Latest Updates
-
ప్రోటీన్లు, ఫైబర్ పుష్కలం.. ఉదయాన్నే తినాల్సిన హెల్తీ మల్టీగ్రెయిన్ దోస ఇదే! -
చికెన్, మటన్ కాదు.. ఎప్పుడైనా కమ్మటి మునగకాయ బిర్యానీ ట్రై చేశారా? -
మనిషికి పంది కిడ్నీ.. ఏకంగా 271 రోజులు.. వైద్య చరిత్రలో మహాద్భుతం! -
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి! -
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.!
Smiley face in sky: ఆకాశంలో అద్భుతం..నవ్వుతున్న ముఖంలా త్రిగ్రహ కూటమి..ఆ ప్లేస్ లలో సృష్టంగా చూడొచ్చు!
ఆకాశంలో అరుదైన అద్భుతం జరగబోతుంది. ఈ శుక్రవారం అంటే ఏప్రిల్ 25వ తేదీన అరుదైన త్రిగ్రహ కూటమి ఆకాశంలో నవ్వుతున్న ముఖంలా దర్శనమివ్వనుంది. శుక్రుడు, నెలవంక చంద్రుడు, శని గ్రహాలు ఒక ప్రత్యేకమైన అమరికలో చేరి ఆకాశంలో.. చిరునవ్వును పోలిన ఆకారాన్ని సృష్టించనున్నారు. ఇందులో రెండు గ్రహాలు కళ్లుగా..నెలవంక చంద్రుడు నోరుగా కనిపిస్తారు. కొద్దిసేపు మాత్రమే ఇది కనబడుతుంది.
శుక్రవారం సూర్యోదయానికి ఒక గంట ముందు తూర్పు దిక్కున సృష్టంగా కనిపించే ఈ అద్భుత దృశ్యాన్ని ప్రపంచంలో ఎక్కడినుంచైనా చూడొచ్చని ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. శుక్రుడు, శని ప్రకాశవంతంగా మెరుస్తాయి..వాటిని నేరుగా మన కళ్లతోనే చూడవచ్చు..అయితే మంచి టెలిస్కోప్ లేదా బైనాక్యులర్స్ చిరునవ్వు నవ్వుతున్న నెలవంక చంద్రుడిని చూడటానికి సహాయపడాయి. సృష్టమైన విజన్ ఉన్నోళ్లకి ఈ మూడు ప్రకాశవంతమైన గ్రహాల క్రింద బుధుడు కూడా కనిపించవచ్చు.

అక్కడే బెటర్ గా చూడొచ్చు
నగరాల్లో పొల్యూషన్ తళుకుబెళుకుల్లో ఈ అద్భుతం కాస్త మసకబారొచ్చు. అందుకే ప్రకృతి ఒడిలో.. ప్రశాంతమైన గ్రామాల్లోనో, ఎత్తైన కొండల మీద లేదా నగర కాంతి దూరంగా ఉండే ప్రదేశాల్లో ఉంటే ఈ విశ్వ వింతను మరింత స్పష్టంగా చూడొచ్చని సైంటిస్టులు చెబుతున్నారు. తెల్లవారుజామున సరిగ్గా 4:30 నుండి 5:30 గంటల మధ్య తూర్పు దిక్కున మీ చూపు నిలపండి.. ఆ నవ్వుతున్న ముఖం మీ కనుల ముందు సాక్షాత్కరిస్తుందని తెలిపారు. ఈ అద్భుతమైన దృశ్యాన్ని అస్సలు మిస్ అవొద్దని సైంటిస్టులు చెబుతున్నారు.
ఏపీ,తెలంగాణలో ఆ ప్లేస్ లకు వెళ్తే బెటర్
ఈ అరుదైన ఖగోళ సంఘటనను వీక్షించడానికి ఏపీ,తెలంగాణల్లో కొన్ని అనువైన ప్లేస్ లను అధికారులు సూచించారు. హైదరాబాద్ లో నెక్లెస్ రోడ్, గండిపేట లేక్, షామీర్ పేట, పాకాల సరస్సు, వరంగల్ లోని భద్రకాళి ఆలయం చుట్టూ ఉన్న ప్లేస్ లు అరుదైన ఖగోళ సంఘటనను వీక్షించడానికి అనువైన ప్లేస్ లుగా ఉండగా..ఏపీలో ప్రకాశం బ్యారేజీ, భవానీ ఐలాండ్, వైజాగ్ ఆర్ కే బీచ్, డాల్ఫిన్ నోస్ వ్యూ పాయింట్, తిరుపతి దగ్గర్లోని చంద్రగిరి కోట పరిసరాల నుంచి బాగా చూడొచ్చు.
వాళ్లకు ఇది మంచి ఛాన్స్
ఖగోళాన్ని తమ కెమెరాలో బంధించాలనుకునేవాళ్లకి ఇదొక అపురూపమైన ఛాన్స్. శుక్రవారం ఉదయం మీ కెమెరాతో ఈ ఫొటో తీస్తే మీ గ్యాలరీలో ఒక అరుదైన ఖగోళ చిత్రం శాశ్వతంగా నిలిచిపోతుంది. ఆ ఫొటో సోషల్ మీడియాలో పెడితే ఖగోళ అద్భుతాన్ని ప్రపంచానికి చూపెట్టినోళ్లు అవుతారు..అదేవిధంగా ఆ ఫొటో వైరల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది.,.తద్వారా మీ ఫొటోగ్రఫీ స్కిల్స్ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందే అవకాశం ఉంటుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications
