Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
శని కరుణిస్తే ఇలా ఉంటుందా.. ఈ 4 రాశుల వారికి ఏం చేయకున్నా కుప్పలు కుప్పలుగా డబ్బులు వస్తాయి!
క్రమ శిక్షణ, శ్రమ, కర్మకు ప్రతిరూపమైన శనీశ్వరుడు వచ్చే ఏడాది మీనరాశిలోకి ప్రవేశించనున్నాడు. దీని కారణంగా రాశి చక్రంలోని పలు రాశులు గణనీయంగా ప్రభావితం కానున్నాయి. శని కారణంగా పలు రాశుల కలలో కూడా ఎరగని సిరి సంపదలు రానున్నాయి. అలాగే కొన్ని రాశుల వారు తీవ్రమైన ఫలితాలను పొందనున్నారు. అసలు మీన రాశిలో శని సంచారం కారణంగా ఏ రాశి వారికి ఏ విధమైన ఫలితాలు ఉండబోతున్నాయి? అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
వృషభం
వృషభ రాశి వారు 2025లో అద్భుతమైన ఫలితాలను ఆస్వాదించబోతున్నారు. ఎందుకంటే వీరిపై శని భగవానుడి ఆశీస్సులు మెండుగా ఉండనున్నాయి. దీని కారణంగా ఈ రాశి వారికి ఊహించని ఆర్థిక లాభాలను, స్థిరత్వాన్ని తెస్తాయి. గతంలో చేసిన పెట్టుబడులు.. ఇప్పుడు వీరికి ఊహించని మొత్తంలో గొప్ప ఫలితాలను అందించనున్నాయి.

ప్రస్తుతమున్న ఉద్యోగంలో లేదా కొత్త ఉద్యోగంలో గొప్ప గొప్ప అవకాశాలు వస్తాయి. జీతాలు పెరుగుతాయి. వ్యక్తిగత సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ప్రేమ సంతృప్తిని ఇస్తుంది. కుటుంబ జీవితం సామరస్యంగా సాగుతుంది.
కన్య
సాధారణంగా ఈ రాశి వారికి చాలా తెలివైన వారీగా పేరుంది. 2025లో ఈ రాశి వారు శని సంచారం కారణంగా అపారమైన వృద్ధి, శ్రేయస్సును అందుకోనున్నారు. దీర్ఘ కాలంగా ఈ రాశి వారు వేసుకుంటున్న ప్రణాళిక ఫలితాలు ఇప్పుడు వీరికి అందనున్నాయి. పనిలో వారి పనితీరు మెరుగుపడుతుంది. అలాగే వారికి గొప్ప గుర్తింపు లభించనుంది.
ఆర్థికంగా, భవిష్యత్ పెట్టుబడులను ప్లాన్ చేయడానికి ఇది గొప్ప సమయం. ఈ సంవత్సరం వారి ప్రియమైన వారితో సంబంధాలు మెరుగుపడతాయి. వివాహం కోసం ఎదురుచూస్తున్న వారికి ఈ సంవత్సరం మంచి సంబంధాలు కుదరనున్నాయి.
మకర
శని మకర రాశికి అధిపతి కాబట్టి, వచ్చే ఏడాది ఈ రాశుల వారికి కూడా చాలా అనుకూలంగా ఉండబోతుంది. ఈ రాశి వారు తమ వ్యాపారాల్లో అద్భుతమైన విజయాలను సాధిస్తారు. అలాగే భారీగా డబ్బులను సంపాదించుకుంటారు. శని ఆశీర్వాదం కారణంగా ఈ రాశి వారు తమ లక్ష్యాలపై స్థిరమైన పురోగతిని సాధిస్తారు. వీరిలోని క్రమశిక్షణ, ఏకాగ్రత వీరి లక్ష్యాన్ని చేధించేందుకు ఉపయోగపడుతుంది. ఈ రాశి వారి వారి వ్యక్తిగత సంబంధాలు బలపడతాయి, వారి జీవితంలో ఆనందం మరియు శాంతి నెలకొల్పబడతాయి.
మీన రాశి
శని నేరుగా మీనంలోకి ప్రవేశించడం వల్ల, ఈ రాశుల వారు తీవ్రమైన సానుకూల మార్పులను అనుభవిస్తారు. శని వారి కృషి మరియు పట్టుదలకు ప్రతిఫలం ఇవ్వడం వలన వారు వారి కలలను నెరవేర్చుకుంటారు.
భారీగా ఆర్ధిక లాభాలను పొందుతారు. జీవితంలో పురోగతి ఉంటుంది. వ్యక్తిగత అభివృద్ధి కూడా అద్భుతంగా ఉండబోతుంది. మనశ్శాంతి దొరుకుతుంది. ఒత్తిడి నుంచి విముక్తి లభిస్తుంది భావోద్వేగ బంధాలు బలపడతాయి. అలాగే మనసుకు ప్రశాంతత లభిస్తుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications