Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
మీనరాశిలో విచిత్రమైన యోగాలు.. ఈ రాశుల వారికి ఆకస్మిక ధనలాభం!
ఈ నెల 21 నుండి, మీన రాశిలో ఒక అరుదైన, వింత పరిస్థితి చోటు చేసుకోనుంది. ఉచ్ఛస్థితిలో ఉన్న శుక్రుడు, నీచ స్థితిలో ఉన్న బుధుడు.. ఇద్దరూ ఒకేసారి ఈ మీనరాశిలో వక్రంగా మారిపోతున్నారు. ఇలాంటి ఘటనలు జ్యోతిష్య శాస్త్రంలో చాలా, అత్యంత అరుదుగా జరుగుతానంటాయి. ఈ అరుదైన, ప్రత్యేకమైన పరిస్థితి వచ్చేనెల అంటే ఏప్రిల్ 7వ తేదీ వరకు కొనసాగుతుంది. ఈ వక్ర, వింత ఘటన కారణంగా అన్ని రాశుల వారి జీవితాలు చాలా తీవ్రంగా ప్రభావితం అవుతాయి.
ముఖ్యంగా వాణిజ్యపరమైన ప్రక్రియల్లో వేగం పెరిగే అవకాశం ఉంటుంది. అలాగే ఆదాయం పెరిగిన కొద్దీ వ్యక్తుల ధోరణి అనేది మారుతుంది. దీంతో పాటు కొన్ని రాశుల వారికి 15 రోజుల పాటు విపరీతమైన ధనయోగం కలిగే అవకాశం ఉంటుంది. ఒక్కమాటలో చెప్పాలంటే ఈ వింత యోగం కారణంగా ఏ రాశి వారికి ఎప్పుడు ఏ విధంగా డబ్బు వస్తుందో చెప్పలేము. కానీ కొన్ని రాశుల వారికి మాత్రం కాలం చాలా అనుకూలంగా ఉంటుంది. ఆ రాశులు ఏవో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

మేషం:
ఈ రాశివారికి వక్రమైన శుక్రుడు మరియు బుధుడు వ్యయ స్థానంలో ఉండటంతో ఆదాయం పెరుగుతున్న కొద్దీ ఖర్చులు తగ్గడం ప్రారంభమవుతుంది. అవసరమైన సొమ్ము, బకాయిలు రాబట్టుకోవడం మొదలు అవుతుంది. అదనపు ఖర్చులు మరియు అనవసరమైన ఖర్చులకు కోత పడుతుంది. లాభకరమైన వ్యవహారాలు మరియు వ్యాపారాలలో శ్రద్ధ పెరుగుతుంది.
సింహం:
ఈ రాశివారికి శుక్రుడు మరియు బుధుడు వక్రంగా ఉండడం వల్ల ఆకస్మిక ధన ప్రాప్తి పొందే అవకాశాలు ఉన్నా, అవి అనూహ్యంగా లాభంగా మారవచ్చు. షేర్లు మరియు స్పెక్యులేషన్ల ద్వారా అదనపు ధనం పొందే అవకాశం ఉంటుంది. కానీ ఖర్చులు తగ్గించడం, అనవసరంగా డబ్బు ఖర్చు చేయడం మళ్ళీ ఆలోచించుకోవడం జరుగుతుంది.
కన్య:
బుధుడు మరియు శుక్రుడు వక్రంగా ఉన్నందువల్ల ఈ రాశివారికి ఆర్థిక వ్యవహారాల్లో ముందస్తు ఆలోచన పెరుగుతుంది. వృత్తి మరియు వ్యాపారాలలో జాగ్రత్తగా అడుగులు వేయడం, డబ్బును మదుపు చేయడం మరియు ఖర్చులను నియంత్రించడం జరుగుతుంది. ఇతరుల మీద ఖర్చు చేయడం తగ్గిపోతుంది. ముఖ్యంగా, బ్యాంకు బ్యాలెన్స్ పెంచుకోవడం ప్రధాన లక్ష్యంగా మారుతుంది.
తుల:
ఈ రాశి వారికి వక్రంగా ఉన్న శుక్రుడు మరియు బుధుడు ఆర్థిక సమస్యలు మరియు వ్యక్తిగత సమస్యలను పరిష్కరించుకోవడంపై దృష్టిని కేంద్రీకరించేలా చేస్తారు. ఆదాయం పెరిగే కొద్దీ ఖర్చులు తగ్గించడం జరుగుతుంది. విలాసాలు, వృథా ఖర్చులు తగ్గిపోతాయి. ఆదాయాన్ని రెట్టింపు చేయడానికి ఈ సమయంలో మరింత శ్రద్ధ పెరుగుతుంది.
ధనుస్సు:
ఈ రాశివారికి చతుర్థ స్థానంలో వక్రమైన శుక్రుడు మరియు బుధుడు అధిక ఆదాయం పెరగడానికి అలాగే అదనపు ఆదాయాన్ని ఆహ్వానించేందుకు సహాయపడతారు. అనవసర ఖర్చులు, విలాసాలు తగ్గి, నిరాడంబర జీవితానికి అలవాటు పడతారు. ఆస్తుల సంబంధి వివాదాలను పరిష్కరించడానికి సాఫీగా చర్యలు తీసుకుంటారు.
మీనం:
ఈ రాశివారికి, శుక్రుడు ఉచ్ఛ స్థితిలో ఉండటం మరియు బుధుడు నీచ స్థితిలో ఉండటం వలన జీవనశైలి మారిపోతుంది. అనేక మార్గాల్లో ఆదాయం పెరిగే అవకాశం ఉన్నా, ఖర్చులను ఆచితూచి చేయడం, ప్రతి విషయాన్ని ప్రణాళిక ప్రకారం చేయడం ముఖ్యం అవుతుంది. ముఖ్యంగా, కుటుంబ ఖర్చులు మరియు వినోదాలపై ఖర్చులు తగ్గి, మదుపు పెరుగుతుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications