Latest Updates
-
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.!
వెండిపాదంతో శని..ఈ 3 రాశులకు 2027 వరకు తిరుగులేదు,ధనవంతులైపోతారు!
మనలో ఎవరికైనా లైఫ్ లో అంతా అడ్డదిడ్డంగా జరుగుతూ ఉంటే నీకు ఏదో శని పట్టిందిరా అంటుడటం మనం వింటుంటాం. వాస్తవానికి శనీశ్వరుడు వ్యక్తుల కర్మలను బట్టి ఫలితాలను ఇస్తుంటాడు. జ్యోతిష్యశాస్త్రంలో శనిదేవుడిని న్యాయదేవుడిగా అభివర్ణిస్తుంటారు. అత్యంత నెమ్మదిగా కదిలే శని గ్రహం ఒకే రాశిలో దాదాపు 2.5 సంవత్సరాలు ఉంటుంది. ఈ ఏడాది మార్చి 29న శని మీన రాశిలోకి ప్రవేశించగా..2027 వరకు ఇక్కడే ఉంటాడు.
ఈ సమయంలో కొన్ని రాశులు సాడే సతి, శని ధైయా ప్రభావానికి లోనవుతుండగా..శని తన వెండిపాదాలతో 3 రాశులకు భారీగా సంపద,సక్సెస్ అందిస్తున్నాడు. శని వెండిపాదం 2,5,9వ ఇంట్లో ఏర్పడుతుంది. దీంతో 3 రాశుల వారికి 2027 దాకా సంపద, కెరీర్, రిలేషన్స్ లో పాజిటివ్ మార్పులు ఉంటాయని జ్యోతిష్య పండితులు తెలిపారు. ఆ మూడు లక్కీ రాశులు ఏవో ఇక్కడ చూడండి.

మీనం
మీ రాశిలోని మొదటి ఇంట్లో శని దేవుడు కొలువై ఉండటం వల్ల మీలో కొత్త శక్తి ఉప్పొంగుతుంది. ఏదైనా సాధించగలగగనే నమ్మకం మీలో ఏర్పడుతుంది. ఉద్యోగులకు ఈ సమయం బాగుంటుంది. ఆఫీసులో లేదా కార్యాలయంలో మీ టాలెంట్ ను గుర్తించి కొత్త బాధ్యతలు అప్పగించే అవకాశాలు ఉన్నాయి. ఇది మీ ఎదుగుదలకు ఒక గొప్ప అవకాశంగా ఉంటుంది. ఇక వ్యాపారం చేసే మీన రాశి వ్యక్తులకు ఇది నిజంగా పండగ సమయం అని పండితులు చెబుతున్నారు. వ్యాపారాన్ని విస్తరించేందుకు కొత్త మార్గాలు తెరుచుకుంటాయని, చేపట్టే ప్రతి పని విజయవంతమవుతుందని తెలిపారు. కుటుంబసభ్యుల మధ్య ప్రేమానురాగాలు మరితం బలపడతాయి. అవివాహితులకు మంచి పెళ్లి సంబంధం వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఆర్థికగంగా కూడా ఈ సమయం మీకు తిరుగుండదు. డబ్బును పొదుపు చేయగల్గుతారు. కొత్త ఆస్తులు కొనడానికి, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ మెంట్స్ కి ఇది మంచిసమయం.
మిథునం
మీనరాశిలో ఉన్న శని..మీ దశమ స్థానాన్ని ప్రభావితం చేయనున్నారని జ్యోతిష్య పండితులు తెలిపారు. దీంతో ఉద్యోగులకు ప్రమోషన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. మీ కష్టానికి తగిన ప్రతిఫలం వస్తుంది. జీతం పెరుగుదల ఉంటుంది. కెరీర్ లో ఉన్నత స్థానానికి చేరుకునే అవకాశముంది. వ్యాపారులకు ఊహించని విధంగా కొత్త అవకాశాలు వస్తారు. గతంలో పెట్టిన పెట్టుబడులు ఈ సమయంలో మంచి లాభాలను అందిస్తాయి. ఆర్థికంగా మీరు బలపడతారు. ఇంట్లో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్న ప్రభుత్వ సంబంధిత పనులు ఈ సమయంలో పూర్తవుతాయి.
తుల
మీ ఆరవ స్థానంలో శని కొలువై ఉండటంతో మీకు అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఈ సమయంలో చాలాకాలంగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న సమస్యలకు చెక్ పెడతారు. ప్రత్యర్థులపై తిరుగులేని విజయం సాధిస్తారు. ఈ సమయంలో మీ ఆరోగ్యం మెరుగవుతుంది. దీర్ఘకాలికంగా ఉన్న ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ుద్యోగులకు ఆఫీసులో సహోద్యోగుల నుంచి ఫుల్ సపోర్ట్ ఉంటుంది. మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. వ్యాపారులకు ఈ సమయంలో లాభాల పంటగా ఉంటుంది. వ్యాపారాన్ని విస్తరించాలనుకునే మీ ప్రణాళికలు విజయవంతం అవుతాయి. ఆర్థికంగా మరింత బలపడతారు. కొత్త ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి. గతంలో లోన్స్ తీసుకుంటే దానిని తిరిగి చెల్లించడానికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక చింతల నుంచి విముక్తి పొందుతారని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications