Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
ఒకే రాశిలో శుక్రుడు, శని.. ఈ 3 రాశుల వారికి తమ జీవితంలోనే మంచి రోజులు ఇవే!
గ్రహాల పరంగా శని, శుక్రుడు రెండు గ్రహాలు చాలా ముఖ్యమైనవి. ఈ రెండు గ్రహాలు మంచి, శుభ కార్యాలకు ప్రతీకగా పని చేస్తాయి. జోతిష్య శాస్త్రం ప్రకారం.. శనీశ్వరుడు ఒకరి పనులకు ప్రత్యేకమైన ప్రతిఫలాలను అందజేస్తాడు. ఒకరి సంపద పెరుగుదలకు కారణమవుతాడు. అలాగే పరిస్థితులు తల కిందులు కావడానికి కారణమవుతాడు. అదేవిధంగా శుక్రుడు అందం, విలాసం, సంపద, ప్రేమ మరియు అదృష్టానికి సంకేతం. శుక్రుడు సంచరించే రాశికి ప్రయోజనకరమైన రోజులు ఖచ్చితంగా ఉంటాయి.
అలాగే శని కూడా మంచి రోజులను ప్రసాదించగలడు. రెండు గ్రహాలు ఒకే రాశిలో ఉన్నా చాలా మంది రాశులకు మేలు జరుగుతుంది. ఈ రెండు గ్రహాలు ఒకే ఇంట్లో సంచరించడం వల్ల అర్థ కేంద్ర యోగం ఏర్పడుతుంది. ఈ యోగాను శుభప్రదంగా భావిస్తారు. ఈ యోగం అనేక రాశుల వారికి మేలు చేస్తుంది. ఈ యోగం కారణంగా ఏ రాశి వారికి మేలు జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.

మేషరాశి
మేషం రాశి వారికి 10వ స్థానంలో శుక్రుడు 11వ స్థానంలో శని సంచరిస్తున్నారు. దీని కారణంగా ఈ రాశి ఆరికి అర్థ యోగం ఏర్పడుతుంది. ఈ యోగం వీరికి గరిష్ట లాభాలను అందజేస్తుంది. ఈ రాశి వారు అన్ని రంగాలలో విజయాన్ని చూస్తారు. ఈ రాశి వారు అనుకున్నదానికంటే ఎక్కువ డబ్బును సంపాదిస్తారు. అదృష్టం మీ తలుపు తడుతూనే ఉంటుంది. పాత అప్పులు తొలిగిపోయి ఆర్థికంగా బలపడతారు. వ్యాపారస్తులు గరిష్ట లాభాలను పొందుతారు. అలాగే ఆదాయ మార్గాలు పెరుగుతాయి.
కన్య రాశి
కన్యారాశిలో శుక్రుడు 5వ స్థానంలో, శని 6వ స్థానంలో ఉండడం వల్ల ఈ రాశి వారికి చాలా రోజులు ఉండనుంది. ఎప్పటి నుంచి నెరవేరకుండా ఉండిపోయిన కోరికలు నెరవేరుతాయి. ఉద్యోగార్థులు ఆశించిన లాభాలు పొందుతారు. ఈ రాశికి చెందిన ఆర్థిక డిమాండ్లు నెరవేరుతాయి. కొత్త వస్తువులను కొనుగోలు చేయాలనే మీ ఆలోచనలు ఈ సమయంలో నిజమవుతాయి. మీ బంధువులు అనుకోకుండా కలిస్తే ఒక శుభవార్త చెప్తారు. కుటుంబంలో శాంతి నెలకొంటుంది. ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.
మకరరాశి
ఈ రాశిలో శుక్రుడు 1వ స్థానంలో, శని 2వ స్థానంలో సంచరిస్తున్నారు. దేని కారణంగా ఈ రాశి వారు కొన్ని రోజులుగా అనుకుంటున్న పనులన్నీ పూర్తవుతాయి. అలాగే ఈ రెండు గ్రహాల సంచారం కారణంగా ఈ రాశి వారు కొన్ని రోజులు ప్రయాణం చేయవలసి వస్తుంది. ఈ ప్రయాణాలు, పర్యటనలు మీకు బాగా కలిసి వస్తాయి. అలాగే ఈ రాశి వారికి చాలా లాభదాయకంగా మారతాయి. ఉపాధి లాభసాటిగా ఉంటుంది. అవివాహిత వ్యక్తులు శుభవార్తలు వింటారు. కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. జీతం పెరిగే అవకాశం ఉంది. వ్యాపారులకు మంచి లాభాలు వస్తాయి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications