Latest Updates
-
ఎండలు మండిపోతున్నాయి: గర్భిణీలు, PCOS ఉన్నవారు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
భరణం కట్టలేక లోన్ ఈఎంఐల సాకు చెబుతున్నారా? సుప్రీంకోర్టు షాకింగ్ తీర్పు ఇదే! -
సీతా నవమి 2026: దంపతులు ఈ పూజ చేస్తే వైవాహిక జీవితంలో అద్భుతమైన మార్పులు! -
వడగాల్పుల ఎండలు మండిపోతున్నాయా? మీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం
ఆగస్టు 2024లో వృశ్చిక రాశి వారికి జరగబోయేది ఇదే..!!
వృశ్చిక రాశి వారికి ఈ నెల మిశ్రమ ఫలితాలు ఉంటాయ్. మీరు మీ కార్యకలాపాల నుంచి ఆశించిన ఫలితాలను పొందుతారు. మీ సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి సిద్ధంగా ఉంటుంది. ఆదాయం పెరుగుదలకు మంచి అవకాశాలు ఉంటాయ్. రహస్య ఆదాయాలు కూడా ఉంటాయ్. గడిచిన రోజులతో పోలిస్తే ఈ నెల మీ ఆదాయం పెరుగుతుంది. తద్వారా ఆదోళనలు తగ్గుతాయ్. మీ కెరీర్ పరంగా పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. కానీ అనవసరమైన పనులను నియంత్రించగలిగితే జీవితంలో ఆశించిన ఫలితాలను పొందుతారు. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయ్. వ్యాపారులకు ఈ నెల కష్టపడి పని చేయడం జీవితంలో మీకు విజయాన్ని అందిస్తుంది.

ప్రేమ సంబంధంలో కొన్ని హెచ్చుతగ్గులు ఉన్నప్పటికీ, నెల రెండవ సగంలో మీ ప్రేమ సంబంధంతో నిండి ఉంటుంది. వివాహితులకు ఈ మాసం హెచ్చుతగ్గులతో నిండి ఉంటుంది. మీ జీవిత భాగస్వామియొక్క ప్రవర్తనకు అనుగుణంగా మీ ప్రవర్తన ఉంటే , అది మీ ఇద్దరి మధ్య సంబంధాన్ని బలపరుస్తుంది. కుటుంబ జీవితంలో చిన్ని చిన్న ఇబ్బందులు ఉండవచ్చు. కానీ ప్రేమభావన కొనసాగుతుంది. కుటుంబాన్ని సురక్షితంగా ఉంచుతుంది.
వృశ్చిక రాశి వారికి కుటుంబ పరంగా ఈ నెల శుభప్రదంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతోపాలు మీ ప్రవర్తన ప్రేమ ఆప్యాయతతో నిండి ఉంటుంది. ఇది కుటుంబ పరంగా ఆనందాన్ని కలిగిస్తుంది. ఆగస్టు 26న కుజుడు ఎనిమిదవ ఇంటిలోకి వెళ్తాడు. రెండవ ఇంటిపై దృష్టిని ఉంచుతాడు. ఇది కుటుంబ సభ్యుల మధ్య చిన్న గొడవలకు దారి తీస్తుంది. కానీ అది మీకు పెద్ద సమస్య కాదు. నాల్గవ ఇంటి అధిపతి శని నాల్గవ ఇంట్లో ఉంటాడు. మీరు వ్యాపారం కారణంగా మీ కుటుంబ జీవితాన్ని నిర్లక్ష్యం చేయవచ్చు. కుటుంబ సభ్యుల నిర్లక్ష్యానికి దారితీసే పరిస్థితులను నివారించడానికి ప్రయత్నించండి.
వృశ్చిక రాశివారికి వృత్తిపరంగా ఈ నెలలో అనుకూలంగా ఉంటుంది. మీరు వివిధ విషయాలపై చాలా శ్రద్ధ వహించాలి. నెల ప్రారంభంలో శుక్రుడు, బుధులు పదవ ఇంట్లో ఉంటారు. తద్వారా ఆశించిన ఫలితాలను సాధించడానికి సహాయపడతాయ్.తిరోగమన శని పదవ ఇంటిని చూస్తారు. దీని కారణంగా మీరు కార్యాలయంలో కష్టపడి పనిచేస్తారు.
వృశ్చికరాశివారికి ఆగస్టులో వ్యాపారపరంగా చూస్తే, ఈ నెల లాభదాయకంగా ఉంటుంది. ఈ మాసం ప్రారంభంలో గురు, కుజుడు సప్తమంలో, బుధుడు, శుక్రుడు కలిసి దశమంలో ఉంటారు. ఇది మీ వ్యాపార జీవితంలో సరైన పురోగతికి దారి తీస్తుంది. ఆగస్టు 25న శుక్రుడు పదకొండవ ఇంటికి వెళ్తాడు. అక్కడ కేతువు కూడా ఉంటాడు. ఈ కాలంలో వ్యాపారాలు పురోగతిని సాధిస్తాయ్. కొన్ని కారణాలవల్ల ముందుగా ఆగిపోయిన మీ పాత ప్రణాళికలు కూడా ప్రారంభమవుతాయి.
వృశ్చిక రాశికి చెందినవారి ఆర్థికస్థితి పరిశీలిస్తే ఈ నెల ప్రారంభం ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. కేతువు పదకొండవ ఇంట్లో ఉండి ఆర్థిక స్థితిని బలపరుస్తుంది. బృహస్పతి ఏడవ ఇంటిలో కూర్చుని పదకొండవ ఇంటిపై పూర్తి దృష్టిని కలిగి ఉంటాడు. తద్వారా ఆదాయ స్థాయిలు పెరుగుతాయి. ఐదవ ఇంటికి అధిపతి అయిన బృహస్పతి ఏడవ ఇంటిలో ఉంటాడు. ఇది ఆర్థిక స్థితిని కూడా మెరుగుపరుస్తుంది.
ఆరోగ్యపరంగా ఈ రాశివారికి బాగానే ఉంటుంది. రాశికి అధిపతి అయిన కుజుడు సప్తమంలో కూర్చొని రాశిని చూడటం వలన ఆరోగ్యం సురక్షితంగా ఉంటుంది. ఆగస్టు 26 నుంచి కుజుడు ఏనిమిదవ ఇంటికి వెళతాడు. మీరు ఆ సమయంలో వాహనాలను సురక్షితంగా నడపాలి. లేకుంటే ప్రమాదాలు జరిగే అవకాశాలు, శారీరక ఇబ్బందులు తెలత్తే అవకాశాలు ఉన్నాయి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications