Latest Updates
-
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే! -
ఆ సమయంలోనే దంపతుల మధ్య ఎక్కువగా గొడవలు.. కారణాలేంటంటే.? -
ఈ పొడిని డైలీ అన్నం లేదా టిఫిన్లోకి తిన్నారంటే.. ఇక మందుల జోలికి వెళ్లాల్సిన పనిలేదు.! -
Teachers day recipe :ఉపాధ్యాయ దినోత్సవం స్పెషల్.. గురువుల కోసం కమ్మని పనీర్ పాయసం చేయండిలా.. -
ఉడకబెట్టాల్సిన పని లేదు.. చిక్కుడుకాయను కేటరింగ్ స్టైల్లో ఇలా చేస్తే ఫుల్గా లాగించేస్తారు.! -
తండ్రి తన ఆస్తి మొత్తం కొడుకుకి రాసిస్తే కూతురు పరిస్థితి ఏంటి? చట్టం ఏం చెబుతోంది? -
జెన్ జెడ్ తరానికి శ్రీకృష్ణుడి సందేశం.. గీత నుంచి నేటి యువత నేర్చుకోవాల్సిన కీలక పాఠాలివే.! -
కేవలం 15 నిమిషాల్లో.. పైకి కరకరలాడుతూ, లోపల సాఫ్ట్ గా ఉండే ఎగ్ పకోడి ఎలా చేసుకోవాలంటే.. -
కొత్తగా తల్లయిన వారికి అలర్ట్.. పిల్లలకు రెండేళ్ల వరకు ఇదొక్కటి అస్సలు ఇవ్వకూడదు.! -
ఉట్టికి, చిన్ని కృష్ణుడికి సంబంధమేంటి.. కృష్ణాష్టమికి ఉట్లు ఎందుకు కొడతారో తెలుసా.?
అమావాస్య రాశిఫలాలు.. అమావాస్యతో ఆ రాశులకు అరుదైన రాజయోగం.. కానీ ఈ పని చేస్తేనే!
ఈనెల 31, నవంబర్ 1, 2వ తేదీల్లో తులా రాశిలో అమావాస్య సంభవించనుంది. దీని కారణంగా పలు రాశుల వారికి అరుదైన యోగం పట్టే అవకాశం ఉంది. రవి, చంద్రుల యుతి కారణంగా ఈ అమావాస్య సంభవిస్తుంది. ఈ మూడు రోజుల పాటు కొన్ని రాశుల వారికి పట్టిందల్లా బంగారమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే ఆ రాశులు ఏంటి, ఏ రాశి వారికి అరుదైన యోగం పట్టనుందో ఇప్పుడు తెలుసుకుందాం.
ఏ రాశికి ఈ యోగం పట్టనుందంటే..
మేషం: ఈ రాశి వారికి సప్తమ స్థానంలో రవి, చంద్రుల కలయిక జరగనుంది. దీని కారణంగా మేష రాశి వారికి తప్పకుండా రాజయోగం కలగనుంది. ఈ రాజయోగం కారణంగా ఈ రాశి వారికి ఉద్యోగంలో ప్రాధాన్యత ఏర్పడనుంది. ఉద్యోగంలో పదోన్నతి లభించే అవకాశం ఉంది. సమాజంలో ప్రతిష్ట కలుగుతుంది, గౌరవం పెరుగుతుంది. ఆదాయ ప్రయత్నాలన్నీ ఊపందుకుంటాయి. ఎప్పటి నుంచో ఉండిపోయిన పనులన్నీ పూర్తవుతాయి. రాజకీయాల్లో పరిచయం లాభసాటిగా కొనసాగుతుంది.

మిథునం: ఈ రాశి వారికి పంచమ స్థానంలో ఈ అమావాస్య ఏర్పడుతుంది. దీని కారణంగా ఈ రాశి వారి సంతాన ప్రయత్నాలు విజయవంతమవుతాయి. ఆదాయం కోసం చేపట్టే ప్రతి పనీ విజయవంతమై తీరుతుంది. మీ సమర్థత, ప్రతిభకు సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుంది. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడి, అవి ఆదాయ మార్గాలుగా మారే అవకాశం ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో గణనీయమైన లాభాలను పొందుతారు. ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి.
కర్కాటకం: ఈ రాశికి అధిపతి చంద్రుడు. ఈ చంద్రుడు నాలుగో స్థానంలో రవితో యుతి చెందడం వల్ల.. చతుర్థ స్థానంలో ఈ రాశి వారికి అమావాస్య ఏర్పడుతుంది. దీని కారణంగా ఈ రాశి వారి ప్రధాన కోరికలన్నీ నెరవేరుతాయి. ఈ మూడు రోజుల పాటు ఎటువంటి నిర్ణయం తీసుకున్నా, ఎలాంటి కార్యం చేపట్టినా అన్నీ విజయవంతమవుతాయి. ప్రతీ నిర్ణయం సమాజంలో గుర్తింపు తెచ్చే విధంగా ఉంటుంది. సొంతింటి కలను నెరవేర్చుకునేందుకు ప్రయత్నాలను ప్రారంభిస్తారు.
తుల: ఈ రాశిలోనే రవి, చంద్రుల కలయిక జరగనుంది. దీని కారణంగా ఈ రాశిలోనే అమావాస్య ఏర్పడనుంది. ఈ ప్రభావంతో తుల రాశి వారికి తప్పకుండా రాజయోగం ఏర్పడనుంది. విదేశాల్లో ఉద్యోగాల కోసం ప్రయత్నించే వారికి విదేశాల్లో ఉద్యోగాలు లభించే అవకాశం ఉంది. ఉద్యోగంలో ఉన్నత స్థాయిలో పదోన్నతి లభిస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో అనుకున్న విధంగానే లాభాలను పొందుతారు. అనారోగ్య సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది.

ధనుస్సు: రవి, చంద్రులు ఈ రాశి వారికి లాభస్థానంలో కలయిక చెందనున్నారు. దీని కారణంగా ఈ రాశి వారికి రాజయోగం పట్టనుంది. ఈ మూడు రోజుల పాటు ఏ కార్యక్రమం చేపట్టినా అది విజయవంతమై తీరుతుంది. అలాగే.. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అంచనాలకు మించిన పురోగతి లభిస్తుంది. ఆకస్మికంగా ధన ప్రాప్తి కలుగుతుంది. ఉన్నత స్థాయి వ్యక్తులతో ఏర్పడే సాన్నిహిత్యం, జీవితంలో ఉన్నత స్థాయికి తీసుకెళ్లే సూచనలు కనిపిస్తున్నాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. సంపన్న కుటుంబంతో పెళ్లి కుదురుతుంది.
మకరం: ఈ రాశి వారికి దశమ స్థానంలో రవి, చంద్రులు కలయిక చెందనున్నారు. దీని కారణంగా ఈ రాశి వారికి ఉద్యోగంలో శుభపరిణామాలు చోటు చేసుకోనున్నాయి. ఉద్యోగుల వేతనాలు పెరగడంతో పాటు పదోన్నతి లభించే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు పొందడంతో పాటు మరింతగా విస్తరించే ఛాన్సుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications