Latest Updates
-
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.!
సంక్రాంతి రోజు అత్యంత అరుదైన పుష్య నక్షత్ర యోగం.. ఈ రాశులకు భారీగా డబ్బు వచ్చి పడుతుంది
సూర్య భగవానుడు జనవరి 14న తన కొడుకు శని రాశి అయిన మకరరాశిలోకి ప్రవేశిస్తాడు. అయితే పుష్య నక్షత్రంలో ఈ మార్పు కారణంగా సూర్యుని ఈ సంచార ప్రాముఖ్యత మరింత పెరిగింది. దీంతో జనవరి 14న పుష్య నక్షత్ర యోగం ఏర్పడుతుంది. ఈ శుభ యోగం జనవరి 14వ తేదీ ఉదయం 10:17 గంటలకు ప్రారంభమై జనవరి 15వ తేదీ ఉదయం 10:28 గంటలకు ముగుస్తుంది.
జ్యోతిషశాస్త్రంలో పుష్య నక్షత్రం అత్యంత పవిత్రమైన నక్షత్రరాశులలో ఒకటిగా పరిగణించబడుతుంది. దీనిని కింగ్ ఆఫ్ ది స్టార్స్ అని కూడా పిలుస్తారు. అన్ని శుభ కార్యాలను ప్రారంభించడానికి ఇది అనువైనదిగా పరిగణించబడుతుంది. మకర సంక్రాంతి రోజున పుష్య నక్షత్ర యోగం ఏర్పడటం చాలా అరుదుగా జరుగుతుంది. ఈ అరుదైన యోగం కారణంగా నాలుగు రాశుల వారికి విశేష ప్రయోజనాలు ఉంటాయి.

విశేష ప్రయోజనాలు పొందే నాలుగు రాశులివే
కర్కాటక రాశి
పుష్య నక్షత్రానికి అధిపతి శని దేవుడు. పుష్య నక్షత్రంలో పుట్టిన వారి రాశి కర్కాటక రాశి. సంక్రాంతి రోజు పుష్య నక్షత్ర యోగం ప్రభావంతో కర్కాటకరాశిపై శనిదేవుని విశేష ఆశీస్సులు కురుస్తాయి. అన్ని రంగాలలో విజయావకాశాలు ఉంటాయి. పెండింగ్‌లో ఉన్న పనులన్నీ పూర్తవుతాయి. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. శుభ కార్యాలు విజయవంతమవుతాయి. శత్రువులపై విజయం సాధించి ఆకస్మిక ధనలాభం పొందే అవకాశాలు ఉన్నాయి. పాత మిత్రులను కలుసుకోవచ్చు. కార్యాలయంలో మీ పని ప్రశంసించబడుతుంది. ఆరోగ్యం కూడా బాగుంటుంది. సంక్రాంతి రోజున చేసే ధానధర్మాలకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది కాబట్టి నల్ల నువ్వులు, పచ్చి పాలతో శివునికి అభిషేకం చేయడం మంచింది. .
తుల రాశి
మకరరాశిలోకి ప్రవేశించిన తర్వాత, సూర్యుడు ఈ రాశిచక్రంలోని నాల్గవ ఇంట్లో సంచరిస్తాడు. దీంతో తుల రాశి వారికి సౌకర్యాలు పెరుగుతాయి. ఇంట్లో సంతోషం ఉంటుంది. గృహంలో శుభ కార్యాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. వృత్తి, వ్యాపారాలలో విజయాన్ని పొందుతారు. కొత్త ఆదాయ వనరులు లభిస్తాయి. డబ్బు ఆదా చేయడంలో విజయం సాధించవచ్చు. అత్తమామల వల్ల ధనలాభం వస్తుంది. తెలివితేటలు పెరుగుతాయి. పుణ్య కార్యాలలో పాల్గొనడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. పాలు, తెల్ల నువ్వులు, తెల్లని వస్త్రాలు దానం చేయడం మంచిది.
మకరం
నిలిచిపోయిన పనులు పూర్తవుతాయి. ఒత్తిడి తగ్గుతుంది. ఆదాయం పెరుగుతుంది. గౌరవం పెరుగుతుంది. ప్రభావవంతమైన వ్యక్తులను కలవడం వల్ల మీ పనిలో శీఘ్ర విజయం లభిస్తుంది. ఒకేసారి అనేక ఉద్యోగ ఆఫర్లను పొందుతారు. ఉద్యోగులు ప్రమోషన్ పొందే అవకాశముంది. మీ ఆదాయం కూడా పెరుగుతుంది. కుటుంబంలో కొన్ని మతపరమైన సంఘటనలు జరగవచ్చు. రాజకీయాల్లో మీ అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకుంటే ఈ సమయంలో మంచి అవకాశం ఉంటుంది. ఆరోగ్యం మునుపటి కంటే బాగుంటుంది. నల్ల నువ్వులను దానం చేయండి.
కుంభం
ఈ రోజు ముఖ్యంగా కుంభ రాశి వారికి ఫలవంతంగా ఉంటుంది. శనిదేవుని అనుగ్రహం వల్ల చేపట్టే ప్రతి పని విజయవంతం అవుతుంది. అన్ని పనులు సఫలమై జీవితంలో సంతోషం కలుగుతుంది. పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తి చేస్తారు. మానసిక ఒత్తిడి నుండి ఉపశమనం పొందుతారు. ఆదాయం కూడా పెరుగుతుంది. శత్రువులపై విజయం సాధిస్తారు. పాత రోగాల నుంచి విముక్తి లభిస్తుంది. శని దేవుడికి నల్ల నువ్వులను సమర్పించండి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications