Latest Updates
-
మీ కళ్ల ముందే ఎవరైనా కుప్పకూలిపోతే వెంటనే ఏం చేయాలి? -
నెలసరి సమయంలో వ్యాయామం చేయడం సురక్షితమేనా.. నిపుణుల సలహా ఏంటంటే.? -
ఎముకలకు బలాన్నిచ్చే సంప్రదాయ మటన్ షోర్బా.. ఒక్కసారి రుచి చూస్తే వదిలిపెట్టరు! -
వర్షాకాలం అలర్ట్.. గోడలపై ఇలా ఉంటే ఊపిరితిత్తుల వ్యాధికి దారితీస్తుందా.. డాక్టర్లు చెబుతున్న వాస్తవాలు -
మీ పిల్లలు కెరీర్లో ఉన్నతంగా ఎదగాలంటే.. స్టడీ రూమ్‌లో ఈ వాస్తు సలహాలు పాటించాల్సిందే.! -
ఈ వారం ఈ నాలుగు రాశుల వారికి తిరుగే లేదు.. అన్నింటా విజయమే, కష్టానికి తగిన ప్రతిఫలం.! -
కండల వీరుడికి ఏమైంది? సల్మాన్ ఖాన్ ఇలా అయిపోడానికి కారణం అదేనా? -
ఈ సింపుల్ చిట్కాతో ఎంతటి నల్లటి కడాయి అయినా సరే.. కొత్తదానిలా మెరవాల్సిందే! -
అద్భుత శక్తులున్న 4 రామాలయాలు ఇవే! -
చుక్క పాలు లేకుండానే గడ్డ పెరుగు.. ఇలా సులభంగా తయారు చేయండి!
ఈ తేదీల్లో పుట్టిన వారు.. అన్నిటిలోనూ దుమ్మురేపుతారట, జీవితంలో ఎక్కువగా సక్సెస్ అయ్యేది వీళ్ళే!
సంఖ్యాశాస్త్రం ప్రకారం మన జన్మతేదీ మన జీవితంపై విశేష ప్రభావం చూపుతుందని నమ్మకం ఉంది. మన స్వభావం, ఆలోచనా శైలి, నిర్ణయాలు తీసుకునే విధానం అన్ని మన జన్మతేదీ ఆధారంగా నిర్ణయించబడతాయని సంఖ్యాశాస్త్రం చెబుతోంది. దాని ఆధారంగానే మనిషి యొక్క భవిష్యత్తు, జీవితం అనేది నిర్ణయించబడుతుంది పేర్కొంటారు. ఎందుకంటే ఈ సంఖ్యాశాస్త్రంలో ప్రతి ఒక్క నంబర్‌కు విశేషమైన, ప్రత్యేకమైన శక్తి ఉంటుంది. ఆ ప్రత్యేకత, ఆ శక్తి ఆధారంగానే మనిషి యొక్క జీవితం అనేది నిర్ణయిచబడుతుందని నమ్ముతుంటారు. అయితే సంఖ్యాశాస్త్రం ప్రకారం.. ఏ ఏ తేదీల్లో పుట్టిన వ్యక్తులు వ్యాపారంలో రాణించగలుగుతారు? తమ వ్యాపార సామ్రాజ్యాన్ని ఎదురు లేకుండా నిర్మించుకోగలుగుతారు అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.
మూల సంఖ్య 1
సంఖ్యా శాస్త్రం ప్రకారం ఎవరైతే మూల సంఖ్య 1కి చెందిన వారు ఉంటారో వారు వ్యాపారంలో కింగ్‌గా ఎదుగుతారట. వీరిలో నాయకత్వ లక్షణాలు, వీరి ముందు చూపు తమ వ్యాపారాన్ని గొప్ప సామ్రాజ్యంగా మార్చేందుకు సహాయపడతాయట. వీరిలో ఎదో తెలియని శక్తి ఉంటుందని, అది వీరిని సహజంగానే గొప్ప వ్యక్తులుగా తీర్చిదిద్దుతుందని చెబుతుంటారు.

ఎవరు మూల సంఖ్య 1కి చెందిన వారు
జనవరి నుంచి డిసెంబర్ వరకు ఏ నెలలోనైనా 1, 10, 19 లేదా 28వ తేదీల్లో జన్మించినవారు సంఖ్యాశాస్త్రంలో మూలసంఖ్య 1గా పరిగణించబడతారు. వీరికి సహజంగా నాయకత్వ లక్షణాలు, ఆత్మవిశ్వాసం, స్పష్టమైన దృష్టికోణం ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా వ్యాపార రంగంలో వీరు ఎప్పుడూ ముందంజలో ఉంటారు.
వ్యాపార ప్రపంచంలో వీరి చైతన్యం
ఈ సంఖ్య ఉన్నవారు వ్యాపారాన్ని ఒక ప్రయాణంలా భావిస్తారు, సాధనగా కాదు. వారు ఏ రంగంలోనైనా వ్యాపారం ప్రారంభించినా, తక్కువ సమయంలో మంచి ఫలితాలను పొందగల సామర్థ్యం కలిగి ఉంటారు. వీరిలో ఉన్న ధైర్యం, దృఢనిశ్చయం, సమస్యలను పరిష్కరించే సామర్థ్యం వీరిని ప్రత్యేకంగా నిలబెట్టే అంశాలు.
సూర్యుని అనుగ్రహం మూలసంఖ్య 1 శక్తి మూలం
సంఖ్యాశాస్త్రం ప్రకారం, మూలసంఖ్య 1కి అధిపతి గ్రహం సూర్యుడు. సూర్యుడు శక్తి, వెలుగు, పరిపక్వతకు సంకేతం. అందుకే ఈ సంఖ్య కలిగినవారికి సహజంగా ప్రభావం చూపించే నాయకత్వ స్వభావం ఉంటుంది. వారు ఎక్కడ ఉన్నా ఆత్మవిశ్వాసంతో మెరిస్తారు.
విజయాన్ని వెంపర్లాడే ధైర్యవంతులు
ఇలాంటి వ్యక్తులు ఓ పని మొదలుపెడితే, దాన్ని పూర్తి చేసే వరకు నిద్రపోవరు. ప్రతిబంధకాలను ఎదుర్కొనే ధైర్యం, ఆత్మస్థైర్యం వీరిలో కట్టిపడేస్తుంది. రిస్క్ తీసుకోవడంలో వారు వెనుకడుగు వేయరు. ఎందుకంటే వారికి విజయాన్ని సాధించాలన్న పట్టుదల ఎక్కువగా ఉంటుంది.
విలాసవంతమైన జీవనశైలి, ఎదుగుదలే లక్ష్యం
ఈ సంఖ్య కలిగినవారికి డబ్బు, గుర్తింపు, గౌరవం, స్టేటస్, స్ట్రాంగ్ నెట్‌వర్క్స్ వీరి జీవితంలో ముఖ్యమైన భాగాలు. స్నేహితుల మధ్య, పబ్లిక్ ప్లేసుల్లోనూ వీరి ప్రత్యేకత స్పష్టంగా కనిపిస్తుంది.
మీరు కూడా మూలసంఖ్య 1కే చెందినవారా?
అయితే మీరు సహజంగా ఓ శక్తివంతమైన నాయకులు. మీలో ఉన్న ప్రతిభను గుర్తించండి. వ్యాపారంగా, ప్రొఫెషనల్‌గా, వ్యక్తిగతంగా ముందుకు సాగేందుకు సరైన దిశలో అడుగులు వేయండి. విజయం మీ మార్గాన్ని వెంటాడుతుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications