూ ఉల్లాసభరితంగా ఉండాలి. అలాంటప్పుడే వారు నిజాయితీగా ఉండే అవకాశం ఉంది. లేకపోతే మిమ్మల్ని ద్రోహం చేసే అవకాశాలు ఉంటాయి.
సింహ రాశి
సింహ రాశి స్త్రీలు ఎల్లప్పుడూ శ్రద్ధను కోరుకుంటారు. వీరిపై ఎల్లప్పుడూ శ్రద్ధ పెట్టాలి. వీరు ఎక్కువగా పొగడ్తలను ఇష్టపడుతుంటారు. తాము కోరుకున్నది జరగాలని అనుకుంటూ ఉంటారు. వీరు ఘాడమైన ప్రేమలో ఉన్నప్పుడు చాలా విశ్వాసంగా ఉంటారు. కానీ వారిపై శ్రద్ధ, పొగడ్తలు తగ్గిపోతే మాత్రం పక్క చూపులు చూసే అవకాశం ఉంటుంది.
సింహ రాశి స్త్రీ తన ప్రేమ జీవితంలో ప్రశంసించబడలేదని లేదా నిర్లక్ష్యం చేయబడిందని భావిస్తే, వారు వేరే చోట శ్రద్ధ కోసం చూసే అవకాశం ఉంటుంది. వీరిని ఎవరైతే మెచ్చుకుంటారో వారి వైపు వీరు ఆకర్షితులవుతారు. భాగస్వామి వారికి కావలసిన ఆప్యాయతను ఇవ్వకపోతే, వారు దానిని వేరొకరి నుండి పొందాలని కోరుకుంటారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications