Latest Updates
-
వినాయక చవితి స్పెషల్..ఇంట్లోనే ఈజీగా నోరూరించే చాక్లెట్ మోదక్ ఎలా చేసుకోవాలంటే.. -
ఫోన్ పక్కనపెట్టి ఇది ట్రై చేయండి.. హృతిక్ చెబుతున్న హెల్త్ టిప్స్! -
నార్త్ స్టైల్ చోలే మసాలా.. పూరీ, చపాతీలోకి వేళ్లు చప్పరిస్తూ లాగించేస్తారు.! -
చికెన్, మటన్ కంటే 50 రెట్లు బలం..ఏడాది పాటు నిల్వ ఉండే బోడకాకరకాయ పచ్చడి ఇలా చేయండి -
వయసు పైబడితేనే అల్జీమర్స్ వస్తుందా.. మతిమరుపునకు దారితీసే ప్రమాదకర కారకాలివే.! -
ఉద్యోగం వదిలి వ్యాపారం చేస్తే... ఈ రాశుల వారు కోటీశ్వరులు అవ్వడం పక్కా! -
నాన్‌వెజ్ అనుకుంటే పప్పులో కాలేసినట్లే.. వెజ్ ప్రియుల కోసం స్పెషల్ లివర్ ఫ్రై.. రెస్టారెంట్ టేస్ట్‌తో.! -
అమ్మమ్మల నాటి చిట్కా..గ్యాస్, ఎసిడిటి,అజీర్తి సమస్యలకు చెక్! -
కృష్ణాష్టమి ఉపవాసం ఉంటున్నారా? అయితే నీరసం రానివ్వని ఈ సగ్గుబియ్యం వడలు ట్రై చేయండి! -
పెళ్లిళ్లు, పండుగల్లో అమ్మాయిలూ జాగ్రత్త.. మెహందీ పెట్టుకుంటే పొట్ట ఇన్ఫెక్షన్ల ప్రమాదం.!
శతభిష నక్షత్రంలోకి శని సంచారం:ఈ రాశుల వారు ఊహించని లాభాలు పొందుతారు, నెరవేరని ప్రతి కోరికను'శని' తీరుస్తాడు
శతభిష నక్షత్రంలోకి శని సంచారం: ఈ రాశుల వారు ఊహించని లాభాలు పొందుతారు, నెరవేరని ప్రతి కోరికను 'శని' తీరుస్తాడు!
వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు రాశిని మార్చినట్లే, నక్షత్రాలను కూడా స్థానాలను ఎప్పటికిప్పుడు మారుస్తాయి. ఆ క్రమంలో ఈ మార్చి నెలలో శని నక్షత్రం మారనుంది. మార్చి 15, 2023న శని నక్షత్రం మొదటి దశకు చేరుకుంటుంది ఇక్కడ అక్టోబర్ 17 వరకు శతభిషా నక్షత్రంలో ఉంటాడు.

శని, న్యాయ దేవుడు అన్న విషయం మనందరికి తెలిసిన విషయమే. ప్రస్తుతం శని తన సొంత రాశి అయిన కుంభరాశిలో ఉన్నాడు. 30 ఏళ్ల తర్వాత కుంభరాశిలో ఉన్న శని ఇప్పుడు మార్చి 15న రాశిని మార్చుతున్నాడు. శని కుంభరాశిని దాటిన తర్వాత శతభిషా నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు.
శని తదుపరి 7 నెలలు అంటే అక్టోబర్ 17, 2023 వరకు శతభిషా నక్షత్రంలో ఉంటాడు. శతభిషా నక్షత్రానికి రాహువు అధిపతి మరియు అందులో శని ప్రవేశం వల్ల మొత్తం 12 రాశుల మీద ప్రభావాన్ని చూపుతుంది. అయితే ఈ 5 రాశుల వారికి మాత్రం శని బలమైన ప్రయోజనాలను అందివ్వనున్నాడు.

మేషరాశి
శని శతభిషా నక్షత్రంలో ప్రవేశించడం వల్ల మేష రాశి వారికి చాలా ప్రయోజనాలు పొందుతారు. వ్యాపారస్తులు కొత్త పనులు ప్రారంభించడానికి ఇది ఉత్తమ సమయం. ఆర్థిక ప్రయోజనం పూర్తిగా పొందుతారు. ఆదాయం పెరుగుతుంది. మీరు ప్రతి పనిలో విజయం సాధిస్తారు. అదృష్టం మీ వెంటే ఉంటుంది.

మిథున రాశి:
శని శతభిసా నక్షత్రంలోకి ప్రవేశించగానే మిథున రాశి వారికి ఏ పెద్ద కలనైనా నెరవేర్చగలదు. విదేశాలకు వెళ్లే అవకాశాలు మెండుగా కనబడుతున్నాయి. మీరు మీ కెరీర్‌లో గొప్ప విజయాన్ని పొందుతారు. ఆదాయం పెరుగుతుంది. కొన్ని సవాళ్ళు ఎదురైనా మీకు వచ్చిన ఈ అవకాశాన్ని వదులుకోవద్దు.

సింహ రాశి
శనిగ్రహం శతభిష నక్షత్రంలోకి ప్రవేశించడం తో సింహ రాశి వారికి కెరీర్‌లో గొప్ప విజయం వైపు దూసుకుపోయేలా చేస్తుంది. సింహరాశి వారు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న ఆ విజయాన్ని సాధిస్తారు. ఉద్యోగాలు మారాలనుకునే వారికి ఇది మంచి సమయం. వ్యాపారం మరియు ఆస్తిలో కూడా లాభం ఉంటుంది.

తులా రాశి
రాహువు నక్షత్రం శతభిషలో శని ప్రవేశం తులారాశి వారి వృత్తి జీవితంలో పెద్ద పురోగతిని కలిగిస్తుంది. కొత్త ఉద్యోగ అవకాశాలు మెండుగా ఉన్నాయి.ఈ రాశి వారికి అన్నింటా శుభ ఫలితాలను పొందుతారు. అధిక ధనలాభం ఉంటుంది. కొత్త ఆదాయ వనరులు ఏర్పడతాయి. వివాహం యోగం ఉంది. జీవితంలో ఆనందం మాత్రమే ఉంటుంది.

ధనుస్సు రాశి
శనిగ్రహం ధనుస్సు రాశిలో సంచారం వల్ల శుభ ఫలితాలను ఇస్తుంది. ఈరాశి వారు ప్రతి పనిలో విజయం సాధిస్తారు. పదోన్నతి, జీతం పెరగడానికి బలమైన అవకాశాలు ఉన్నాయి. మీరు కోరుకున్న ఉద్యోగం పొందుతారు. వ్యాపారస్తులకు కూడా పెద్ద మొత్తంలో డబ్బు వస్తుంది.

మకరరాశి
శనిగ్రహం మకరరాశిలో సంచారం చేయు సమయంలో ఈ రాశి వారికి అపారమైన ఆర్థిక ప్రయోజనాలు అందిస్తాడు. వ్యాపారస్థులకు మంచి లాభం. మీరు అకస్మాత్తుగా పెద్ద లాభం పొందవచ్చు. మీరు మీ కుటుంబంతో మంచి సమయాన్ని గడుపుతారు మరియు మీ ఆర్థిక స్థితి మెరుగ్గా ఉంటుది.



Click it and Unblock the Notifications