Latest Updates
-
వడగాల్పుల ఎండలు భయపెడుతున్నాయా? ఈ చిన్న చిట్కాలతో ప్రాణాలు కాపాడుకోండి -
చీఫ్ గెస్ట్ గా పిలవలేదని.. క్రికెట్ పిచ్ ను ట్రాక్టర్‌తో దున్నేసిన పొలిటికల్ లీడర్..వీడియో చూడండి -
JEE మెయిన్ రిజల్ట్ టెన్షన్ ఉందా? చాణక్యుడి ఈ సూత్రాలు పాటిస్తే విజయం మీదే -
జంక్ ఫుడ్ వద్దు.. కుర్ కురేకి బదులు ఇంట్లోనే క్రిస్పీ బెండకాయ పకోడీ చేసుకోండిలా! -
పదే పదే నీళ్లు తాగుతున్నారా? సద్గురు చెబుతున్న ఈ షాకింగ్ నిజాలు తెలుసుకోండి! -
బరువు తగ్గాలా? జిమ్ తర్వాత ప్రొటీన్ కావాలా? అయితే ఈ నల్ల శెనగల సలాడ్ మీ కోసమే! -
ఎండల తీవ్రతతో సతమతమవుతున్నారా? ఈ చిట్కాలతో శరీరాన్ని చల్లబరుచుకోండి! -
5 నిమిషాల్లో అదిరిపోయే ఎగ్ బర్గర్.. టేస్ట్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే! -
అక్షయ తృతీయ 2026: ఈ సమయం దాటితే పూజ ఫలితం ఉండదా? -
వృషభం, కన్య, మకర రాశుల వారికి ధన యోగం.. ఎవరికి అదృష్టం వరించనుంది? - సోమవారం, 20 ఏప్రిల్ 2026
Grahan Yoga :18 ఏళ్ల తర్వాత రాహు-చంద్రుల కలయిక..ఆ 3 రాశుల వారికి అష్టకష్టాలు!
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం మన జీవితాల గమనాన్ని నవగ్రహాలు శాసిస్తాయి. గ్రహాల కదలికలు, వాటి కలయికలు మన భవిష్యత్తుపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి. ఈ క్రమంలో, జూన్ 16వ తేదీన ఆకాశంలో ఒక అరుదైన, శక్తివంతమైన, కొంత ప్రతికూలమైన యోగం ఏర్పడనుంది. అదే "గ్రహణ యోగం". దాదాపు 18 సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత ఛాయా గ్రహమైన రాహువు, మనఃకారకుడైన చంద్రుడు కుంభరాశిలో కలవబోతున్నారు. ఈ కలయిక వల్ల ఏర్పడే గ్రహణ యోగం అన్ని రాశుల వారిపై తన ప్రభావాన్ని చూపనుంది.
గ్రహణ యోగం కొందరికి ఇది మిశ్రమ ఫలితాలనిస్తే మరికొన్ని రాశుల వారికి మాత్రం రానున్న రోజులు ఒక అగ్నిపరీక్షలా మారనున్నాయి. ముఖ్యంగా ఆర్థిక నష్టాలు, ఆరోగ్య సమస్యలు, మానసిక ఒత్తిడి వంటి సవాళ్లను ఎదుర్కోవాల్సి రావచ్చు. ఈ గ్రహణ యోగం కారణంగా అత్యంత జాగ్రత్తగా ఉండాల్సిన మూడు రాశులు ఎవరో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

మీన రాశి
మీన రాశి వారికి 12వ స్థానమైన వ్యయ స్థానంలో ఈ గ్రహణ యోగం ఏర్పడుతోంది. దీని కారణంగా అనవసర ప్రయాణాలు, ఊహించని ఖర్చులు మిమ్మల్ని ఉక్కిరిబిక్కిరి చేయవచ్చు. ప్రయాణాల్లో మీ విలువైన వస్తువుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. వ్యాపారులు కొత్త ఒప్పందాలు, పెట్టుబడుల విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే భారీ నష్టాలు తప్పవు. ఉద్యోగంలో పనిభారం, పై అధికారుల నుంచి ఒత్తిడి ఎదుర్కోవచ్చు. మీ శ్రమకు గుర్తింపు లభించకపోగా, అపనిందలు ఎదుర్కొనే ప్రమాదం ఉంది.
కర్కాటక రాశి
కర్కాటక రాశి వారికి అష్టమ స్థానంలో ఈ యోగం ఏర్పడటం వల్ల మానసిక ఒత్తిడి తీవ్రంగా ఉంటుంది. ఆరోగ్యం విషయంలో అస్సలు నిర్లక్ష్యం చేయవద్దు. ముఖ్యంగా వాహనాలు నడిపేటప్పుడు అత్యంత జాగ్రత్త అవసరం. అనూహ్య ఖర్చులు మీద పడి ఆర్థిక ఇబ్బందులకు దారితీయవచ్చు. కుటుంబ సభ్యులు, ముఖ్యంగా జీవిత భాగస్వామితో మాటల యుద్ధం జరిగే సూచనలున్నాయి. ఇది మీ మానసిక ప్రశాంతతను దెబ్బతీస్తుంది.
కుంభ రాశి
స్వయంగా కుంభ రాశిలోనే, అంటే మీ లగ్న భావంలోనే ఈ గ్రహణ యోగం ఏర్పడటం అత్యంత ప్రభావవంతం. దీనివల్ల వృత్తి, వ్యక్తిగత జీవితాల మధ్య సమన్వయం సాధించడం కత్తిమీద సాములా మారుతుంది. జీవిత భాగస్వామితో మనస్పర్థలు రావచ్చు. ఈ సమయంలో ఇతరులకు అప్పుగా డబ్బు ఇవ్వడం మానుకోండి, తిరిగి రావడం చాలా కష్టం. భాగస్వామ్య వ్యాపారంలో ఉన్నవారు నష్టపోయే ప్రమాదం పొంచి ఉంది. కొత్త పెట్టుబడులకు ఇది అస్సలు మంచి సమయం కాదు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications











