Latest Updates
-
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే! -
ఆ సమయంలోనే దంపతుల మధ్య ఎక్కువగా గొడవలు.. కారణాలేంటంటే.? -
ఈ పొడిని డైలీ అన్నం లేదా టిఫిన్లోకి తిన్నారంటే.. ఇక మందుల జోలికి వెళ్లాల్సిన పనిలేదు.! -
Teachers day recipe :ఉపాధ్యాయ దినోత్సవం స్పెషల్.. గురువుల కోసం కమ్మని పనీర్ పాయసం చేయండిలా.. -
ఉడకబెట్టాల్సిన పని లేదు.. చిక్కుడుకాయను కేటరింగ్ స్టైల్లో ఇలా చేస్తే ఫుల్గా లాగించేస్తారు.! -
తండ్రి తన ఆస్తి మొత్తం కొడుకుకి రాసిస్తే కూతురు పరిస్థితి ఏంటి? చట్టం ఏం చెబుతోంది? -
జెన్ జెడ్ తరానికి శ్రీకృష్ణుడి సందేశం.. గీత నుంచి నేటి యువత నేర్చుకోవాల్సిన కీలక పాఠాలివే.! -
కేవలం 15 నిమిషాల్లో.. పైకి కరకరలాడుతూ, లోపల సాఫ్ట్ గా ఉండే ఎగ్ పకోడి ఎలా చేసుకోవాలంటే.. -
కొత్తగా తల్లయిన వారికి అలర్ట్.. పిల్లలకు రెండేళ్ల వరకు ఇదొక్కటి అస్సలు ఇవ్వకూడదు.! -
ఉట్టికి, చిన్ని కృష్ణుడికి సంబంధమేంటి.. కృష్ణాష్టమికి ఉట్లు ఎందుకు కొడతారో తెలుసా.?
నీచ స్థితిలో రవి, ఆ రాశుల వారికి రాజయోగం.. అదృష్టం దక్కాలంటే ఆ పూజ చేయాలి!
దీపావళి ఏ ముహూర్తాన వస్తుందో కానీ కొన్ని రాశుల వారికి అన్ని విధాలుగా కలిసి వస్తుంది. గ్రహాలు సైతం ఆ రాశుల వారికి అనుకూలంగా మారుతున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం తులారాశిలో నీచ స్థితిలో ఉన్న రవి.. త్వరలోనే ఆ స్థితిని భంగం చేసి పలు రాశుల వారికి రాజయోగం ఇవ్వనున్నాడు. దీని కారణంగా ఈనెల 29వ తేదీ నుంచి నవంబర్ 17వ తేదీ వరకు ఏ పని చేసినా విజయవంతం అవుతుంది. అయితే ఆ రాశులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
మేషం: ఈ రాశి వారికి రవి సప్తమ స్థానంలో సంచరిస్తున్నాడు. అయితే రవి నీచభంగం చెందడం వల్ల ఈ రాశుల వారికి ప్రభుత్వ పరమైన దానం లేదా ఆస్తి లాభం చేకూరనుంది. ప్రభుత్వం తరఫున కొన్ని బహుమతులు లభించే అవకాశం కూడా కనిపిస్తోంది. ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న వారికి ఉద్యోగం లభించనుంది. వృత్తి, ఉద్యోగాల రీత్యా విదేశాలకు సైతం వెళ్లే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

కర్కాటకం: ఈ రాశికి రవి ధనాధిపతి. ఈ రాశి వారు రవి గ్రహానికి పూజ చేస్తే చాలా మంచిది. అలాంటి రవి ఈ రాశివారికి చతుర్థ స్థానంలో నీచభంగం అవుతున్నాడు. దీని కారణంగా ఈ రాశి వారికి ఎప్పటి నుంచో ఉన్న ఆస్తి సమస్యలు, వివాదాలు పరిష్కారమవుతాయి. అవి కూడా వారికి అనుకూలమైన తీర్పు రానుంది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు ఫలితాయి. అనుకున్న కార్యక్రమాలన్నీ విజయవంతంగా పూర్తవుతాయి. ఆస్తుల విలువ రెండింతలు పైగా పెరగనున్నాయి. అలాగే సొంతింటి కల సాకారమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.
తుల: రవి ఈ రాశిలోనే ప్రస్తుతం నీచ స్థితిలో ఉన్నారు. అయితే రవి నీచభంగం చెందడం వల్ల తులా రాశివారికి కీర్తి ప్రతిష్టలు రానున్నాయి. అలాగే సమాజంలో వీరిపై గౌరవం పెరగనుంది. దీంతోపాటు ప్రముఖులతో పరిచయాలు ఏర్పడి, అవి లాభదాయకంగా మారనున్నాయి. ఆకస్మికంగా ధనలబ్ధి పొందనున్నారు. వృత్తి, వ్యాపారాల్లో అంచనాలకు మించి రాణిస్తారు.
ధనుస్సు: ఈ రాశి వారికి రవి లాభస్థానంలో నీచభంగం చెందనున్నారు. దీని కారణంగా ధనుస్సు రాశి వారికి అన్ని వైపుల నుంచి ఆదాయ మార్గాలు పెరగనున్నాయి. ఆకస్మికంగా ధనలాభం పొందనున్నారు. ఈ రాశివారు పట్టిందల్లా బంగారమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. తండ్రికి చెందిన స్థిర, చరాస్తులు కలిసొచ్చే అవకాశం ఉంది. దీర్ఘకాలికంగా బాధ పడుతున్న కొన్ని ఆరోగ్య సమస్యల నుంచి విముక్తిపొందుతారు.
మకరం: ఈ రాశి వారికి దశమ స్థానంలో రవి సంచరిస్తున్నాడు. ఆ స్థానంలోనే నీచభంగం అవడం వల్ల.. ఈ రాశివారికి దిగ్బల యోగం పట్టనుంది. దీని కారణంగా ఉద్యోగాల్లో, రాజకీయాల్లో పదోన్నతులు లభించనున్నాయి. పై స్థాయి అధికారులతో పరిచయం ఏర్పడి, ఆ పరిచయం మంచి లాభసాటిగా మారనుంది. వ్యాపారాల్లో అనూహ్యంగా లాభాలు వస్తాయి. ఉద్యోగ రంగాల్లో ఉన్న వారికి డిమాండ్ ఏర్పడుతుంది. అలాగే ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న వారి ప్రయత్నాలు కూడా ఫలించనున్నాయి.
కుంభం: ఈ రాశి వారికి రవి సప్తమాధిపతి. అయితే రవి భాగ్య స్థానంలో నీచభంగం చెందడం వల్ల.. అనూహ్యంగా పెళ్లి సంబంధాలు కుదిరే అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారాలూ కూడా చక్కదిద్దే ఛాన్సుంది. విదేశాలకు వెళ్లేందుకు ఎలాంటి అడ్డంకులు, సమస్యలు ఉండకుండా.. అన్ని విధాలుగా కలిసి వస్తుంది. తీర్థ యాత్రలకు వెళ్లే సూచనలు కనిపిస్తున్నాయి. కుటుంబంలో మంచి వాతావరణం నెలకొంటుంది.
గమనిక: ఈ కథనంలో మేము పొందుపరిచిన అంశాలు.. జోతిష్య శాస్త్రం, జోతిష్య నిపుణులు అందించిన సమాచారం మేరకు ఇవ్వబడింది. ఇవి కచ్చితమైనవని మేము నిర్ధారించడం లేదు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications