Latest Updates
-
స్నానం చేసేటప్పుడు మొదట ఏ భాగంపై నీళ్లు పోయాలి.?.. ఆయుర్వేదం ప్రకారం సరైన పద్ధతి ఏంటో తెలుసా.? -
తెలంగాణలో ఘనంగా బోనాల వేడుకలు.. ఆధ్యాత్మిక రహస్యం, చరిత్ర ఇదే.! -
మదురై స్పెషల్ మటన్ దోశ.. ఇలా చేస్తే జన్మలో ఆ రుచిని మర్చిపోలేరు! -
సూర్యగ్రహణం 2026..గ్రహణానికి ముందు, తర్వాత చేయాల్సిన పనులివే! -
డ్రై ఫ్రూట్స్ రోజుకు ఎన్ని తినాలో తెలుసా? ఆ తప్పు చేస్తే ప్రమాదమే! -
డెలులు డేటింగ్.. మీరూ ఇలాంటి భ్రమల్లో బతుకుతున్నారా.? -
పెనంపైనే రెస్టారెంట్ స్టైల్ లో.. దూదిలాంటి మెత్తని గార్లిక్ నాన్ చేసేయండిలా! -
మీ కళ్ల ముందే ఎవరైనా కుప్పకూలిపోతే వెంటనే ఏం చేయాలి? -
నెలసరి సమయంలో వ్యాయామం చేయడం సురక్షితమేనా.. నిపుణుల సలహా ఏంటంటే.? -
ఎముకలకు బలాన్నిచ్చే సంప్రదాయ మటన్ షోర్బా.. ఒక్కసారి రుచి చూస్తే వదిలిపెట్టరు!
ఒకే రోజున సూర్య గ్రహణం,శని రాశి మార్పు..ఈ రాశులు భారీ అదృష్టవంతులు, అష్టైశ్వర్యాలతో సకల సుఖాలు
జ్యోతిషశాస్త్రంలో సూర్యగ్రహణం, శని గ్రహ సంచారానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. 2025లో శని గ్రహ సంచారం, సూర్యగ్రహణం ఒకే రోజున జరుగుతాయి. శని తన స్వంత రాశి అయిన కుంభరాశిని రెండున్నరేళ్ల తర్వాత వదిలి మార్చి 29, 2025న మీన రాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ ఏడాదిలో తొలి సూర్యగ్రహణం కూడా మార్చి 29నే ఏర్పడుతుంది.
శని రాశి మార్పు, సూర్యగ్రహణం ఒకే రోజు జరగడం మొత్తం 12 రాశుపై దీని ప్రభావం ఉంటుంది. అయితే ముఖ్యంగా 3 రాశులకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. వితంలో చాలా సంతోషకరమైన మార్పులు వస్తాయి. కెరీర్, ఫైనాన్స్, వివాహం, ఉద్యోగం వంటి వాటిల్లో విజయాలు సాధించగలుగుతారు. ఈ అదృష్ట రాశులు ఎవరో ఇక్కడ చూడండి.

మిథున రాశి
2025లో సూర్యగ్రహణం, శని సంచారం కలిసి రావడం మిధున రాశి వారికి చాలా ప్రయోజనాలను తెస్తుంది. అదృష్టం మీకు అనుకూలంగా ఉంటుంది. జీవితంలో చాలా సానుకూల మార్పులు సంభవిస్తాయి. వ్యాపారులకు ఆకస్మిక ధనలాభం ఉంటుంది. ఉద్యోగంలో ప్రమోషన్లు, జీతం పెరుగుదల ఉంటుంది. కుటుంబంలో ఆనందం, శాంతి ఉంటుంది. ఆర్థిక ప్రయోజనాలను పొందవచ్చు. పెట్టుబడి నుండి మంచి రాబడి వస్తుంది. జీవితమే మారిపోయే స్థాయికి పరిస్థితులు చేరుకుంటాయి. వైవాహిక జీవితంలో మునుపెన్నడూ లేని విధంగా ఆనందాన్ని అనుభవిస్తారు.
ధనుస్సు రాశి
ధనుస్సు రాశి వారు అంతా కోరుకున్నట్లు చేయవచ్చు. పెండింగ్ లో ఉన్న పనులు పూర్తవుతాయి. వ్యాపారస్తులు తమ వ్యాపారాలను విస్తరించుకోగలుగుతారు. కొత్త విషయాలను నేర్చుకునే, ప్రయోజనాలను పొందే అవకాశాన్ని పొందుతారు. కుటుంబం,భాగస్వామితో నాణ్యమైన సమయాన్ని గడపడానికి మీకు సమయం లభిస్తుంది. భాగస్వామి ప్రతి విషయంలోనూ మీకు సహకరిస్తారు. సంబంధం స్థిరంగా ఉంటుంది, అన్ని సమస్యలు తొలగిపోతాయి. అన్ని బాధ్యతలను సంపూర్ణంగా నిర్వహించగలుగుతారు. పెళ్లి చేసుకోవాలనే ఆలోచనలో ఉన్న వారికి ఇది శుభ సమయం. ప్రేమ వ్యవహారాలలో కూడా సానుకూల మార్పులు ఉంటాయి.
మకర రాశి
మకర రాశి వ్యక్తులకు శని సంచారం, సూర్యగ్రహణం జీవితంలో అనేక శుభ మార్పులకు కారణమవుతాయి. ఉన్నతచదువులు చదవాలనుకునే వారికి ఇది శుభసమయం. విదేశాలకు వెళ్లి జీవితాన్ని ఆనందంగా గడపడం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారంలో ఊహించని ఆర్థిక పురోగతి మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తుంది. పాత పెట్టుబడులు మంచి రాబడిని పొందవచ్చు. ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వ్యక్తులు కొత్త ఉద్యోగం పొందవచ్చు. కార్యాలయంలో కొత్త విషయాలను నేర్చుకునే అవకాశాన్ని పొందుతారు. ఆర్థిక సంక్షోభం తొలగిపోయి సమాజంలో మీ స్థాయి పెరుగుతుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications