Latest Updates
-
చిరుతిళ్లలో దీనికి సాటి లేదు.. పది నిమిషాల్లో పుదీనా ఫ్లేవర్‌తో కరకరలాడే మరమరాల మిక్స్చర్.! -
maggie masala : కూరల రుచిని రెట్టింపు చేసే మ్యాగీ మసాలా..ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోండిలా! -
లిప్‌స్టిక్‌తో పెదాలు డ్రై అవుతాయా.. అధర అందం విషయంలో అతివలు చేసే పొరపాట్లు ఇవే.! -
చల్లటి పెరుగుతో చేటు: ఆయుర్వేదం ప్రకారం పెరుగు ఎలా తినాలి? ఎప్పుడు అసలు తినకూడదు? -
గణేశ్ చతుర్థి స్పెషల్.. తమిళనాడు స్టైల్లో నోరూరించే పరమాన్నం.. తింటే స్వర్గమే.! -
కర్ణాటక స్పెషల్ తర్కారీ పులావ్..బిర్యానీ కూడా దీనిముందు దిగదుడుపే! -
గాయమైన చోట పసుపు రాస్తున్నారా.. ఇంటి చికిత్స చేసేటప్పుడు ఈ పొరపాట్లు వద్దు.! -
సోషల్ మీడియాను ఊపేస్తున్న రెట్రో మేనియా.. 1980’s క్లాసిక్ లుక్ మీరూ ట్రై చేశారా.? -
వాహనం ఏ రంగులో ఉన్నా.. టైరు మాత్రం నల్లగానే ఎందుకుంటుందో తెలుసా? -
ఈ రాశి వారు శుక్రవారం ఈ పూజ చేస్తే ఇంట్లో అష్టైశ్వర్యాలు కొలువుదీరడం పక్కా.!
ఈ ఐదు రాశుల వారిపై శని వక్ర గమనం తీవ్ర ప్రభావం.. డిసెంబర్‌లో ఈ తేదీ వరకు కష్టాలు తప్పవు.!
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం వివిధ రాశుల వారి జాతకాలపై శని అత్యంత ప్రభావవంతమైన, ఫలితాలను ఇచ్చే గ్రహంగా పరిగణిస్తారు. అందుకే శని తన గమనాన్ని మార్చుకున్నప్పుడల్లా దాని ప్రభావం గురించి ఆందోళన పడుతుంటారు. ఈ క్రమంలో ఈ గ్రహం జులై 27న వక్రగతి ప్రారంభించింది. డిసెంబర్ 11 వరకు ఇది కొనసాగుతుంది. ఫలితంగా కొన్ని రాశుల వారికి ప్రయోజనకరం కాగా మరికొన్ని రాశుల వారికి ప్రతికూలంగా ఉంటుంది. మరి ప్రతికూల ప్రభావం ఉన్న రాశుల వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు చూద్దాం..

సింహ రాశి
సింహరాశి వారికి శని గ్రహం వక్రగతిలో సంచరించడం కారణంగా ఆరోగ్యపరంగా పలు సవాళ్లను ఎదుర్కొంటారు. వారి వయసు, రహస్యాలతో ఈ గ్రహ వక్రగతి ప్రభావం ముడిపడి ఉంటుంది. ఆహారపు అలవాట్లలో సమతుల్యత పాటించాలి. క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలి. మానసిక అశాంతి, భయాన్ని ఎదుర్కొనే ప్రమాదం ఉంది. మానసిక ప్రశాంతత కోసం యోగా, మెడిటేషన్‌తో పాటు ఆధ్యాత్మిక భావనను పెంపొందించుకోవాలని జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు.
కన్యారాశి
కన్యా రాశి వారికి శని వక్ర గతి సంచారం కారణంగా సంబంధాలు, భాగస్వామ్యాల విషయంలో జాగ్రత్త వహించాలని పండితులు చెబుతున్నారు. వివాహం, వ్యాపార భాగస్వామ్యాలకు సంబంధించి విభేదాలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. ఇలాంటి సమయాల్లో ఏ నిర్ణయం తీసుకున్నా ఆలోచించి తీసుకోవాలి. ముఖ్యంగా వ్యాపార సంబంధిత నిర్ణయాల్లో తొందరపాటు పనికిరాదు. లేదంటే నష్టానికి దారితీస్తుంది.

తులారాశి
శని వక్రగతి సంచారం.. తులారాశి వారిపై ప్రభావం చూపిస్తున్న కారణంగా ప్రత్యర్థుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. సన్నిహితులతో విభేదాలు తలెత్తే అవకాశం ఉంది. ప్రత్యర్థులు చురుగ్గా ఉండి మీతో పోటీకి దిగవచ్చు. మీరు చేస్తున్న పనిపై మాత్రమే దృష్టి సారించి వివాదాలకు దూరంగా ఉండటానికి ప్రయత్నించండి.
ధనుస్సు రాశి
ధనుస్సు రాశి వారికి కుటుంబం, ఆస్తి సంబంధిత విషయాల్లో ఇబ్బందులు తలెత్తవచ్చు. ఇలాంటి విషయాల్లో జాగ్రత్త వహించాలి. ధనుస్సు రాశి వారికి తల్లి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. ఆస్తి, వాహనాల కొనుగోలు విషయంలో కొన్ని రోజులు వేచి ఉండాలి. వ్యాపారంలో ఏదైనా పెట్టుబడి పెట్టే ముందు నిపుణుల సలహా తీసుకోవడం మేలు.
మీన రాశి
మీన రాశి వారు ఈ కాలంలో శారీరక, మానసిక సవాళ్లను ఎదుర్కొనే అవకాశం ఉంది. ఆరోగ్య సమస్యలు ముఖ్యంగా కాళ్ల నొప్పులు, అలసట ఎదుర్కోవచ్చు. చదువులో, వృత్తి రంగంలో ఆటంకాలు ఎదుర్కొనే సూచనలు ఉన్నాయి. సహనం పాటిస్తూ ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి.
పరిహారాలు
శని వక్ర గతి ప్రభావం ఉన్నవారు మంగళ, శనివారాల్లో హనుమంతుడిని పూజ చేయడం శుభప్రదంగా పండితులు చెబుతున్నారు. శనివారం రోజు శని దేవుడుని పూజించండి. రావి చెట్టు కింద ఆవనూనె దీపం వెలిగించడం శ్రేయస్కరం. అవసరంలో ఉన్నవారికి నూనె, నల్ల నువ్వులు, బట్టలు, చెప్పులు, ఆహారం దానం చేయడం ద్వారా సానుకూల ఫలితాలను పొందే అవకాశం ఉంది. జ్యోతిష్యుడి సలహా మేరకు నీలమణి రత్నపు ఉంగరాన్ని ధరించవచ్చు. వినయం పాటిస్తూ ఉండండి. ఎదుటి వారిని అవమానించకండి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications
