Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
Horoscope Today: క్రిస్మస్ రోజు నుంచి ఈ రాశుల వారి అప్పులు తీరిపోతాయి!
జోతిష్య శాస్త్రం ప్రకారం ప్రతి గ్రహం ప్రతి రోజూ ఎదో ఒక విధంగా తమ గమనాన్ని, తమ చలనాన్ని మార్చుకుంటూ ఉంటాయి. ఒకరాశి నుంచి మరో రాశిలోకి ప్రవేశించడానికి కదులుతూ ఉంటాయి. దీని కారణంగా ప్రతిరోజూ రాశి ఫలాలు అనేది మారుతూ వస్తాయి. అయితే ఈరోజు ఏ రాశి వారికి ఏ విధంగా ఉంది? క్రిస్మస్ రోజు నుంచి ఎవరికి మంచి ఫలితాలు కలుగుతాయి అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.
మేషం
ఈ రాశి వారు ఇన్ని రోజులుగా ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యలు తొలిగిపోతాయి. ఆర్థికంగా కూడా పరిస్థితులు బాగుంటాయి. ప్రయాణాలు చేస్తే ఈరోజు వీరికి అంతా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు.

వృషభం
ఈ రాశి వారికి ఈరోజు ఆర్థికంగా బాగానే ఉంటుంది. కొంతకాలంగా ఈ రాశి వారిని వేధిస్తున్న సమస్యకు ఈరోజు పరిష్కారం లభించడంతో ఉపశమనం పొందుతారు. ఈరోజు దూర ప్రయాణాలు చేసేవారు భద్రతపై దృష్టి పెట్టాలి.
మిథునం
ఈ రాశి వారికి ఈరోజు ఆర్థికంగా చాలా బాగుంటుంది. వ్యాపారులకు అత్యంత లాభదాయకమైన రోజుగా మారే అవకాశం ఉంటుంది. కుటుంబంలో ఒత్తిడితో కూడిన పరిస్థితులు ఉండొచ్చు. కొన్ని ముఖ్యమైన పనులను అసంపూర్తిగా ఉంచేయకుండా వాటిని పూర్తి చేస్తే మంచిది.
కర్కాటక
ఈ రాశి వారికి ఈరోజు చాలా మంచి రోజు అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ రోజు కొన్ని ముఖ్యమైన పనులకు సంబంధించి మీరు చేసే ప్రయాణం మీకు అనుకూలంగా ఉంటుంది. కొన్ని ఆరోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇంటి వాతావరణం చాలా బాగుంటుంది.
సింహ
ఈ రాశి వారికి ఈరోజు ఆర్థికంగా ఏమాత్రం అనుకూలంగా లేదు. ఈరోజు వీరికి ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. ఉద్యోగ పని విషయంలో కొంత గందరగోళానికి గురవుతారు. మీరు ఊహించిన విధంగా పనులు జరగకపోవడమే మీ సమస్య. తినే ఆహారంపై కొంత ద్రుష్టి పెట్టాలి. లేకపోతే ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది.
కన్య
ఈ రాశి వారికి ఈ రోజు చాలా మంచిగా సాగుతుంది. అలాగే ఈ రాశి వారు ఈరోజును చాలా సంతోషంగా గడుపుతారు. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. వ్యాపారులకు ఆర్థికంగా అనుకూలమైన రోజు. ఆరోగ్య పరంగా కూడా ఈ రోజు అనుకూలంగా ఉంటుంది.
తుల
తులారాశి వారు ఈ రోజున జాగ్రత్తగా ఉండాలి. కొన్ని నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలి. ఆర్థికంగా ఈ రోజు మీకు అనుకూలంగా ఉంటుంది. అయితే పెట్టుబడుల విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ వాతావరణం చాలా బాగుంటుంది.
వృశ్చిక
ఈ రాశి వారు ఈరోజు తమ పనిలో ఎక్కువ శ్రద్ధ వహించాలి. ఇంట్లో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. కొత్త ఉద్యోగం ప్రారంభించడానికి ఈ రోజు మంచిది.
ధనుస్సు
వ్యాపారులకు ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఈ రోజు రావలసిన ధనం చేతికి వస్తుంది. వైవాహిక జీవితంపై దృష్టి పెట్టడం మరియు చిన్న చిన్న సమస్యలను పట్టించుకోవడం మంచిది.
మకర
ఈ రాశి వారికి ఈరోజు మంచిగా కలిసి వస్తుంది. కానీ ఈ రాశి వారు అనవసరమైన చింతలకు దూరంగా ఉండాలి. కొన్ని ముఖ్యమైన పనులు అసంపూర్తిగా మిగిలిపోతాయి. ఆర్థికంగా, ఈ రోజు అనుకూలంగా ఉంటుంది.
కుంభ
మునుపటి పెట్టుబడులు మీకు మంచి రాబడిని అందిస్తాయి. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. ఈ రోజు ఒక ముఖ్యమైన వ్యక్తిని కలవవచ్చు. వైవాహిక జీవితం, కుటుంబ జీవితం బాగుంటుంది.
మీన
ఈ రాశి వారికి ఆరోగ్యం మెరుగుపడుతుంది. అలాగే రావాల్సిన ధనం చేతికి వస్తుంది. మీ ప్రయత్నాలు మంచి ఫలితాన్ని ఇస్తాయి. మీ పనిని మీరే పూర్తి చేసుకోవడం మంచిది. వేరొకరిని నమ్మడం వల్ల కొన్ని కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications