Latest Updates
-
ప్రొటీన్స్, ఫైబర్ గని..మీ పొట్టను కరిగించే గ్రీన్ దోశ..ఎలా చేసుకోవాలంటే -
ఎదిగే పిల్లల కోసం చింతాకు పప్పు.. రాయలసీమ స్టైల్లో ఇలా చేస్తే వావ్ అవ్వాల్సిందే.! -
ఈ ఆయిల్‌తో మసాజ్ చేస్తే నెల రోజుల్లోనే చిక్కటి కనుబొమ్మలు మీ సొంతం.! -
ఫ్యాట్ తక్కువ, ఎనర్జీ ఎక్కువ.. గుంటూరు స్పెషల్ వంకాయ ఇగురు పప్పు.! -
ఎండలో ఫేస్ ట్యాన్ అవుతుందా?.. ఈ నాలుగు పప్పులతో మెరిసే చర్మం మీ సొంతం.! -
శని గ్రహంశాపమా, వరమా? -
ఎలాంటి సాస్‌లు లేకుండా గోబీ 65.. ఇలా చేస్తే ఇక స్ట్రీట్ ఫుడ్ జోలికే వెళ్లరు.! -
చిన్న అబద్ధాలు నమ్మకాన్ని ఎలా నెమ్మదిగా కూల్చేస్తున్నాయి -
రామ్ చరణ్ ఫేవరెట్ ఇదే..చేపల పులుసు ఇలా చేస్తే తిరుగులేని టేస్ట్! -
ఉదయం 5 గంటలకు నిద్రలేస్తేనే సక్సెస్ వస్తుందా?.. ప్రముఖ న్యూరోసైంటిస్ట్ చెబుతున్న సంచలన నిజాలివే!
నవపంచం రాజయోగం..శని,బుధ ఆశీర్వాదంతో ఈ 3 రాశుల వారికి స్వర్ణయుగం ప్రారంభం!
గ్రహాల కదలికలు లేదా సంచారం, కలయిక మనుషుల జీవితాలపై గరప్రభావం చూపుతుందని జ్యోతిష్యశాస్త్రం చెబుతుంది. గ్రహాల కలయిక కొన్నిసార్లు అనూహ్యమైన శుభ ఫలితాలను అందించి, జీవిత గమనాన్ని మార్చేస్తుంది. అలాంటి ఒక అద్భుతమైన, అరుదైన ఖగోళ సంఘటన అక్టోబర్ 26,2025 రాబోతుంది. జ్ఞానం, వాణిజ్యానికి కారకుడైన బుధుడు..న్యాయం, కర్మ ఫలదాత అయిన శని ఒకరికొకరు 120 డిగ్రీల కోణంలో సంచరించబోతున్నారు. ఈ శుభ వీక్షణ కారణంగా అత్యంత శక్తివంతమైన నవపంచం రాజయోగం ఏర్పడనుంది.
బుధ-శని కలయికతో ఏర్పడుతున్న నవపంచం రాజయోగం అక్టోబర్ 26వ తేదీ మధ్యాహ్నం 2:44 గంటలకు స్టార్ట్ అవుతుంది. నవపంచం రాజయోగం కొన్ని రాశుల వారికి అసాధారణమైన శుభ ఫలితాలను అందించబోతోంది. వారి జీవితాల్లో కష్టాలు తొలగిపోయి, ఒక కొత్త, ఉజ్వలమైన అధ్యాయం ప్రారంభం కానుంది. ఆ అదృష్ట రాశులు ఏవో ఇక్కడ చూడండి.

మిథున రాశి
మిథున రాశి వారికి ఈ నవపంచం రాజయోగం ఒక వరంలాంటిది. మీ రాశ్యాధిపతి అయిన బుధుడే ఈ యోగంలో కీలక పాత్ర పోషిస్తుండటంతో మీకు ఊహించని రీతిలో అదృష్టం కలిసిరానుంది. చాలా కాలం నుంచి ఎదుర్కొంటున్న డబ్బు కష్టాలు తొలగిపోతాయి. కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడతాయి. వ్యాపారస్తులు మంచి పురోగతి సాధిస్తారు. వ్యాపార విస్తరణకు సంబంధించి తీసుకునే సాహసోపేతమైన నిర్ణయాలు భారీ లాభాలను తెచ్చిపెడతాయి. జీవిత భాగస్వామితో సంబంధాలు మరింత బలపడతాయి. సొంత ఇల్లు, వాహనం కొనుగోలు చేయాలనే కల నెరవేరే అవకాశాలు ఉన్నాయి.
మకర రాశి
మకర రాశి వారికి నవపంచం రాజయోగం అఖండమైన లాభాలను తీసుకురాబోతోంది. మీ రాశ్యాధిపతి అయిన శని దేవుడు బుధుడితో కలిసి ఈ యోగాన్ని సృష్టిస్తుండటంతో మీ కష్టానికి తగిన ప్రతిఫలం దక్కే సమయం ఆసన్నమైంది. గత పెట్టుబడుల నుండి ఇప్పుడు అనూహ్యమైన లాభాలు అందుకుంటారు. జీవితంలోని వివిధ రకాల సమస్యల నుండి విముక్తి లభించి, మానసిక ప్రశాంతత చేకూరుతుంది. అడుగుపెట్టిన ప్రతి రంగంలోనూ విజయం మీదే అవుతుంది. ఉద్యోగంలో ప్రమోషన్స్, బిజినెస్ లో అద్భుతమైన పురోగతి కనిపిస్తుంది. సొసైటీలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి.
కుంభ రాశి
కుంభ రాశి వారికి నవపంచం రాజయోగం అత్యంత శుభప్రదంగా ఉండబోతోంది. మీ రాశ్యాధిపతి అయిన శని భగవానుడి అనుగ్రహంతో మీ జీవితంలో ఒక సరికొత్త శకం ప్రారంభం కానుంది. మీ ఆలోచనా విధానంలో, దృక్పథంలో విప్లవాత్మక మార్పులు వస్తాయి. ఈ మార్పు మీ కెరీర్ ను ఉన్నత శిఖరాలకు చేర్చుతుంది. వృత్తి, వ్యాపారాలలో మీరు అద్భుతమైన ఫలితాలను సాధిస్తారు. మీ క్రియేటివిటీ, ఆలోచనలకు సరైన గుర్తింపు లభిస్తుంది. ధన సంపాదనలో ఎదురవుతున్న ఆటంకాలు తొలగిపోయి, ఆర్థికంగా స్థిరమైన, బలమైన పునాది ఏర్పడుతుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications