Latest Updates
-
ఢిల్లీలో ఎండలు మండిపోతున్నాయా? వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ 7 చిట్కాలు మీకోసమే! -
హై ప్రోటీన్ బ్రేక్ ఫాస్ట్ పెసర ఉత్తప్పం..కొబ్బరి చట్నీతో కలిపి తింటే స్వర్గమే! -
వడగాల్పుల నుంచి ప్రాణాలను కాపాడుకోండి! ఎండ తీవ్రతను తట్టుకోవడానికి ఈ ఆహారపు అలవాట్లు తప్పనిసరి -
ఒక్కసారి చేస్తే నెలల తరబడి నిల్వ ఉండే మామిడికాయ తీపి పచ్చడి..టేస్ట్ అదుర్స్! -
ఆది శంకరాచార్య జయంతి: ఇంట్లో పూజలు చేస్తున్నారా? ఈ శుభ ముహూర్తాలు, నియమాలు మీకు తెలుసా? -
మిథున, తుల, కుంభ రాశుల వారికి అద్భుత యోగం.. మీ జాతకం ఎలా ఉంది? - మంగళవారం, 21 ఏప్రిల్ 2026 -
దగ్గు తగ్గట్లేదా? మీ ఊపిరితిత్తుల్లో బూజు ఉండొచ్చు? ఆస్తమా పేషెంట్లకు డాక్టర్ బిగ్ అలర్ట్ -
ఎండలు మండిపోతున్నాయి.. పెళ్లిళ్లపై ఎఫెక్ట్! వేడుకలను మార్చుకోకపోతే కష్టమేనా? -
ఇంట్లో కొబ్బరి లేదా? అయితే ఇడ్లీ, దోసెల్లోకి ఈ కొబ్బరి లేని కొబ్బరి చట్నీ చేసేయండి! -
వడగాల్పుల ఎండలు భయపెడుతున్నాయా? ఈ చిన్న చిట్కాలతో ప్రాణాలు కాపాడుకోండి
2025 Horoscope: రాసిపెట్టుకోండి 2025లో ఈ వ్యక్తులు కచ్చితంగా కోటీశ్వరులు అవుతారు.. ఏదీ కూడా వీళ్ళను ఆపలేదు!
ఇంకో నెల గడిస్తే 2024వ సంవత్సరం ముగుస్తుంది. ఈ ఏడాది ఎన్నో ఇబ్బందులు పడి, ఎంతగానో సంతోషంగా ఉన్న వ్యక్తులు వచ్చే ఏడాది తమ జీవితంలో ఎలాంటి మార్పులు తీసుకురాబోతోంది అని ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే 2025లో ఎవరి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి అని పలు అధ్యయనాలు, కథనాలు ప్రచురించాము. ఇప్పుడు ఏ నక్షత్రం వారికి 2025 అమితంగా కలిసి రానుంది? ఏ నక్షత్రంలో జన్మించిన వ్యక్తులు 2025లో కోటీశ్వరులు అయ్యే అవకాశం ఉందో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
అశ్విని నక్షత్రం
అశ్విని నక్షత్రంలో జన్మించిన వ్యక్తులకు 2025వ సంవత్సరం చాలా ఫలవంతంగా ఉండబోతుంది. 2025లో ఈ నక్షత్రంలో జన్మించిన వ్యక్తుల కృషి, పట్టుదల, సంకల్ప బుద్ధి వారిని గొప్ప విజయాల వైపు నడిపిస్తాయి. అసలు కలలో కూడా ఊహించని స్థాయిలో ఏ నక్షత్రంలో జన్మించిన వ్యక్తులు ధనలాభం పొందుతారు.

అశ్విని నక్షత్రంలో జన్మించిన వ్యక్తులు వ్యాపారంలో ఉన్నట్లయితే అనుకోని స్థాయిలో లాభాలను గడిస్తారు. అలాగే ఈ నక్షత్రంలో జన్మించిన వ్యక్తులకు 2025 శుక్రుడి అనుగ్రహం ఉండడంతో వారు చేపట్టబోయే పనులన్నీ విజయవంతమవుతాయి. మొత్తం మీద 2025లో అశ్విని నక్షత్రానికి చెందిన వ్యక్తులు కోటీశ్వరులయ్యే అవకాశాలు ఉన్నాయి.
రోహిణి
రోహిణి నక్షత్రంలో జన్మించిన వ్యక్తులకు కూడా 2025వ సంవత్సరం అత్యంత అదృష్టవంతమైన సంవత్సరంగా పరిగణించబడుతోంది. ఈ సంవత్సరంలో ఈ రోహిణి నక్షత్రానికి చెందిన వ్యక్తులు తమ వ్యాపారంలో భారీగా లాభాలను పొందుతారు. అలాగే తమ జీవితంలో ఎన్నడూ లేని విధంగా వ్యాపార రంగంలో రాణిస్తారు. ఇప్పటి వరకు వారిని వేధిస్తున్న రుణ బాధలన్నీ తొలిగిపోతాయి. ఆర్ధిక పరిస్థితి బాగా మెరుగవుతుంది. తమ తమ రంగాల్లో అందరూ ప్రత్యేకంగా రాణిస్తారు. కొత్త కొత్త నైపుణ్యాలను నేర్చుకొని ఆదాయ మార్గాలను పెంచుకుంటారు. ఇవి భవిషత్తులో వారికి ఆర్ధిక పరంగా బలంగా ఉండేందుకు సహాయపడతాయి.
మృగశిర
2025వ సంవత్సరం ప్రారంభం నుండే మృగశిర నక్షత్ర జాతకులకు అదృష్టం పట్టుకోనుంది. 2025సంవత్సరం ప్రారంభం నుంచి వారి ప్రతి విషయంలో పై చేయి సాధిస్తారు. ఈ నక్షత్రంలో జన్మించిన వ్యక్తులు చేపట్టబోయే పనులన్నీ విజయవంతమవుతాయి. ప్రతి పనిలోనూ అద్భుతమైన పురోగతిని సాధిస్తారు. ఈ ఏడాది మృగశిర నక్షత్ర జాతకుల ఆర్ధిక కష్టాలన్నీ తొలిగిపోతాయి. 2024లో వచ్చిన సమస్యలన్నీ 2025లో ముగుస్తాయి.
పుష్యమి
2025 సంవత్సరం పుష్యమి నక్షత్ర జాతకులకు శ్రేయస్సు, అభివృద్ధితో నిండి ఉంది. ఈ సంవత్సరం ఈ నక్షత్రానికి చెందిన జాతకుల ఆర్ధిక కష్టాలన్నీ తొలిగిపోనున్నాయి. ఆర్ధిక విషయాల్లో నిరంతర అభివృద్ధి, వ్యక్తిగత సంతృప్తి లభిస్తుంది. వ్యాపారంలో భారీగా లాభాలను పొందుతారు. ఇతరులకు సహాయం చేయడానికి కూడా ఈ నక్షత్రంలో జన్మించిన వ్యక్తులు 2025 సంవత్సరంలో ముందుకు వస్తారు. దీని కారణంగా ఈ నక్షత్ర జాతకులకు సమాజంలో మంచి గుర్తింపు వస్తుంది.
ఆశ్లేష
2025వ సంవత్సరం ఆశ్లేష నక్షత్ర జాతకులకు అదృష్టం, సంపదను తీసుకురానుంది. 2025లో ఈ నక్షత్ర జాతకులు తమ శ్రమకు తగ్గ ఫలితాలను పొందుతారు. చేపట్టిన పనులన్నీ విజయవంతమవుతాయి. వ్యాపారంలో గొప్ప విజయాలను సాధిస్తారు. అలాగే వీరి జీవన విధానం కూడా మారిపోనుంది. వ్యాపారులకు మాత్రమే కాదు ఉద్యోగులకు కూడా ఈ సంవత్సరం అమోఘంగా ఉండబోతుంది. వివాహాలు కానీ వారికి వివాహాలు జరిగే అవకాశం ఉంది.
శ్రావణ నక్షత్రం
శ్రావణ నక్షత్రంలో జన్మించిన వారు 2025లో వారి తెలివితేటల వల్ల అపారమైన సంపదను పొందుతారు. 2025లో వీరు ఆర్ధిక స్థిరత్వాన్ని సాధిస్తారు. వృత్తి, వ్యాపారం, పెట్టుబడుల్లో గణనీయమైన అభివృద్ధిని సాధిస్తారు. ఆర్ధిక పరమైన నిర్ణయాలు అన్నీ విజయవంతంగా మారుతాయి. ఉద్యోగస్తులు ఉన్నత స్థానాల్లో పదోన్నతులు పొందుతారు. ఈ నక్షత్రంలో జన్మించిన వ్యక్తులకు అదృష్టం మాత్రమే కాదు, తెలివితేటలు కూడా 2025లో వారికి అండగా నిలుస్తాయి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications











