Latest Updates
-
బ్రేకప్ అయినా జ్ఞాపకాలతో తీరని వేదన.. మాజీ లవర్‌ను మరిచిపోవడం ఎలా.? -
ప్రొటీన్స్, ఫైబర్ గని..మీ పొట్టను కరిగించే గ్రీన్ దోశ..ఎలా చేసుకోవాలంటే -
ఎదిగే పిల్లల కోసం చింతాకు పప్పు.. రాయలసీమ స్టైల్లో ఇలా చేస్తే వావ్ అవ్వాల్సిందే.! -
ఈ ఆయిల్‌తో మసాజ్ చేస్తే నెల రోజుల్లోనే చిక్కటి కనుబొమ్మలు మీ సొంతం.! -
ఫ్యాట్ తక్కువ, ఎనర్జీ ఎక్కువ.. గుంటూరు స్పెషల్ వంకాయ ఇగురు పప్పు.! -
ఎండలో ఫేస్ ట్యాన్ అవుతుందా?.. ఈ నాలుగు పప్పులతో మెరిసే చర్మం మీ సొంతం.! -
శని గ్రహంశాపమా, వరమా? -
ఎలాంటి సాస్‌లు లేకుండా గోబీ 65.. ఇలా చేస్తే ఇక స్ట్రీట్ ఫుడ్ జోలికే వెళ్లరు.! -
చిన్న అబద్ధాలు నమ్మకాన్ని ఎలా నెమ్మదిగా కూల్చేస్తున్నాయి -
రామ్ చరణ్ ఫేవరెట్ ఇదే..చేపల పులుసు ఇలా చేస్తే తిరుగులేని టేస్ట్!
శ్రావణ మాసంలో అఖండ రాజయోగం..ఈ 3 రాశుల వారికి సిరిసంపదల వర్షం!
జ్యోతిషశాస్త్రం ప్రకారం జూలై నెలలో ఖగోళంలో అద్భుతాలు జరుగుతాయి. గ్రహాల గమనం మన జీవితాలపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుంది. కొన్నిసార్లు అవి ఇబ్బందులను సృష్టిస్తే మరికొన్నిసార్లు అదృష్టాన్ని తీసుకొస్తాయి. ఈ శ్రావణ మాసం అలాంటి ఒక సువర్ణావకాశాన్ని తీసుకురాబోతోంది. ఇది సాధారణ సమయం కాదు సంవత్సరాల తర్వాత ఏర్పడుతున్న అరుదైన గ్రహ కూటములతో అత్యంత శక్తివంతమైనదిగా మారబోతోంది. ఈ శ్రావణ మాసంలో ఒకేసారి మూడు మహా రాజయోగాలు ఏర్పడడం విశేషం. వాటిలో మాలవ్య రాజయోగం,గజలక్ష్మీ రాజయోగం అత్యంత ప్రభావవంతమైనవి.
సౌందర్యానికి, ప్రేమకు, సంపదకు కారకుడైన శుక్రుడు తన సొంత రాశిలోకి ప్రవేశించడం వల్ల మాలవ్య రాజయోగం' ఏర్పడుతుంది. జూలై 26న దేవగురువైన బృహస్పతి..శుక్రుడితో కలవడం వల్ల గజలక్ష్మీ రాజయోగం కూడా సంభవిస్తుంది. ఈ అద్భుతమైన యోగాల కలయికతో 12 రాశులలో ముఖ్యంగా మూడు రాశుల వారి భాగ్యరేఖ ప్రకాశవంతంగా మారబోతోంది. వారి జీవితాల్లో ఊహించని విజయాలు, ఆర్థిక పురోగతి కలుగనున్నాయి. ఆ అదృష్ట రాశులేవో ఇక్కడ చూడండి.

మిథున రాశి
మిథున రాశి వారికి ఈ మాలవ్య రాజయోగం ఒక వరంలాంటిది. ఇప్పటివరకు పడిన కష్టాలు తొలగిపోయి ఆర్థికంగా అనూహ్యమైన ప్రవాహం మొదలవుతుంది. మీరు ఊహించని మార్గాల నుండి ధనం వచ్చి చేరడంతోః మీ ఆర్థిక స్థితి బలంగా మారుతుంది. వృత్తి జీవితంలో మీరు విజయ శిఖరాలను అధిరోహిస్తారు. మీ ప్రతిభకు సరైన గుర్తింపు లభించి పై అధికారుల నుండి ప్రశంసలు, సహోద్యోగుల నుండి సంపూర్ణ సహకారం అందుతుంది. కుటుంబంలో ఆనందం వెల్లివిరుస్తుంది. ఇంట్లో శుభకార్యాలు జరిగే సూచనలు బలంగా ఉన్నాయి. విదేశాలలో ఉద్యోగం లేదా వ్యాపారం చేయాలనే మీ కలలు నెరవేరే అవకాశాలు దగ్గరవుతాయి. మీ ప్రతి కోరిక నెరవేరే అదృష్ట యోగం మీకు పట్టబోతోంది.
కర్కాటక రాశి
కర్కాటక రాశి వారికి ఈ రాజయోగం అక్షయపాత్రలా పనిచేయనుంది. ముఖ్యంగా ఆర్థిక విషయాలలో ఇది మీకు స్వర్ణయుగం. సంపద అనేక రెట్లు పెరిగి మీరు కోరుకున్న వస్తువులను, సౌకర్యాలను సమకూర్చుకోగలుగుతారు. చేపట్టిన ప్రతి పనిలో విజయం మీదే అవుతుంది. మీ ఆలోచనా విధానం పదునెక్కి సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకుంటారు. ఇది మీ జీవితంలో శాంతిని, సంతోషాన్ని నింపుతుంది. సమాజంలో మీ గౌరవం, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మీరు ఏది సాధించాలని బలంగా కోరుకుంటారో దైవానుగ్రహం వల్ల అది మీ సొంతమవుతుంది. భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకునే అద్భుతమైన సమయం ఇది.
ధనుస్సు రాశి
ధనుస్సు రాశి వారికి ఇది ఒక పరివర్తన కాలం. మాలవ్య రాజయోగం మీ జీవితంలోని అడ్డంకులన్నింటినీ తొలగించి విజయ మార్గాన్ని సుగమం చేస్తుంది. శుక్రుడి శుభ ప్రభావంతో మీ జీవితం కొత్త వెలుగులతో నిండిపోతుంది. వృత్తిలో అద్భుతమైన అవకాశాలు తలుపు తడతాయి. మీ కృషికి రెట్టింపు ఫలితాలు పొంది, కెరీర్‌లో సాధించే విజయాలు మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తాయి. ఉన్నతాధికారుల మద్దతు మీకు కొండంత అండగా నిలుస్తుంది. వివాహం కోసం ఎదురుచూస్తున్న వారికి శుభవార్త అందుతుంది. ప్రేమలో ఉన్నవారికి సంబంధాలు మరింత బలపడి అనుకూలమైన మార్పులు చోటుచేసుకుంటాయి. ఆర్థికంగా స్థిరపడటమే కాకుండా నూతన విషయాలపై ఆసక్తి పెరిగి, మీలోని సృజనాత్మకత బయటకు వస్తుంది.
మాలవ్య రాజయోగం అంటే ఏమిటి?
ఒక వ్యక్తి జాతకంలో శుక్ర గ్రహం వల్ల ఏర్పడే పంచ మహాపురుష యోగాలలో మాలవ్య రాజయోగం ఒకటి. ఈ యోగం పడితే ఆ వ్యక్తి జీవితం రాజభోగాలతో తులతూగుతుంది. శుక్రుడు సంపద, విలాసం, ప్రేమ, కళలు, ఆనందానికి అధిపతి. కాబట్టి ఈ యోగం ఉన్నవారికి అపారమైన సంపద, అందమైన జీవిత భాగస్వామి, సంతోషకరమైన వైవాహిక జీవితం, కళారంగాలలో అఖండ విజయం, సమాజంలో ప్రత్యేక గుర్తింపు లభిస్తాయి. వారిలో ఆకర్షణీయమైన వ్యక్తిత్వం అలవడుతుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications