Latest Updates
-
వాతావరణ మార్పులతో మోకాళ్ల నొప్పుల బాధలు.. ఉపశమనం కోసం ఇంట్లోనే ఇలా చేయండి.! -
తిరోగమనం నుంచి బయటపడ్డ బుధ గ్రహం.. ఇక ఈ రాశుల వారి దశ తిరిగినట్లే.! -
సోషల్ మీడియాలో పరిచయాలు నిజమా కాదా.?.. డేటింగ్‌కి వెళ్లేముందు ఈ విషయాలు గమనించండి.! -
ముఖంపై మొటిమలు రావడానికి కారణాలు ఇవే.. వీటిని ఎలా నివారించాలంటే.! -
‘సర్’ కలిపిన బంధం.. ముప్పై ఏళ్ల తర్వాత మళ్లీ తల్లిదండ్రులను చేరిన కుమారుడు.! -
ప్యాకెట్ చిప్స్ కు గుడ్ బై..ఎలాంటి రసాయనాలు లేకుండా ఇంట్లోనే కరకరలాడే ఆలూ చిప్స్ చేసుకోండిలా.. -
మీ పాదాలపై ఇలా ఉందా?.. లివర్ డ్యామేజ్ కి ముందస్తు హెచ్చరిక! -
ఆఫీస్ నుంచి రాగానే అలసటగా ఉందా? 15 నిమిషాల్లో ఈ క్రీమీ పనీర్ గ్రేవీ ట్రై చేయండి..చపాతీ, రైస్ లోకి కేక -
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్‌ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.!
వృశ్చిక రాశివారికి ఆగస్టు 2024లో జరిగేవి ఇవే.. ఈ కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి..!!
వృశ్చిక రాశి వారికి ఆగస్టులో ఆఫీసు మ్యానేజ్మెంట్‌కు అవకాశం ఉంటుంది. సంతోషం సౌకర్యాలు పెరుగాతాయ్. సర్వీస్ సెక్టార్‌పై దృష్టి పెట్టనున్నారు. సానుకూల పరిస్థితులు ఎదురవనున్నాయ్. ఉద్యోగంలో కొంత ఒత్తిడికి గురౌతారు, అధికారులు వేధింపులకు పాల్పడే అవకాశం ఉంది. ఇతరులకు సహాయం చేస్తారు, ఆరోగ్యం అనుకూలిస్తుంది. ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు కుటుంబ సభ్యులను సంప్రదించాలి. వైవాహిక జీవితంలో అశాంతి ఉంటుంది. మొదటి వారంలో బంధు వర్గంతో కలుస్తారు. సంతానం వల్ల ఆనందం లాభం కలుగుతుంది. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. తొందరపాటు నిర్ణయాలను తీసుకోవద్దు. ఉద్యోగపరంగా కొన్ని ఒడిదుడుకులను ఎదర్కొంటారు. ఎంత బాగా పనిచేస్తే అంత మంచి ఫలితాలు వస్తాయ్. ఉద్యోగులు ఆఫీస్‌లో జరిగే రాజకీయాలకు దూరంగా ఉంటేనే మంచిది.

ఉద్యోగాలను మార్చాలనే ఆలోచన ఉంటే, మీరు మీ నిర్ణయాన్ని పుణ: సమీక్షించాల్సిన అవసరం ఉంది. ఆశించిన ఇంక్రిమెంట్ రాకపోవడం వల్ల నిరాశ చెందుతారు. కష్టపడి పనిచేస్తే భవిష్యత్తులో మీకు మంచి అవకాశం లభిస్తుంది. ఉద్యోగంలో పని భారం పెరుగుతుంది. ఇంటా బయటా ఒత్తిడి ఉంటుంది. ముఖ్యమైన పనులను వాయిదా వెయాల్సి వస్తుంది.
మీ పనిచేస్తున్న సంస్థ విజయంలో దూసుకపోతుంది. వ్యాపారంలో సానుకూలంగా ఉంటుంది, కానీ కొన్ని సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఏదైనా ఒప్పందాలపై సంతకాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మీకు తెలియని రహస్య నిబంధనలు అందులో ఉండవచ్చు. విద్యా పరంగా మీకు ఏకాగ్రత లోపించవచ్చు. ఈ సమయంలో విద్యపై ఫోకస్ పెట్టడం మంచిది. ఆ తరువాత పరిస్థితులు మెరుగుపడవచ్చు. ఉపాధ్యాయులు, ఉద్యోగుల నుంచి ప్రశంసలు పొందడం వల్ల మీరు మంచి ప్రయోజనాలను పొందుతారు.
కుటుంబ పరంగా తల్లితో విభేధాలు ఉండొచ్చు. మీరు మీ తల్లితో జాగ్రత్తగా ఉండాలి. మీ కుటుంబ సభ్యులతో గొడవలు రావచ్చు. మీ కుటుంబ సభ్యులతో గడపడానికి కూడా సరైన సమయాన్ని ఇవ్వాలి. బంధువర్గంలో కొందరి నుంచి అపనిందలు ఎదుర్కోవాల్సి వస్తుంది. సహనంతో సామరస్యంతో వ్యవహరించి వ్యక్తిగత సమస్యలను పరిష్కరించుకుంటారు.
మీ చుట్టూ అసూయపరులు పెరిగిపోతున్నారని గ్రహించాలి. పిల్లల నుంచి సమస్యలు రాకుండా మీరు ముందుగానే జాగ్రత్త పడాలి. మిమ్మల్ని అవసర సమయాల్లో ఆదుకునే వారుంటారు. పెళ్లి సమయాల్లో ఖర్చులు పెరుగుతాయ్. తరచూ ఖర్చుల భారం మీపై ఎక్కువౌతుంది.
ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మీకు గుండె సమస్యలు ఉండవచ్చు. ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ రోగ నిరోధక శక్తిని పెంచడానికి వ్యాయామం, ధ్యానం, యోగా చేయాలి. దీని వల్ల మీ రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
ఉద్యోగం ఇల్లు మారే పరిస్థితి వస్తుంది. సంయమనంతో సమస్యను పరిష్కిరించుకోవాలి.ప్రేమ విషయంలో మీ పార్ట్‌నర్‌తో మంచి సంబంధాలు వుంటాయ్. ఇద్దరి మధ్య గొడవలు తక్కువగా ఉంటాయ్. మీ భాగస్వామిలో ఆకస్మిక మార్పులను చూడవచ్చు. ఈ సమయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. వృశ్చిక రాశివారి వ్యక్తిగత వృత్తి జీవితంలో కొన్ని అడ్డంకులను ఎదుర్కోవచ్చు. గ్రహస్థితి వల్ల ఆదాయాలు, ఒడిదుడుకులు ఎదురౌతాయ్.
పెట్టుబడి పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. మీకు ఊహించని ఖర్చులు ఉండవచ్చు. ఆర్థికంగా ఇబ్బందులను ఎదుర్కోవచ్చు. వృశ్చిక రాశి వారికి కుటుంపరంగా ఇబ్బందులను ఎదుర్కొంటారు. కుటుంబంలో చిన్న చిన్న గొడవలు రావచ్చు. దీంతో తాత్కాలికంగా విభేదాలు ఏర్పడతాయ్.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications