Latest Updates
-
మనిషికి పంది కిడ్నీ.. ఏకంగా 271 రోజులు.. వైద్య చరిత్రలో మహాద్భుతం! -
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి! -
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.?
శని కన్నెర్ర..వచ్చే వారం నుంచి ఈ రాశుల వారికి దబిడి దిబిడే,వాహన ప్రమాదం కూడా
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం అత్యంత శక్తివంతమైన గ్రహాలలో శని గ్రహం ఒకటి. ఇది చాలా నెమ్మదిగా కదిలే గ్రహం కూడా. ఏ రాశిలో అయితే శని సంచరిస్తారో ఆ రాశిలో వారు చేసే పనుల ఆధారంగా ఫలితాలను పొందుతారు. ఏ వ్యక్తికి అయినా శనీశ్వరుడు అడ్డంకిని కలిగిస్తే ఆ సందర్భంలో ఇతర గ్రహాలు కూడా ఆ వ్యక్తికి ఎటువంటి సానుకూల ఫలితాలను ఇవ్వలేవని నమ్ముతారు. కర్మలకు అధిపతిగా భావించే శనీశ్వరుడు ప్రస్తుతం కుంభరాశిలో ఉన్నాయి.
ఈ నెల 27న శని కుంభరాశిలో అస్తమించనున్నాడు. శని అస్తమించడం అంటే ఆయన తన పూర్తి బలంతో ప్రభావం చూపలేడు. ఇది ఒక ఖగోళ పరిణామం,ఇది కాలానుగుణంగా జరుగుతుంది. ఒక గ్రహం అస్తమించినప్పుడు దాని శక్తి తగ్గుతుంది.కుంభరాశిలో శని అస్తమించడం కొన్ని రాశుల వారికి సానుకూల ఫలితాలను, మరికొన్ని రాశుల వారు ప్రతికూల ఫలితాలను ఇవ్వబోతుంది. కుంభరాశిలో శని అస్తమయం కారణంగా ప్రతికూల ఫలితాలు ఎదుర్కొనే రాశులు ఏవో ఇక్కడ చూడండి.

మిథున రాశి
మీ రాశి నుండి తొమ్మిదవ ఇంట్లో శని అస్తమించబోతున్నాడు. ఈ సమయంలో పని చేసే నిపుణులు, వ్యాపారవేత్తలకు అదృష్టం అనుకూలంగా ఉండదు. ఉద్యోగస్థులు ఆఫీసులలో చేసే పనిలో తీవ్రమైన అడ్డంకులను, వైఫల్యాలు ఎదురవుతాయి. శని అస్తమ స్థితిలో ఉండటం వల్ల అనేక రకాల ప్రతికూల ఆలోచనలు మనసులోకి రావచ్చు. ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. వాహనాలు నడుపుతున్నప్పుడు అత్యంత జగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యం కూడా బాగా ఇబ్బంది పెడుతుంది. ఆర్థికంగా కూడా బాగా కష్టాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది, ఖర్చులు చేయిదాటిపోతాయి. ఖర్చులను ఎప్పటికప్పుడు నియంత్రించుకోవాలి.
సింహరాశి
మీ రాశి నుండి ఏడవ ఇంట్లో శని అస్తమించబోతున్నాడు. ఈ సమయంలో స్నేహితుల కారణంగా ఇబ్బందులను ఎదుర్కోవలసి రావచ్చు కాబట్టి స్నేహితులకు రహస్యాలు చెప్పకుండా ఉండండి. వైవాహిక జీవితంలో సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగం చేసే వారు కార్యాలయంలో సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది, కాబట్టి ప్రణాళిక ప్రకారం పనిచేయడం ద్వారా విజయం సాధించవచ్చు. ఉన్నతాధికారులతోనూ,సహ ఉద్యోగులతో విభేదాలను ఎదుర్కొనే అవకాశం ఉంది.
తుల రాశి
శని అస్తమం తులారాశిలో ఐదవ గృహంలో జరుగుతుంది. దీంతో తులారాశి వ్యక్తులకు ఈ సమయంలో అనేక ఆరోగ్య సమస్యలు ఉంటాయి. ప్రేమలో ఉన్న వాళ్ళు సమస్యలను ఎదుర్కొంటారు. మీరు భవిష్యత్తు గురించి ఆందోళన చెందుతున్నట్లు అనిపించవచ్చు. విదేశాలకు వెళ్లాలని ప్రయత్నించేవారు సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. ఉద్యోగంలో ఉన్నవారికి వారి కష్టానికి ప్రశంసలు లభించవు, అధికారులతో పనికి సంబంధించి సమస్యలు ఎదురవుతాయి. విద్యార్థులు తమ చదువులలో ఇబ్బందులను ఎదుర్కొంటారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications
