Latest Updates
-
అబ్బాయి వర్జిన్ కాదని పెళ్లి రద్దు చేసుకున్న యువతి..అసలు నువ్వు వర్జినేనా అంటూ.. -
100 ఏళ్లు బతికించే హెల్తీ బ్రేక్ ఫాస్ట్..రోజుకి ఒక గిన్నె తింటే బరువు ఇట్టే తగ్గిపోతారు..ఎలా చేసుకోవాలంటే.. -
హోటల్ స్టైల్ ఇడ్లీ కారం పొడి..బ్రేక్ ఫాస్ట్ లోకి చట్నీ కూడా వద్దంటారు..ఇంట్లోనే ఇలా చేసుకోండి.. -
కిడ్నీలు పాడవడానికి ముందు కనిపించే ముఖ్యమైన లక్షణాలు ఇవే -
ఇడ్లీ,దోశ,చపాతీల్లోకి కేక పుట్టించే చికెన్ నిర్వాణ..బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చు -
పెద్ద ఎర్రిపప్ప అయ్యావ్ మావా: ప్రియురాలి కోసం మొత్తం అమ్మేసి 1900 కి.మీ ప్రయాణించి వెళ్తే..అసలు అమ్మాయే కాదట! -
దసరా స్పెషల్ నైవేద్యం చక్కెర పొంగలి..సంప్రదాయ పద్ధతిలో ఇలా చేస్తే ఇళ్లంతా డివోషనల్ వైబ్ -
దసరా స్పెషల్ కట్టె పొంగలి..ఇలా చేస్తే చల్లారినా కూడా గట్టిగా మద్ద అవ్వదు! -
దసరా నాడు అపరాజితా దేవి పూజ ఎలా చేయాలి? శుభ ముహూర్తం, మంత్రాలు, శమీ పూజ డీటెయిల్స్.. -
దసరా స్పెషల్ రెడ్ చికెన్.. చికెన్ కర్రీ వండేటప్పుడు ఈ సీక్రెట్ మసాలా వేస్తే టేస్ట్ నెక్ట్స్ లెవల్ అంతే!
ఈ తేదీల్లో పుట్టిన వ్యక్తులు బిజినెస్లో కింగ్ అవుతారు.. వీరిని ఎవరూ డామినేట్ చేయలేరు!
మన జీవితాన్ని మనం పుట్టిన తేదీ ఎంతో ప్రభావితం చేస్తుంది. మన పుట్టిన తేదీ ఆధారంగా మన భవిష్యత్తు, భవిష్యత్తులో మనం చేయబోయే కార్యాలన్నీ అంచనా వేయొచ్చని జ్యోతిష్యశాస్త్ర నిపుణులు చెబుతుంటారు. జన్మించిన తేదీ ఆధారంగా ఒక వ్యక్తి యొక్క సంఖ్యా అంకం ఉంటుంది. అయితే కొన్ని అంకాలు కలిగిన వారు బిజినెస్లో కింగ్ అవుతారట. అయితే ఏ తేదీల్లో పుట్టిన వ్యక్తులు బిజినెస్లో రాణిస్తారు? వారికి ఏ విధమైన ప్రయోజనాలు ఉంటాయి అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.
నంబర్ 5
5, 14, 23 తేదీల్లో పుట్టిన వ్యక్తులకు 5 అంకం వస్తుంది. ఇది బుధ గ్రహానికి చెందిన సంఖ్య. బుధుడు తెలివితేటలు, చురుకుతనం, మార్పులకు ఓ దారితీసే గ్రహం. 5 అంకం ఉన్న వారు సాధారణంగా స్వతంత్రంగా జీవించడానికి ఇష్టపడతారు. వారు కొత్త విషయాలను తెలుసుకోవడంలో ఆసక్తి చూపిస్తారు. ఏ పరిస్థితిని అయినా ధైర్యంగా ఎదుర్కొంటారు. మార్పులను త్వరగా అంగీకరించి, ఆ మేరకు అనుసరిస్తారు.

5 అంకం ఉన్న వారు ఎప్పుడూ కొత్త ఆలోచనలతో ముందుకు సాగాలని కోరుకుంటారు. వారు సాహసోపేతంగా నిర్ణయాలు తీసుకుంటారు. అలాగే వ్యాపార రంగంలో ప్రగతి సాధిస్తారు. కొత్త వ్యూహాలను రూపొందించడం వారి ప్రత్యేకత. వీరికి మంచి నాయకత్వ లక్షణాలు ఉంటాయి.. అలాగే వాణిజ్యం, మార్కెటింగ్, కమ్యూనికేషన్ రంగాలలో గొప్ప విజయాలు సాధిస్తారు.
ఈ సంఖ్యతో ఉన్న వ్యక్తులు ఏ సమస్యనైనా సులభంగా అర్థం చేసుకుని, పరిష్కారం కనుగొంటారు. వారు త్వరగా నిర్ణయాలు తీసుకుని, ఆందోళన లేకుండా ధైర్యంగా వ్యవహరిస్తారు. వీరి ఆత్మవిశ్వాసం, చురుకుదనం వారిని విజయం సాధించే వ్యక్తులుగా నిలబెడుతుంది.
5 అంకం ఉన్నవారు ఆకర్షణీయమైన వ్యక్తిత్వం కలిగి ఉంటారు. వారి మాటలు చాలా మందిపై ప్రభావం చూపిస్తాయి. స్నేహం చేయడంలో వారు ప్రత్యేకమైన మేథస్సు చూపుతారు. ఇతరుల భావోద్వేగాలను అర్థం చేసుకునే సహజ సామర్థ్యం వీరిలో ఉంటుంది.
వారు సామాజికంగా చురుకుగా చురుగ్గా ఉంటూ పెద్ద సమూహాల్లో కలిసిపోతారు. అయినప్పటికీ, ప్రేమ సంబంధాలలో అంతగా అదృష్టం ఉండకపోవచ్చు. వారు నమ్మకద్రోహం ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. దీర్ఘకాలిక ప్రేమ సంబంధాలను కొనసాగించడంలో కొంత ఇబ్బంది పడవచ్చు.
ఈ సంఖ్యతో ఉన్న వ్యక్తులు ధైర్యంగా, సాహసోపేతంగా నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారంలో పెద్ద రిస్కులను తీసుకోవడంలో వారికి ఎలాంటి భయం ఉండదు. అయితే, ప్రేమ సంబంధాలలో ఓర్పు అవసరం. వారి ధైర్యం, ప్రబలమైన వ్యక్తిత్వం సమాజంలో గౌరవాన్ని తెస్తాయి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications
