Latest Updates
-
వాతావరణ మార్పులతో మోకాళ్ల నొప్పుల బాధలు.. ఉపశమనం కోసం ఇంట్లోనే ఇలా చేయండి.! -
తిరోగమనం నుంచి బయటపడ్డ బుధ గ్రహం.. ఇక ఈ రాశుల వారి దశ తిరిగినట్లే.! -
సోషల్ మీడియాలో పరిచయాలు నిజమా కాదా.?.. డేటింగ్‌కి వెళ్లేముందు ఈ విషయాలు గమనించండి.! -
ముఖంపై మొటిమలు రావడానికి కారణాలు ఇవే.. వీటిని ఎలా నివారించాలంటే.! -
‘సర్’ కలిపిన బంధం.. ముప్పై ఏళ్ల తర్వాత మళ్లీ తల్లిదండ్రులను చేరిన కుమారుడు.! -
ప్యాకెట్ చిప్స్ కు గుడ్ బై..ఎలాంటి రసాయనాలు లేకుండా ఇంట్లోనే కరకరలాడే ఆలూ చిప్స్ చేసుకోండిలా.. -
మీ పాదాలపై ఇలా ఉందా?.. లివర్ డ్యామేజ్ కి ముందస్తు హెచ్చరిక! -
ఆఫీస్ నుంచి రాగానే అలసటగా ఉందా? 15 నిమిషాల్లో ఈ క్రీమీ పనీర్ గ్రేవీ ట్రై చేయండి..చపాతీ, రైస్ లోకి కేక -
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్‌ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.!
2025లో ఆనందంగా ఉండే రాశులు ఇవే!
2025 ప్రారంభం అవడానికి మరికొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. వచ్చే సంవత్సరంలో అనేక గ్రహాల మార్పులు, అనేక రాశిలలో పెద్ద పెద్ద మార్పులను చూడవచ్చు. 2025లో కూడా సూర్యుడు, శని గ్రహాలు ఒకే రాశిలోకి వెళ్లడం జరుగుతుంది. నవ గ్రహాలకు అధిపతి అయిన సూర్యుడు, శని ఒకే రాశిలో కలవడం జరుగుతుంది. దీని కారణంగా పలు రాశుల వారికి అన్ని విధాలుగా కలిసి వస్తుంది. ఆ రాశుల వారికి ఆర్ధిక పురోగతి కలుగుతుంది.
సూర్యుడు సాధారణంగా గౌరవం, ఆత్మవిశ్వాసాన్ని శాసించే గ్రహంగా పరిగణిస్తారు. కానీ శని కర్మ, ధర్మం, శ్రమను పాలించేదిగా పరిగణించబడుతుంది. రాబోయే సంవత్సరంలో శని మీన రాశిలో సంచరిస్తాడు. మార్చి 29, 2025న శనిగ్రహం కుంభరాశి నుండి మీనరాశిలో ప్రవేశిస్తాడు. దీని కారణంగా ఏ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.

మేషరాశి
మేష రాశికి చెందిన వారికి శని, సూర్యుడు కలవడం వల్ల మేలు జరుగుతుంది. ఈ రాశికి చెందిన వారికి ఆదాయ వనరులు పెరుగుతాయి. దీనివల్ల ఆర్థిక పురోగతి కనిపిస్తుంది. ఈ సమయంలో ఖర్చులు కూడా పెరుగుతాయి. అయితే ఈ ఖర్చులతో సంతోషం పెరుగుతుంది. కోరుకున్న వస్తువులు లభిస్తాయి. అదేవిధంగా కుటుంబసభ్యుల సహకారం కూడా లభిస్తుంది. వైవాహిక జీవితం కూడా సంతోషంగా ఉంటుంది.
వృషభం
సూర్యుడు, శని కలయిక వృషభ రాశికి చెందిన వారికి చాలా సానుకూల మార్పులను తెస్తుంది. ప్రభుత్వ ఉద్యోగులకు పదోన్నతులు, బదిలీలు సులభతరం కానున్నాయి. కొత్త ఉద్యోగార్ధులకు ఇది మంచి కాలం అవుతుంది. వ్యాపారులు ఊహించని లాభాలను పొందుతారు. కుటుంబం సభ్యుల నుంచి పూర్తి మద్దతు లభించడంతో వారు సంతోషకరమైన జీవితాన్ని గడుపుతారు. చాలా రోజులుగా చేయాల్సిన పనులు ఆటంకం లేకుండా పూర్తవుతాయి. అవివాహితులకు మంచి సంబంధం కుదురుతుంది.
మకరరాశి
సూర్యుడు, శని కలయిక మకరరాశి వారికి చాలా శుభ దినాలను తెస్తుంది. దీని కారణంగా ఈ రాశికి చెందిన వారు ఊహించని లాభాలను చూడబోతున్నారు. వీరి ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. పెళ్లికాని వారికి, ముఖ్యంగా ప్రేమ వివాహాలకు ఈ సంవత్సరం చాలా బాగుంటుంది. ఆర్థిక స్థితి ఆశ్చర్యకరంగా పెరగడం వల్ల మీ కష్టాలు తొలగిపోతాయి. వాహన లాభం వంటివి జరుగుతాయి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications