Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
మీ దరిద్రం మొత్తం పోవాలంటే ఇంట్లోని అవి పడేయండి..లక్ష్మీదేవి పరిగెత్తుకొస్తుంది
కొత్త ఏడాదికి వెల్కమ్ చెప్పేందుకు అందరూ సిద్దంగా ఉన్నారు. కొత్త ఏడాదిలో అంతా మంచే జరగాలని,గడిచిన ఏడాదిలో ఎదుర్కొన్న ఇబ్బందులు కొత్త ఏడాదిలో ఉండకూడదని కోరుతూ 2025లో అడుగుపెట్టేందుకు అందరూ రెడీ అయ్యారు. అయితే కొత్త ఏడాదిలో మీ కష్టాలన్నీ తొలగిపోవాలంటే,మీ ఇంట్లో ఉన్న దరిద్రమంతా పోవాలంటే వాస్తు ప్రకారం కొన్ని చర్యలు చేపట్టాలి. వాస్తు శాస్త్రం మన జీవితంలోని వివిధ సమస్యలకు సరైన పరిష్కారాన్ని సూచిస్తుంది.
మన జీవితం ఆనందం,శ్రేయస్సుతో నిండి ఉండాలంటే లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలి. కొత్త ఏడాదిలో లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే వాస్తు శాస్త్రం ప్రకారం మీరు కొత్త సంవత్సరానికి ముందు మీ ఇంటి నుండి కొన్ని వస్తువులను తీసివేయాలి. ఈ వస్తువులను ఇంట్లో ఉంచడం శ్రేయస్కరం కాదు. అంతేకాదు ఈ వస్తువులు ఇంట్లో ఉండటం వల్ల కొన్నిసార్లు లక్ష్మీదేవి మీ ఇంట్లో ఉండదు. అయితే ఏ వస్తువులను ఇంట్లో నుంచి తీసేయాలో ఇప్పుడు చూద్దాం.

న్యూ ఇయర్ కి ముందే ఇవి ఇంటి నుంచి తీసేయండి
విరిగిన ఫర్నిచర్, చిరిగిన బూట్లు
వాస్తు శాస్త్రం ప్రకారం మీరు మీ ఇంట్లో ఎప్పుడూ విరిగిన ఫర్నిచర్ లేదా పాత చిరిగిన బూట్లు ఉంచకూడదు. మీ ఇంట్లో ఈ వస్తువులు ఉంచితే దరిద్రం వచ్చే అవకాశాలు పెరుగుతాయి. కాబట్టి కొత్త ఏడాదికి ముందే వీటిని తొలగించండి.
పగిలిన గిన్నెలు, అద్దాలు
మీ ఇంట్లో పగిలిన పాత్రలు లేదా గాజుసామాను ఉన్నట్లయితే మీరు వాటిని కొత్త సంవత్సరానికి ముందు మీ ఇంటి నుండి విసిరేయాలి. ఈ వస్తువులు మీ ఇంట్లో ఉంటే ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ వ్యాపించే ప్రమాదం ఉంది. దీని నుండి ఇంట్లో అనవసరమైన గొడవలు వస్తాయి.
విరిగిన విగ్రహం
మీ ఇంటి గుడిలో ఏదైనా విరిగిన లేదా ఛిన్నాభిన్నమైన విగ్రహం ఉంటే కొత్త సంవత్సరానికి ముందు దానిని తొలగించాలని వాస్తు నిపుణులు అంటున్నారు. ఇవి ఇంట్లో ఉంటే లక్ష్మీ దేవికి కోపం వస్తుందని..దీంతో లక్ష్మీదేవి మీ ఇంటికి రాదని తెలిపారు. కాబట్టి వీటి విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు.
ముళ్ల మొక్కలు
మీ ఇంట్లో ముళ్ల మొక్కలు ఉంటే కొత్త సంవత్సరానికి ముందు వాటిని మీ ఇంటి నుండి తొలగించండి. అలాంటి మొక్కలను ఇంట్లో ఉంచడం శ్రేయస్కరం కాదు. కాబట్టి ఈరోజే వాటిని తొలగించడం మంచిదని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications