Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
శని, రాహువుల కలయిక.. అక్టోబర్ వరకు ఈ 3 రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి.. మీ రాశి ఉందా చూస్కోండి
వేదజ్యోతిష్యం ప్రకారం నవ గ్రహాల్లో శని గ్రహానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. శని ఎలాంటి స్థితిలో ఉన్నాడో అనేది ప్రతి ఒక్కరి జీవితానికి అత్యంత కీలకం. శని బలహీనంగా ఉంటే తీవ్రమైన సమస్యలు, ఆర్థిక కష్టాలు ఇబ్బందిపెడతాయి. కాగా, శని.. రాహువుకు అధిపతి అయిన శతభిషా నక్షత్రంలో సంచారం చేస్తున్నాడు. ఈ సమయంలో శని-రాహువు కలయిక కారణంగా కొన్ని రాశుల వారిపై అశుభ ప్రభావం పడే అవకాశం కనిపిస్తోంది. అక్టోబర్ 17వ తేదీ వరకు శని శతభిషా నక్షత్రంలోనే సంచరించనున్నాడు. ఇది కొన్ని రాశుల వారికి ఏమాత్రం మంచిది కాదు. ఆ రాశుల వారు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.

కన్య రాశి
కన్యరాశి వారు అక్టోబర్ వరకు అనేక సమస్యలను ఎదుర్కొంటారు. తరచుగా డిప్రెషన్ కు కూడా లోనవుతారు. ఆరోగ్యం విషయంలో మరింత జాగ్రత్తగా ఉండటం చాలా అవసరం. బయటి ఫుడ్ తినడాన్ని వీలైనంత మేరకు తగ్గించాలి. ఈ సమయంలో ఆర్థిక పరిస్థితి ఏమాత్రం అనుకూలంగా ఉండదు. ఇంటి ఖర్చుల కోసం అప్పు చేయాల్సిన పరిస్థితి వస్తుంది. అలాగే అక్టోబర్ వరకు కొత్త పనులు ప్రారంభించవద్దు. అలాగే ఎందులో అయినా పెట్టుబడి పెట్టే ఆలోచనల్లో ఉండే చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. నిపుణుల సలహా తీసుకోండి. అక్టోబర్ 17 తర్వాత కాలం కలిసి వస్తుంది. ఆర్థిక పరిస్థితి గతంలో కంటే మెరుగుపడుతుంది. పెట్టే పెట్టుబుల్లో మంచి లాభాలు పొందుతారు. కష్టానికి రెట్టింపు ఫలితం వస్తుంది.
మీనరాశి
మీనరాశి వారు అక్టోబర్ వరకు అనవసరమైన ఖర్చులను ఎదుర్కొంటారు. ఇది రాశిచక్ర గుర్తులను ప్రభావితం చేస్తుంది. అనారోగ్యం బారిన పడతారు. మోకాలు సంబంధిత సమస్యతో బాధపడతారు. జీవిత భాగస్వామితో సమస్యలను ఎదుర్కొంటారు. అనవసర ప్రయాణాలు చేయాల్సి రావొచ్చు. అక్టోబర్ వరకు ఉద్యోగస్తులు కాస్త జాగ్రత్తగా ఉండాలి. సహోద్యోగులతో విభేదాలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అక్టోబర్ 17 తర్వాత జాతకంలో అద్భుతమైన మార్పు కనిపిస్తుంది. ఆరోగ్యం ఉన్నట్టుండి మెరుగుపడటం చూస్తారు. ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి. స్థిరంగా ఆదాయం రావడం మొదలవుతుంది. పెండింగ్ పనులు కూడా పూర్తవుతాయి.
వృశ్చికరాశి
వృశ్చికరాశి వారు అక్టోబరు వరకు వృత్తి, వ్యాపారాల్లో సమస్యలను ఎదుర్కొంటారు. ప్రభుత్వ ఉద్యోగులు పై అధికారులతో విభేదాలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రేమికులు జాగ్రత్తగా ఉండాలి. భాగస్వామితో జరిగే చిన్న పాటి కలహాలు కూడా బంధాన్ని బీటలు వార్చేలా చేస్తుంది. ఈ సమయంలో ఆరోగ్య సమస్యలు చుట్టుముడతాయి. రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. డ్రైవింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా, అప్రమత్తంగా ఉండండి. అక్టోబరు 17 వ తేదీ తర్వాత రాహు, శని ప్రభావం తగ్గుతుంది. దీంతో ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. దంపతుల మధ్య, ప్రేమికుల మధ్య కలహాలు దూరమై సాన్నిహిత్యం పెరుగుతుంది.
Disclaimer: ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ వ్యాసాన్ని రాయడం జరిగింది. కచ్చితత్వానికి, విశ్వసనీయతకు ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. Boldsky Telugu ఈ వ్యాసానికి సంబంధించిన ఏ విషయాన్నీ నిర్ధారించడంలేదు. ఈ వ్యాసం ఉద్దేశం సమాచారం అందించడం మాత్రమే. ఏదైనా పాటించే ముందు సంబంధిత నిపుణుల సలహా తీసుకోగలరు.



Click it and Unblock the Notifications