Latest Updates
-
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.!
ఈ రాశుల వారిపై శక్తివంతమైన గజకేసరి రాజయోగం.. వీరికి ఏం జరగనుందంటే!
జోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు ఎప్పటికప్పుడు తమ స్థానాలను మార్చుకుంటూ ఉంటాయి. ఇలా ఒక రాశిలో గ్రహాలు ఇంకో రాశిలోకి ప్రవేశించడం వల్ల కొన్ని యోగాలు ఏర్పడతాయి. అయితే వృషభ రాశిలోకి చంద్రుడు ప్రవేశించడంతో పాటు అదే రాశిలోనే బుధ గ్రహం కూడా సంచరిస్తోంది. దీని కారణంగా అన్ని యోగాల్లో అత్యంత శక్తివంతమైన గజకేసరి రాజయోగం ఏర్పడనుంది. దీని కారణంగా పలు రాశుల వారికి అత్యంత రాజయోగం పట్టనుంది.
అయితే ఈ గజకేసరి రాజయోగం అంటే ఏంటి, ఈ రాజయోగం పట్టిన వారికి ఎలాంటి ఫలితాలు ఉండనున్నాయి, ఏ విధమైన ప్రభావం ఆ రాశులపై ఉండనుంది అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.
ముందుగా గజకేసరి రాజయోగం అంటే ఏంటో తెలుసుకుందాం..
నవగ్రహాల్లో అత్యంత శుభదాయకమైన గ్రహంగా బుధ గ్రహాన్ని పరిగణిస్తారు. ఈ గ్రహం ఏ రాశిలో సంచరిస్తే ఆ రాశివారికి శుభకాలం నడుస్తుందని చెబుతుంటారు. అయితే ఈ బుధ గహం చంద్రుడితో కలిసినప్పుడు ఈ గజకేసరి రాజయోగం ఏర్పడుతుంది. ఈ ఏడాది ఈ రాజయోగం అక్టోబర్ 19న ఏర్పడింది. ఇది కొన్ని నెలల పాటు కొనసాగనుంది.

ఏ రాశి వారికి శుభకాలం ఉండనుందంటే..
మేష రాశి: ఈ అత్యంత శక్తివంతమైన గజకేసరి రాజయోగం మేష రాశి వారికి పట్టనుంది. ఈ కారణంగా ఆ రాశివారికి అత్యంత అదృష్ట కాలం నడుస్తుంది. ఈ రాజయోగం నడుస్తున్న సమయంలో ఈ రాశి వారికి ఆర్థికంగా అనేక ప్రయోజనాలు చేకూరతాయి. చేపట్టిన అన్నీ కార్యక్రమాలు విజయవంతమవుతాయి. ఆదాయం వచ్చే మార్గాలు కూడా ఎక్కువ అవుతాయి. జీవితంలో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి. దాంపత్య జీవితం కూడా ఎంతో సుఖప్రాయంగా ఉండనుంది.
కన్య రాశి: ఈ రాశి వారికి ఈ గజకేసరి రాజయోగం కారణంగా అదృష్టం కలిసి వస్తుంది. ఈ రాజయోగం నడుస్తున్న సమయంలో ఈ రాశి వారికి అన్ని శుభకాలమే నడుస్తుంది. అన్నీ శుభర్తలు వింటూ ఉంటారు. ఉద్యోగాలు చేసే వారికి, వ్యాపార రంగంలో ఉండే వారికి ఈ రాజయోగం అత్యంత అనుకూలమైన సమయం. ఈ రాజయోగం కొనసాగుతున్న సమయంలో కన్య రాశి వారు వాహనాలు, ఆస్తులు కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఈ రాశివారికి ఈ కలం ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది.
తుల రాశి: ఈ రాజయోగం కారణంగా తులా రాశి వారికి చాలా అనుకూల కాలం నడుస్తుంది. ఈ రాశి వారికి ఆర్థికంగా అనేక ప్రయోజనాలు చేకూరుతాయి. ఈ సమయంలో తులా రాశి జాతకులు తలపెట్టే అన్ని కార్యక్రమాలు విజయవంతమవుతాయి. దీని కారణంగా మానసిక ప్రశాంతను పొందుతారు. కుటుంబానికి సమయాన్ని కేటాయిస్తారు. ఎప్పటి నుంచో పెండింగ్‌లో ఉన్న పరీక్షల్లో సైతం ఉత్తీర్ణత సాధిస్తారు.
గమనిక: ఈ కథనంలో మేము పొందుపరిచిన అంశాలు జోతిష్య, పండిత నిపుణుల అభిప్రాయం, ఇంటర్నెట్‌లో మాకు దొరికిన సమాచారం ఆధారంగా అందించబడింది. ఇవి కచ్చితమైనవని మేము నిర్ధారించడం లేదు. వీటిని మీరు నమ్మడం అనేది పూర్తిగా మీ వ్యక్తిగత అభిప్రాయం. అలాగే నిపుణుల సలహాలు తీసుకుంటే ఉత్తమం.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications