Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
30 సంవత్సరాల తరువాత ఏర్పడుతున్న ప్రమాదకర యోగం.. ఈ మూడు రాశుల వారికి దబిడిదిబిడే!
జ్యోతిషశాస్త్రంలో అన్ని గ్రహాలకు ప్రాముఖ్యత ఇవ్వబడింది. అన్ని గ్రహాలు నిర్దిష్ట సమయాల్లో తమ స్థానాలను మార్చుకుంటూ ఉంటాయి. ఇది అన్ని రాశుల వారిని తీవ్రంగాప్రభావితం చేస్తుంది. గ్రహాలు తమ స్థానాలను మార్చుకున్నప్పుడు వివిధరకాల యోగాలు ఏర్పడుతాయి. కొన్నిసార్లు మంచి యోగాలు ఏర్పడితే, మరికొన్ని సార్లు కొన్ని ప్రమాదకరమైన యోగాలు మనుషులను ఇబ్బందుల్లో పడేస్తాయి. అయితే శని ఈనెల చివరలో మీనరాశిలో ప్రవేశిస్తాడు. అదే రాశిలో రాహువు కూడా సంచరించనున్నాడు. దీని కారణంగా పిశాచి యోగం ఏర్పడుతుంది.
ఈ యోగం కారణంగా కొన్ని రాశుల వారికి చెడు జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. వారికన్నీ దుష్ప్రయోజనాలు కలగనున్నాయి. కుటుంబ, సమాజాల్లో ఇబ్బందులు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. ముఖ్యంగా రాహువు, శని కలవడం కారణంగా ఈ ప్రభావం కొంతమేర ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. జ్యోతిష్య నిపుణులు సైతం కొన్ని రాశుల వారిపై ఈ పిశాచి యోగం తీవ్రమైన ప్రభావం చూపిస్తుందని చెబుతున్నారు. ఇంతకీ ఆ రాశులు ఏవి? ఏ రాశుల వారికి చెడు ప్రయోజనాలు కలగనున్నాయి అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.

మీన రాశి
మీన రాశి వారి జాతకంలో మొదటి స్థానంలో ఈ పిశాచి యోగం ఏర్పడుతుంది. దీని కారణంగా, ఈ ఈ రాశికి చెందిన వ్యక్తులు తమ జీవితంలో అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. జీవితంలో శాంతి, ఆనందం కరువవుతుంది. మీ జీవితంలో అతి ముఖ్యమైన నిర్ణయం తీసుకునేటప్పుడు మీరు సమస్యలను ఎదుర్కునే అవకాశం ఉంటుంది. మీరు చేపట్టే అన్ని పనులలో మీరు అడ్డంకులు, సమస్యలను ఎదుర్కొంటారు. పనిలో ఒత్తిడి మరింత తీవ్రంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. వ్యాపారంలో కూడా భారీగా నష్టాలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. సమాజంలో ప్రతిష్టకు భంగం కలగనుంది. కుటుంబంలో కూడా కొంత ఇబ్బందులు తలెత్తే సూచనలు కనిపిస్తున్నాయి.
సింహ రాశి
పిశాచి యోగం సింహ రాశి వారి జాతకంలో తమ 8వ స్థానంలో ఏర్పడుతుంది. దీని వలన ఈ రాశిలో జన్మించిన వారి ఆరోగ్యంలో అనేక సమస్యలు ఏర్పడవచ్చు. ఆర్థిక విషయాల్లో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. పాత అనారోగ్యాలు మిమ్మల్ని వెంటాడతాయి. అనవసరమైన ఖర్చు పెరిగిపోతాయి. ఆ అనవసరమైన ఖర్చులను భరించడానికి అదనపు ప్రయత్నం చేయాలి. సంబంధాలలో అభిప్రాయభేదాలు ఉండవచ్చు. స్నేహితులతో పాటు వైవాహిక బంధంలో కూడా అనేక బాధలు ఉద్భవించే అవకాశం ఉంటుంది. కొన్ని పనులు మీకు అనుకూలంగా జరగకపోవచ్చు. దాని కారణంగా మీరు మానసికంగా ఇబ్బందులకు గురయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. కుటుంబ సభ్యులు అనారోగ్యానికి గురవుతారు.
వృషభం
ఈ పిశాచి యోగం వృషభ రాశి జాతకంలో 11వ స్థానంలో ఏర్పడుతుంది. దీని వలన ఈ రాశి వారు చాలా కాలంగా అనుభవిస్తున్న ప్రశాంతతను కోల్పోతారు. మీరు కుటుంబం, స్నేహితులు, బంధువుల నుండి సమస్యలను ఎదుర్కోవచ్చు. మీ అన్ని పనులలో మీరు అడ్డంకులు, సంభావ్య సమస్యలను ఎదుర్కొంటారు. మీరు రియల్ ఎస్టేట్, ఆస్తి, పొదుపు, ఆర్థిక విషయాలకు సంబంధించి సమస్యలను ఎదుర్కోవచ్చు. పిల్లల విషయంలో మీరు కొన్ని ఇబ్బందులను ఎదుర్కోవలసి రావచ్చు. కడుపు సంబంధిత సమస్యతో మీరు తీవ్రంగా బాధపడే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications