Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
2025 కొత్త సంవత్సరంలో నిజంగా నక్క తోక తొక్కిన రాశులు ఇవే..! ఎలా చూసిన వీరికి అంతా అదృష్టమే..!
Newyear 2025 Astrology: ఏ శాస్త్రం ప్రకారం అయినా, ఏ జోతిష్యుడిని అడిగినా 2025లో గ్రహాల సంచారం అనేది చాలా ముఖ్యమైనదని చెబుతారు. ఎందుకంటే 2025లో ఎన్నో గ్రహాల కలయిక, ఎన్నో గ్రహాల స్థానచలనాలు జరగనున్నాయి. దీని కారణంగా అనేక యోగాలు ఏర్పడనున్నాయి. అలాగే రాశి చక్రంలోని అన్ని రాశులు ప్రభావితం కానున్నాయి. దీని కారణంగా అన్ని రాశుల వారికి ఎదో ఒక విధంగా అనేక విశేష ప్రయోజనాలు దక్కనున్నాయి. ఈ గ్రహాల కలయికలో ముఖ్యమైనది ఈ ఏడాది ప్రారంభంలో రాహువు, బుధుడు గ్రహాల కలయిక జరగనుంది. దీని కారణంగా ఏ రాశుల వారికి ప్రయోజనాలు కలగనుంది అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.
వృషభ రాశి
2025వ సంవత్సర ప్రారంభంలో రాహు, బుధ గ్రహాల కలయిక ఈ వృషభ రాశి వారికి ప్రత్యేకమైనదిగా చెప్పుకోవచ్చు. దీని కారణంగా వృషభ రాశి వారికి కొత్త సంవత్సరంలో కొత్త అవకాశాలు లభిస్తాయి. వృషభ రాశి వారు తమ జీవితానికి సంబంధించిన కొత్త ప్రణాళికలు రచించుకుంటారు. ఈ రాశి వారి ఆర్ధిక పరిస్థితి మెరుగుపడుతుంది. వ్యాపారాలు చేసే వారికీ లాభాలతో రావడంతో పాటు వారి ఆర్ధిక పురోగతి మెరుగుపడుతుంది. విదేశాల్లో పని చేస్తున్న ఉద్యోగులకు మంచి అవకాశాలు లభిస్తాయి. అలాగే వారి జీవితం మెరుగుపడుతుంది.

తులా రాశి
2025వ సంవత్సరంలో తులా రాశి వారికి రాహువు, బుధుడు కలయిక ప్రత్యేకమైన ప్రయోజనాలను కలిగించనుంది. ఈ సమయంలో ఈ రాశుల వారి జీవితం తీవ్రంగా మంచి మార్గంలో ప్రభావితం కానుంది. జీవితంలో అనూహ్యమైన ఎదుగుదలను చూడొచ్చు. పరిశోధన, సాంకేతిక రంగాల్లో పని చేస్తున్న వ్యక్తులు మంచి విజయాలను సాధించొచ్చు. వ్యాపారానికి సంబంధించి ఈ రాశి వారు ఎలాంటి ప్రణాళికలు రచించుకున్నా అవి అద్భుతమైన విజయాలకు కారణమవుతాయి. జీవితంలో ఎన్నడూ లేని విధంగా వ్యాపారంలో రాణించే అవకాశం ఉంటుంది. అలాగే వ్యాపారంలో ఆర్ధిక ప్రయోజనాలు కూడా కలుగుతాయి.
వృశ్చిక రాశి
2025 సంవత్సరం ప్రారంభంలో ఒక నెల తరువాత ఈ రాహు, బుధ గ్రహాల కలయిక జరుగుతుంది. వీర్ కలయిక వల్ల లాభపడుతున్న రాశుల్లో వృశ్చిక రాశి కూడా ఒకటి. ఈ రాశి వారికి రాహు, బుధ గ్రహాల కలయిక వల్ల ప్రత్యేకమైన ఆర్ధిక ప్రయోజనాలు కలుగుతాయి. అలాగే భాగస్వామ్యంతో చేసే వ్యాపారాలు భారీగా లాభాలను తీసుకొస్తాయి. వృశ్చిక రాశికి చెందిన వ్యక్తులు ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నట్లైతే వారికి మంచి అవకాశాలు లభిస్తాయి. గొప్ప ఉద్యోగం పొందే అవకాశం ఉంటుంది. ఈ రెండు గ్రహాల కలయిక వలన వివాహం చేసుకున్న వ్యక్తులు కూడా మంచి సంతోషకరమైన జీవితాన్ని గడుపుతారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications