Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
Shani Jayanthi 2024 : శనిజయంతి రోజు ఇలా చేస్తే.. దోషం తొలగిపోతుంది..!
ప్రతి సంవత్సరం శని జయంతిని జ్యోష్ట మాసంలో వచ్చే అమావాస్య రోజున శనిజయంతిని జరుపుకుంటారు. ఈ సంవత్సరం 2024లో శని జయంతిని జూన్ 6న జరుపుకోబోతున్నాం. శని జయంతి సందర్భంగా శని దేవుడిని ఎలా ప్రసన్నం చేసుకోవాలి, శని దోషాన్ని ఎలా తొలగించుకోవాలి లాంటి విషయాలను మీముందుకు తీసుకొని వస్తున్నాం.
జ్యోతిష్యంలో వున్న అన్ని గ్రహాల్లో శనిగ్రహాన్ని చాలా చెడుగా భావిస్తారు. ఈ శని గ్రహం వల్లే ఎన్నో పనులు కాకుండా ఆగిపోతాయని భావిస్తారు. శని అనగానే ప్రజల్లో భయం పుట్టుకొని వస్తుంది. అయితే శనిదేవుడు అప్పుడప్పుడూ వరాలు కూడా ఇస్తారు. శని గ్రహం కారణంలో ఎందరో తమ జీవితంలో చాలా కష్టాలను ఎదుర్కొంటూ వున్నారు. అన్ని గ్రహాల్లో శనీ చాలా నెమ్మదిగా కదులుతూ వుంటుంది. ఒక రాశి నుంచి మరో రాశికి వెళ్లాలంటే శనికి సుమారు రెండున్నర సంవత్సరాలు సమయం పడుతుంది. దీని వల్ల మనిషి జీవితాన్ని శని అతలాకుతలం చేస్తుంది.
శని ఎవరి జీవితంలోనైనా గానీ వస్తే వారు చాలా కష్టాలను ఎదుర్కోవలసి వస్తుంది. ఎవరి జాతకంలోనైతే శని బలంగా వుంటాడో వారు ఎక్కువగా సంపాదిస్తారు వారికి అన్ని రకాల సౌఖ్యాలు కలుగుతాయ్. అదే శని బలహీనంగా వుంటే ఎన్నో సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది.

శనిదోషం నుంచి తొలగాలంటే ఏమి చేయాలి
శనీశ్వరుడి వల్ల కష్టాలు ఎదుర్కొన్నప్పుడు జ్యోతిష్య పండితులు కొన్ని పరిష్కారాలు తెలిపారు. శని దోషం తొలగాలంటే కంచు లేదా ఇనుప గిన్నెలో ఆవాల నూనెను వేయాలి. అందులో రూపాయి నాణెంను వేసి అందుటో మీ రూపాన్ని చూసుకోవాలి. ఇక ఆ గిన్నెలోని నూనెలో బయట ఎవ్వరికైనా దానం చెయ్యాలి. ఎవ్వరూ తీసుకోకపోతే ఆ నూనెను ఏదైనా శనిదేవాలయానికి ఇచ్చేయాలి.
శని మంత్రాలను పఠించాలి
శని దేవునికి సంబంధించిన మంత్రాలను చదవాలి. పూజా సెంటర్లో శనిదేవుడికి సంబంధించిన పూజా పుస్తకాన్ని తీసుకొని అందులో వున్న మంత్రాలను చదివితే శని ప్రభావం తగ్గే అవకాశం వుంది. శని దేవుడిని తలచుకుంటూ..
ఓం ప్రం ప్రీం ప్రౌన్ సహ శనైశ్చరాయ నమ: ' అంటూ శని దేవుని మంత్రాలను చదవాలి. ఒం శం శనీశ్చరాయై నమ: అనే మంత్రాన్ని కూడా చదవాలి. వీలైనంత ఎక్కువగా ఈ మంత్రాలను పఠించాలి. నవగ్రహాల ఆలయానికి వెళ్లి అక్కడ శనిదేవుడికి ఆరతినివ్వండి. శని చాలీసా కూడా చదవండి.
దానం చేయండి
శని జయంతి రోజున ఏదైనా దానం చెయ్యాలి. శని దేవుడి కోసం ఉపవాసం అయినా వుండాలి. శని దేవుడికి సంబంధించిన వస్తువులను దానం చెయ్యాలి. నల్ల రంగుతో వున్న వస్తువులన్నీ శనికి సంబంధించినవే. నల్ల గొడుగు, నల్ల నువ్వులు, నల్ల బట్టలు, నల్ల చెప్పులు ఇలా ఏది నల్లగా వున్నా బయట ఎవరికైనా దానం చేసేందుకు ప్రయత్నించాలి. అలా చేయడం వల్ల కూడా మీపై శని అనుగ్రహం వుంటుంది.
శని నుంచి రక్షించుకోవాలంటే
హనుమంతుడిని ఎవరైతే ఆరాధిస్తారో వారిపై శని ప్రభావం తక్కువగా వుంటుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. హనుమంతుడి ఆశీస్సుల కోసం హనుమంతుడి పూజ చేయడం మరిచి పోవద్దు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications