Latest Updates
-
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే! -
స్పైసీ మటన్ లివర్ ఫ్రై..ఈ సీక్రెట్ మసాలాతో చేస్తే ప్లేట్ ఖాళీ చేస్తారు! -
కరలాడే టమాటా మురుకులు.. ఒక్కసారి రుచి చూస్తే అస్సలు వదిలిపెట్టరు! -
రోజు తినే పెరుగన్నమే కదా అని తీసిపారేయకండి.. ఇలా స్పెషల్ గా చేస్తే గిన్నె ఖాళీ అవ్వాల్సిందే!
కుంభరాశిలోకి శని సంచారం.. ఈ రాశుల వారికి ఎంతో అదృష్టం, మిగతా రాశుల పరిస్థితి ఏంటంటే?
కుంభరాశిలో శని సంచారం ద్వాదశ రాశుల వారిపై ప్రభావం చూపుతుంది. అలాగే శని కుంభరాశిలోనే 2026 వరకు ఉంటాడు. ఆ తర్వాతే మీనరాశిలోకి ప్రవేశిస్తాడు. శని సంచారం, కదలిక ప్రతి రాశి వారిపై తప్పకుండా ఉంటుంది. కుంభరాశిలో శని ఉండటం వల్ల ఏయే రాశుల వారికి లాభమో.. వారు ఎలాంటి ప్రయోజనాలు పొందనున్నారో.. ఎంతటి అదృష్టాన్ని అందుకోనున్నారో.. ఏ రాశుల వారు సమస్యలు ఎదుర్కోనున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.

మేషరాశి
శని మేషరాశి వారి 11వ ఇంట్లో ఉంటాడు. ఇది వృత్తి, వ్యాపారానికి శుభసూచకం. మంచి ప్రయోజనాలు అందుకుంటారు. ఉద్యోగంలో ఉన్న వారికి ప్రమోషన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆర్థికంగా వృద్ధి సాధిస్తారు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి అనుకూల ఫలితాలు లభిస్తాయి.
వృషభరాశి
శని వృషభ రాశి వారి 10వ ఇంట్లో ఉన్నాడు. ఈ సమయంలో కొత్త ఉద్యోగంలో చేరే అవకాశం ఉంది. అయితే ప్రమాదకర రంగాన్ని ప్రయత్నించవద్దని సలహా ఇవ్వబడుతోంది. పని ప్రదేశంలో కొంత మార్పు వచ్చే అవకాశం ఉంది. ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థులకు మంచి అవకాశాలు లభిస్తాయి.
మిథునరాశి
శని గ్రహం మిథునరాశి 9వ ఇంట్లో ఉంటాడు. కెరీర్ పరంగా ఈ కాలం అనుకూలంగా ఉంటుంది. కొత్త ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వారికి మంచి అవకాశాలు లభిస్తాయి. విదేశాలకు వెళ్లాలనుకునే వారికి ఇది మంచి సమయం.
కర్కాటక రాశి
శని కర్కాటక రాశి వారి 8వ ఇంట్లో ఉంటాడు. వృత్తి జీవితంలో కర్కాటక రాశి వారు సవాళ్లను ఎదుర్కోబోతున్నారు. 2026 వరకు కర్కాటక రాశి వారు జాగ్రత్తగా ఉండాలని జ్యోతిష శాస్త్రనిపుణులు చెబుతున్నారు.
సింహరాశి
సింహరాశిలో శని 7వ ఇంట్లో ఉంటాడు. ఈ సమయం సింహరాశి వారికి అనుకూలంగా ఉండనుంది. ఉద్యోగులకు ఇది మంచి సమయం. కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి మంచి అవకాశాలు లభిస్తాయి. వ్యాపారవేత్తలు, స్వయం ఉపాధి పొందేవారు ఈ సమయంలో పురోగతిని చూస్తారు.
కన్యరాశి
కన్యారాశిలో శని 6వ ఇంట్లో ఉంటాడు. ఈ సమయంలో కార్యాలయంలో అనేక మార్పులు చోటుచేసుకుంటాయి. కొత్త ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. పనిలో ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. మానసికంగా ఆరోగ్యంగా ఉండలేరు.
తులరాశి
తులారాశిలో శని 5వ ఇంట్లో ఉన్నాడు. వృత్తి, వ్యాపారాలుక ఈ కాలం చాలా అనుకూలంగా ఉంటుంది. కొత్త ఒప్పందాన్ని కుదుర్చుకునే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించడం మంచిది.
వృశ్చికరాశి
వృశ్చిక రాశిలో శని 4వ ఇంట్లో ఉన్నాడు. ఈ సమయంలో వృశ్చిక రాశి వారు సవాళ్లను ఎదుర్కొంటారు. ఉద్యోగంలో బదిలీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం లేకపోలేదు. అందుకే జాగ్రత్తగా ఉండటం మంచిది.
ధనుస్సు రాశి
ధనుస్సు రాశిలో శని గ్రహం 3వ ఇంట్లో ఉంటాడు. దీని వల్ల ఉద్యోగులకు, వ్యాపారస్తులకు అనుకూలంగా ఉండనుంది. ఉద్యోగులు పదోన్నతి పొందే అవకాశం ఉంది. కొత్త ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. విదేశాలకు వెళ్లాలనుకునే వారి ప్రయత్నాలు ఫలితాన్ని ఇస్తాయి.
మకరరాశి
శని మకరరాశి వారి 2వ ఇంట్లో ఉంటాడు. ఈ సమయంలో మకర రాశి వారికి అనుకూలంగానే ఉంటుంది. వ్యక్తిగత జీవితంలో సంతోషంగా సాగుతుంది.
కుంభరాశి
కుంభరాశి లగ్న గృహంలో శని ఉంటాడు. శని సడేసాతి ప్రభావం వల్ల పనిలో ఒత్తిడి ఎదుర్కొంటారు. అనేక సవాళ్లు ఎదురవుతాయి. పని కోల్పోకుండా జాగ్రత్తగా ఉండాలి. మరింతగా కష్టపడటానికి ప్రయత్నించండి.
మీనరాశి
మీనరాశి వారి 12వ ఇంట్లో శని ఉంటాడు. ఈ సమయంలో మీనరాశి వారు కష్టాలు, సమస్యలు, సవాళ్లను ఎదుర్కొంటారు. ఉద్యోగం వదిలి వేరే ఉద్యోగం కోసం వెతకవద్దు. కావాలంటే ఒక ఉద్యోగం చేస్తూనే మరో దానికోసం ప్రయత్నించండి.
Disclaimer: ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ వ్యాసాన్ని రాయడం జరిగింది. కచ్చితత్వానికి, విశ్వసనీయతకు ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. Boldsky Telugu ఈ వ్యాసానికి సంబంధించిన ఏ విషయాన్నీ నిర్ధారించడంలేదు. ఈ వ్యాసం ఉద్దేశం సమాచారం అందించడం మాత్రమే. ఏదైనా పాటించే ముందు సంబంధిత నిపుణుల సలహా తీసుకోగలరు.



Click it and Unblock the Notifications











