Latest Updates
-
ప్రోటీన్లు, ఫైబర్ పుష్కలం.. ఉదయాన్నే తినాల్సిన హెల్తీ మల్టీగ్రెయిన్ దోస ఇదే! -
చికెన్, మటన్ కాదు.. ఎప్పుడైనా కమ్మటి మునగకాయ బిర్యానీ ట్రై చేశారా? -
మనిషికి పంది కిడ్నీ.. ఏకంగా 271 రోజులు.. వైద్య చరిత్రలో మహాద్భుతం! -
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి! -
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.!
శని వక్రమార్గం వల్ల ఈ 6 రాశుల వారికి కష్టాలు తప్పవు, ఇదంతా శష రాజ్యయోగ ప్రభావమే..
Saturn Retrograde: శని వక్రీ: జ్యోతిష్య శాస్త్ర ప్రకారం, న్యాయ దేవుడు మరియు కర్మలకు అధిపతిగా పిలిచుకునే శనిదేవుడు జనవరి 17, 2023న కుంభరాశిలోకి సంచరించడా. దాదాపు రెండున్నర సంవత్సరాల పాటు ఈ రాశిలో సంచరించిన తర్వాత, వారి తదుపరి రాశి మార్పు మార్చి 29, 2025న మీన రాశిలోకి ప్రవేశిస్తాడు. నవగ్రహాలలో, శని గ్రహం చాలా నెమ్మదిగా కదిలే గ్రహం. శనిదేవుడు కుంభరాశిలో సంచరించినప్పుడు పంచ మహాపురుష రాజ్యయోగాలలో ఒకటైన 'శష రాజాయోగాన్ని' సృష్టించాడు. వైదిక జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, కుంభరాశి వారి మూల త్రికోణ రాశి, ఇందులో శని ప్రవేశించినప్పుడు షష్ రాజయోగం ఏర్పడుతుంది.
శని గ్రహం జూన్ 30, 2024 నుండి తిరోగమనంలో ప్రయాణిస్తాడు. వైదిక జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, ఒక గ్రహం తిరోగమనంలో ఉన్నప్పుడు, ఆ గ్రహం యొక్క శక్తి, సామర్థ్యాలు, ఫలితాలను ఇచ్చే ప్రభావం అనిశ్చితంగా మారుతుంది. అటువంటి పరిస్థితిలో, అతను సృష్టించిన అన్ని శుభ యోగాలు మరియు రాజయోగం వాటింతటబే కరిగిపోతాయి. శని దేవుడు మొత్తం 139 రోజులు అంటే 4 నెలల 19 రోజుల పాటు వ్యతిరేక దిశలో ప్రయాణిస్తాడు. ఈ స్థితిలో ఆయన సృష్టించిన 'శష రాజయోగం' అక్కడితో పూర్తి అవుతుంది. షష్ రాజ్యయోగ భంగం అన్ని రాశులను ప్రభావితం చేస్తుంది, అయితే ఇది 5 రాశులపై ప్రత్యేక ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. ఈ రాశులు ఏవో తెలుసుకుందాం?

6 రాశులపై శని తిరోగమన ప్రభావం
ధనుస్సు రాశి
మీ జీవితంలో అడ్డంకులు ఎదురవుతాయి. ఏ పనిచేసిన పనులు పూర్తి కావు, ధన ప్రవాహం నెమ్మదిగా ఉంటుంది. వృధా ఖర్చులు పెరుగుతాయి,ఆర్థిక పరిస్థితి మిమ్మల్ని ఇబ్బందుల్లోకి పడేస్తుంది. కార్యాలయంలో సహోద్యోగులు మరియు యజమానితో సంబంధాలు చెడిపోవచ్చు. మీకు ఇష్టంలేని ప్రదేశానికి మీరు బదిలీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులు ఎంత కష్టపడినా ఫలితం ఉండదు. మనస్సు చంచలంగా ఉంటుంది. వ్యాపారస్తుల వ్యాపారంలో క్షీణత ఉంటుంది. కాబట్టి పెట్టుబడులు పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.
సింహరాశి
సింహారాశికి సూర్యడు అధిపతి, నలుగురిలో చాలా గుర్తింపును కోరుకుంటాడు. అయితే కొన్ని సందర్బాల్లో మీ ఆత్మవిశ్వాసం తగ్గుతుంది. ప్రయివేటు ఉద్యోగాలు చేసే వారు ఉద్యోగం కోల్పోయే అవకాశం ఉంది. జీవితంలో ఆర్థిక సంక్షోభం పెరుగుతుంది. కాబట్టి, ఆర్థిక విషయాల పట్ల జాగ్రత్తగా వ్యవహరించండి .రాజకీయాలతో సంబంధం ఉన్న వ్యక్తులు తమ పదవులను కోల్పోవచ్చు. సామాజిక గౌరవం తగ్గుతుంది. కొన్ని పాత వ్యాధులు తిరగదోడవచ్చు. పిల్లల గురించి మీరు బాధపడే అవకాశం ఉంది.
మిధునరాశి
భాగస్వామ్య వ్యాపారాలు లాభించవు. ఏమున్నా మీరు ఒక్కరిగా వ్యాపారం ప్రారంభిస్తే మంచి ఫలితం ఉంటుంది. అలాగే ప్రస్తుతం ఉన్న వ్యాపారాల్లో కొంచెం లాభాలు తగ్గవచ్చు. అందుకు మీ కార్మికులే కారణం కావచ్చు. ప్రయాణాల విషయంలో జాగ్రత్తగా ఉండండి. వాహన సంబంధ ప్రమాదాలు జరిగే అవకాశాలున్నాయ కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోండి. ఆరోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. వైద్య ఖర్చులకు ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వస్తుంది. భూమి, ఆస్తుల విషయంలో వివాదాలు పెరగవచ్చు. అన్నయ్య లేదా సోదరితో సంబంధాలు చెడిపోయే అవకాశాలు ఉన్నాయి.

కన్య సూర్య రాశి
కన్యారాశి వారికి తీవ్ర ఆర్థక సమస్యలు ఎదురవుతాయి. తీవ్రమైన ఆరోగ్య సంబంధిత అడ్డంకులు తలెత్తుతాయి. ఆర్థిక సమస్యలు పెరుగుతాయి. రావాల్సి డబ్బు సమయానికి అందదు, ధన ప్రవాహం తగ్గిన చోట వృధా ఖర్చులు పెరగవచ్చు. ఆర్థిక అస్థిరత పెరుగుతుంది. ఉద్యోగస్తుల కష్టాలు కూడా పెరుగుతాయి. మీ కష్టానికి తగిన ఫలితాలు రాకపోయే అవకాశాలు ఉన్నాయి. కార్యాలయాల్లో పనిభారం పెరగడం వల్ల మీరు అసంత్రుప్తిగా భావిస్తారు. భాగస్వామ్య వ్యాపారంలో భాగస్వాములతో వివాదాలు రావచ్చు. వ్యాపార ఖర్చులు పెరగడం వల్ల లాభాలు తగ్గుతాయి.
మేషరాశి
శని వ్రక్రీ వల్ల మేషరాశి వారికి మానసిక ఒత్తిడి పెరుగుతుంది. ఎంత భాగా వ్యాపారం చేసినా వ్యాపార భాగస్వామితో వివాదాలు ఏర్పడుతాయి. దాంతో ఆవేశంలో మీరు వ్యాపారంలో తప్పుడు నిర్ణయాలు తీసుకోవచ్చు. ఆర్థికంగా నష్టపోయే అవకాశాలు ఉన్నాయి. అప్పులు పెరగవచ్చు. గొడవలకు వెళ్ళొద్దు, మాటా మాటా పెరిగి పెద్ద వివాదాలకు దారితీస్తుంది. కోర్టలు పోలిస్టేషన్ల చుట్టు తిరగాల్సి రావచ్చు. కుటుంబ జీవితంలో సంతోషం ఉండదు.
వ్యాపారస్తులకు న్యాయపరమైన సమస్యలు ఎదురుకావచ్చు. వ్యాపారంలో ధన ప్రవాహం తగ్గుతుంది.మీ తప్పిదం వల్ల ఒక పెద్ద ఒప్పందం రద్దు అవుతుంది. వ్యాపార ప్రయాణాలలో ఎక్కువ ఖర్చు ఉంటుంది. బంధువులతో సంబంధాలు చెడిపోతాయి. కుటుంబ కలహాలు పెరగవచ్చు. విద్యార్థుల కెరీర్‌పై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉంది. దాంతో మీలో ఆందోళన, ఒత్తిడి పెరుగుతుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications
