Latest Updates
-
కండరాలకు బలాన్నిచ్చే నేచురల్ ప్రోటీన్ పౌడర్..ఇంట్లోనే చేసుకోండిలా.. -
పితృ దోషం వల్లే జీవితంలో సమస్యలొస్తున్నాయా? పూర్వీకుల ఆత్మల గురించి శాస్త్రాలు చెప్పే రహస్యాలు ఇవే! -
2026 అంతర్జాతీయ యోగా దినోత్సవ ప్రత్యేకత ఇదే! -
ప్రేమలో అనుబంధం ఎప్పుడు మానసిక భారంగా మారుతుంది -
మైదా లేదు, భయం లేదు.. ఇంట్లోనే సులభంగా హెల్దీ బ్రెడ్-రవ్వ పిజ్జా.. -
మీ మొబైల్ ఫోన్లో ఈ వాల్ పేపర్ ఉంటే.. రోజూ అదృష్టం మీ వెంటే.! -
కలలో బొద్దింకలు కనిపిస్తే.. మీ జీవితంలో ఏం జరుగుతుందో తెలుసా.? -
జేబులో రూ.200 ఉంటే చాలు.. హైదరాబాద్ లో మీ ఫ్రెండ్స్ తో గడిపే సూపర్ ప్లాన్స్ ఇవే! -
చేసిన పనికి గుర్తింపు లేకపోతే ప్రేమ ఎలా తగ్గిపోతుంది -
బరువు తగ్గాలనుకునే వారు మామిడి పండ్లు తినొచ్చా? ఫిట్నెస్ నిపుణులు ఏమంటున్నారంటే!
చంద్రగ్రహణం రోజు అరుదైన యోగం.. ఈ 3 రాశుల వారు నెల రోజులు పట్టిందల్లా బంగారమే!
జ్యోతిషశాస్త్రంలో ఎన్నో యోగాలు, ఎన్నో సంయోగాలు జరుగుతుంటాయి. గ్రహాల కలయికలు, గ్రహాల రాశి మార్పులు కూడా జరుగుతుంటాయి. ఇవన్నీ జ్యోతిష్య శాస్త్రంలో చాలా ముఖ్యమైనది. అన్నిటికంటే ముఖ్యంగా జ్యోతిష్య శాస్త్రం చంద్రగ్రహణాన్ని ప్రత్యేకమైన, కీలకమైన సంఘటనగా పరిగణిస్తారు. అయితే అంతటి ప్రాముఖ్యత కలిగిన చంద్రగ్రహణం ఈ సంవత్సరం తొలిసారిగా ఈ సంవత్సరం వస్తున్న ఈ తొలి చంద్రగ్రహణం ఎంతో విశిష్టమైనది, ఎందుకంటే ఫాల్గుణ మాసం పౌర్ణమి తిథి రోజున, హోలీ పండగ సమయంలో ఈ చంద్రగ్రహణం ఏర్పడుతుంది. దీంతో పాటు ఒక అరుదైన యాదృచ్చికం కూడా ఏర్పడనుంది.
శశ రాజయోగం
జ్యోతిషశాస్త్ర ప్రకారం, ఈ చంద్రగ్రహణం రోజున శనీశ్వరుడు ఒక ముఖ్యమైన రాజయోగాన్ని ఏర్పరచబోతున్నాడు. ఈ యోగాన్ని "శశ రాజయోగం" అంటారు. శనీశ్వరుడు తన సొంత రాశి అయిన కుంభ రాశిలో ఉండగా, మార్చి 14న ఈ శశ రాజయోగం ఏర్పడుతుంది. ఈ శశ రాజయోగం వల్ల కొన్ని రాశులకు ఆర్థిక, వ్యక్తిగత ప్రయోజనాలు చేకూరనున్నాయి. శనీశ్వరుడి ఆశీస్సులతో వారి బలహీనతలు తగ్గిపోతాయి. అటువంటి రాశుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

మేష రాశి
మేష రాశి జ్యోతిష్యశాస్త్రంలో మొదటి రాశిగా పరిగణించబడుతుంది. అలాంటి మొట్టమొదటి రాశి అయిన మేష రాశి వారికి శశ రాజయోగం ప్రభావం వల్ల అనేక లాభాలు జరగనున్నాయి. మేష రాశి వారు ఆర్థిక లాభాలు పొందగలుగుతారు. వ్యాపారంలో కూడా గొప్ప లాభాలను సాధించవచ్చు. అనుకున్న కార్యక్రమాలన్నీ పూర్తవుతాయి. ఈ నెలలో ఈ రాశికి చెందిన వారి పనులన్నీ విజయవంతంగా పూర్తవుతాయి. ఉద్యోగస్తులకు ప్రత్యేక ప్రయోజనాలు లభించవచ్చు. కుటుంబంలో సంతోషం నెలకొనే అవకాశం ఉంటుంది.
మిథున రాశి
మిథున రాశి వారికి ఈ శశ రాజయోగం ఫలితంగా అన్ని సమస్యలు పరిష్కారం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. సమస్యలు పరిష్కారం కావడంతో పాటు చేపట్టబోయే పనులన్నీ పూర్తవుతాయి. అలాగే దీని కారణంగా వారి ఆదాయం పెరిగే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారంలో పురోగతి, ఆదాయ వనరులు పెరగడం అనేక ప్రయోజనాలను తెచ్చిపెడుతుంది. వైవాహిక జీవితం కూడా సంతోషంగా ఉంటుంది. కుటుంబ బాధ్యతలు తీరుతాయి. కుటుంబ సభ్యుల మద్దతుతో పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు.
కుంభ రాశి
కుంభ రాశి వారు కూడా ఈ శశ రాజయోగం వల్ల ఆర్థిక ప్రయోజనాలు పొందగలుగుతారు. శని దేవుడి ఆశీస్సులతో వారికి ఉద్యోగంలో పురోగతి, కొత్త అవకాశాలు వచ్చేస్తాయి. వ్యాపారం మెరుగ్గా సాగవచ్చు, ఆర్థిక పరిస్థితులు కూడా బాగా నిలబడతాయి. చేతుల నిండా డబ్బులు తిరుగుతాయి. డబ్బు లోటు లేకుండా జీవించగలుగుతారు. కుటుంబ సభ్యుల అండ కూడా ఉంటుంది. అలాగే సమాజంలో గుర్తింపు లభిస్తుంది. ఈ విధంగా, చంద్రగ్రహణం రోజు ఏర్పడే శశ రాజయోగం వల్ల కొన్ని రాశులకు గొప్ప ప్రయోజనాలు లభించబోతున్నాయి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications