Latest Updates
-
సైలెంట్ కిల్లర్స్: పైకి ముక్కుసూటి.. వెనుక మహా కిలాడీలు!..ఈ 3 రాశులు ఎవరో తెలుసా? -
వినాయక చవితి స్పెషల్..ఇంట్లోనే ఈజీగా నోరూరించే చాక్లెట్ మోదక్ ఎలా చేసుకోవాలంటే.. -
ఫోన్ పక్కనపెట్టి ఇది ట్రై చేయండి.. హృతిక్ చెబుతున్న హెల్త్ టిప్స్! -
నార్త్ స్టైల్ చోలే మసాలా.. పూరీ, చపాతీలోకి వేళ్లు చప్పరిస్తూ లాగించేస్తారు.! -
చికెన్, మటన్ కంటే 50 రెట్లు బలం..ఏడాది పాటు నిల్వ ఉండే బోడకాకరకాయ పచ్చడి ఇలా చేయండి -
వయసు పైబడితేనే అల్జీమర్స్ వస్తుందా.. మతిమరుపునకు దారితీసే ప్రమాదకర కారకాలివే.! -
ఉద్యోగం వదిలి వ్యాపారం చేస్తే... ఈ రాశుల వారు కోటీశ్వరులు అవ్వడం పక్కా! -
నాన్‌వెజ్ అనుకుంటే పప్పులో కాలేసినట్లే.. వెజ్ ప్రియుల కోసం స్పెషల్ లివర్ ఫ్రై.. రెస్టారెంట్ టేస్ట్‌తో.! -
అమ్మమ్మల నాటి చిట్కా..గ్యాస్, ఎసిడిటి,అజీర్తి సమస్యలకు చెక్! -
కృష్ణాష్టమి ఉపవాసం ఉంటున్నారా? అయితే నీరసం రానివ్వని ఈ సగ్గుబియ్యం వడలు ట్రై చేయండి!
మీ మొబైల్ ఫోన్‌లో ఈ వాల్ పేపర్ ఉంటే.. రోజూ అదృష్టం మీ వెంటే.!
చాలా మందికి నిద్ర లేవగానే ఫోన్ చూడటం అలవాటు. ఫోన్ చూడనిదే వారికి రోజు స్టార్ట్ కాదు. ఫోన్ ఓపెన్ చేయగానే మనసుకి ప్రశాంతంగా అనిపించే ఫొటోలు చూడాలి. అందుకే తమ ఫోన్లలో వాల్ పేపర్లను ఆచితూచి సెలెక్ట్ చేసుకుంటారు. ఈ క్రమంలో ఎలాంటి వాల్ పేపర్లు మీ ఫోన్ స్క్రీన్‌పై ఉంటే మీకు అదృష్టం వరిస్తుందో, పాజిటివ్ ఎనర్జీ వస్తుందో పండితులు చెబుతున్నారు.

ఉదయిస్తున్న సూర్యుడు ప్రతి రోజూ కొత్త ఆరంభానికి ప్రతీక. మీ మొబైల్ ఫోన్‌లో వాల్ పేపర్‌గా సూర్యుడి ఫొటోను పెట్టుకోవడం శుభప్రదమని పండితులు చెబుతున్నారు. దీని ద్వారా సానుకూల శక్తి కలిగి రోజంతా ఉత్తేజంగా గడుస్తుంది. సూర్యుడి ప్రకాశవంతమైన కిరణాల నుంచి ప్రేరణ పొందుతారు.
ప్రకృతి చిత్రాలు
వాస్తు సిద్ధాంతం ప్రకారం ప్రకృతి సౌందర్యం మీ జీవితంలో ఎనలేని ఉత్సాహాన్ని నింపుతుంది. వ్యాపార రంగాల్లో ఉన్నవారు జలపాతాలు, పారే నీరు వంటి వాటిని మీ స్మార్ట్ ఫోన్‌లో వాల్ పేపర్‌గా పెట్టుకుని రోజూ ఉదయాన్నే లేవగానే చూసినట్లయితే మీ వ్యాపార వృద్ధి సానుకూలంగా ఉండి ధన లాభం కలుగుతుందని పండితులు చెబుతున్నారు.
చాలా మందికి తమ న్యూమరాలజీ ప్రకారం లక్కీ నంబర్లు ఉంటాయి. అలాంటి వాటిని విశ్వసించేవారు తమ మొబైల్ ఫోన్లలో కొన్ని నెంబర్లను పెట్టుకున్నట్లయితే సత్ఫలితం ఉంటుంది. 777, 111, 999, 333 నెంబర్లను కొంతమంది లక్కీగా భావిస్తారు. ఈ లక్కీ నంబర్లను వాల్ పేపర్‌గా పెట్టుకున్నట్లయితే మీలో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది.
వాల్‌పేపర్లుగా మనీప్లాంట్
ఆధ్యాత్మిక భావనతో నిండి ఉంటూ ఉదయాన్నే మనీ ప్లాంట్, వెదురు ముక్కలను వాల్‌పేపర్‌గా పెట్టుకుని చూసుకోవడం ద్వారా మీకు రోజంతా సానుకూలంగా ఉంటుంది. మొక్కలు శ్రేయస్సు, ఆర్థిక వృద్ధిని సూచిస్తాయి. ఆత్మవిశ్వాసం, నాయకత్వం, విజయానికి ప్రతీకలుగా సింహం, గద్దలను భావిస్తారు. ఈ ఫొటోలను వాల్ పేపర్లుగా పెట్టుకోవడం ద్వారా మీలో ఆత్మవిశ్వాసం మెరుగవుతుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications